ఆహా..ఓహో అన్నట్లు చంద్రబాబు చెప్పుకొచ్చారు.. | CM YS Jagan Slams Chandrababu Over Zero Interest Loan for Farmers | Sakshi
Sakshi News home page

సున్నా వడ్డీ పథకం పూర్తిగా సున్నా: సీఎం జగన్

Published Fri, Jul 12 2019 10:38 AM | Last Updated on Fri, Jul 12 2019 2:43 PM

CM YS Jagan Slams Chandrababu Over Zero Interest Loan for Farmers - Sakshi

సాక్షి, అమరావతి: సున్న వడ్డీ పథకాన్ని బ్రహ్మాండంగా అమలు చేశామని చంద్రబాబు నాయుడు చెబుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సున్నావడ్డీ పథకం పూర్తిగా సున్నా అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. శుక్రవారం అసెంబ్లీలో ఈ పథకంపై చర్చ సందర్భంగా వైఎస్సార్‌సీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గత టీడీపీ ప్రభుత్వ తీరునుఎండగట్టారు. ఓ దశలో ముఖ్యమంత్రి ప్రసంగానికి విపక్ష సభ్యులు అడ్డుపడ్డుకున్నారు. దీంతో టీడీపీ సభ్యుల తీరుపై ముఖ్యమంత్రి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో దౌర్జన్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, టీడీపీ తరఫున సభకు వచ్చినవారంతా అలాగే ప్రవర్తిస్తున్నారన్నారు. రౌడీలు, గుండాల్లా సభలో వ్యవహరించవద్దని ఆయన హితవు పలికారు.

వ్యవసాయ రుణాల్లో సున్నా వడ్డీ పథకానికి నిధులు ఇవ్వకపోయినా ఇచ్చామని చెప్పుకుంటున్నారని, అందుకే ప్రజలు టీడీపీ ప్రభుత్వాన్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘ సభలో వారి నాయకుడు ఎలా ఉంటారో, వారి సభ్యులు కూడా అలాగే ఉంటారు. సున్నా వడ్డీ పథకానికి నిధులు ఇవ్వకపోయినా ఇచ్చామన‍్నారు. అందుకే ప్రజలు టీడీపీ ప్రభుత‍్వానికి బుద్ధి చెప్పారు. వడ్డీ లేని రుణాల విషయంలో  చంద్రబాబు ఆహా...ఓహో అన్నట్లు జాతీయ స్థాయిలో గొప్పగా అమలు చేసినట్లు చెబుతున్నారు. 2014-15 ఏడాదికి 29,659 కోట్ల పంట రుణాలు ఉన్నాయి.

సున్నా వడ్డీ పథకానికి రూ.118 కోట్లు కడితేనే బ్యాంకులు రైతులకు వడ్డీలేని రుణాలు ఇస్తాయి. చంద్రబాబు ప్రభుత్వం రూ.43.31కోట్లు మాత్రమే కట్టింది. 2015-16 ఏడాదిలో 2,283 కోట్లు కట్టాల్సిన పరిస్థితుల్లో రైతులకు ఇచ్చింది రూ.31 కోట్లు మాత్రమే. 2016-17లో సున్నా వడ్డీ పథకానికి రూ.2,354కోట్లు కట్టాల్సిన పరిస్థితుల్లో రైతులకు ఇచ్చింది కేవలం రూ.249 కోట్లు మాత్రమే. అలాగే 2017-18లో సున్నా వడ్డీ పథకానికి రూ.2,703 కోట్లు కట్టాల్సి ఉండగా రైతులకు ఇచ్చింది రూ.182 కోట్లు. ఇక 2018-19లో సున్నా వడ్డీ పథకానికి రూ.3,069 కట్టాల్సి ఉండగా రైతులకు ఇచ్చింది రూ.122 కోట్లు. అయిదేళల్లో సున్న వడ్డీ పథకానికి రూ.11,595 కోట్లు ఇవ్వాల్సి ఉంటే రూ.630కోట్లు మాత్రమే చంద్రబాబు సర్కార్‌ చెల్లించింది. సున్నా వడ్డీ పథకంలో 95 శాతం ఇవ్వకుండా కేవలం 5 శాతం మాత్రమే ఇచ్చింది. గత ప్రభుత్వం చేసిన మోసానికి రైతులు రూ.11వేల కోట్లు మోసపోయారు’  అని వ్యాఖ్యానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement