టీడీపీ ప్రశ్నకు ఆర్థిక మంత్రి బుగ్గన వివరణ | Buggana Rajendranath Reddy Clarity On TDP Question | Sakshi
Sakshi News home page

టీడీపీ ప్రశ్నకు ఆర్థిక మంత్రి బుగ్గన వివరణ

Published Fri, Jul 12 2019 6:52 PM | Last Updated on Fri, Jul 12 2019 7:19 PM

Buggana Rajendranath Reddy Clarity On TDP Question - Sakshi

సాక్షి, అమరావతి: రైతులకు సున్నా వడ్డీ వర్తించేలా రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వందకోట్లను కేటాయించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్ష టీడీపీ సభ్యులు ప్రశ్నను లేవనెత్తడంతో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి వారికి వివరణ ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం పత్రికా ప్రకటనను విడుదల చేశారు.

‘మా ప్రభుత్వం వైఎస్సార్‌ పేరుతో రైతులకు వడ్డీలేని రుణాల పథకాన్ని ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుత బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.100 కోట్లు కేటాయించింది. దీనిపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఈ డబ్బు ఎలా సరిపోతుందన్న ప్రశ్నను లేవనెత్తింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుతం జులై నెల రెండో వారంలో ఉన్నాం. ఇటీవలే ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో రూ.87 వేల కోట్లు మేరకు పంట రుణాలుగా ఇవ్వాలని నిర్ణయించాం. ఈ రుణాలను సకాలంలో చెల్లించిన రైతులకు వచ్చే ఏడాది నుంచి అంటే.. ఏప్రిల్‌ 1, 2020తో ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి, వచ్చే బడ్జెట్‌లో సున్నావడ్డీ రుణాలకు కేటాయింపులు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించాం. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి వడ్డీలేని రుణాలకు కట్టాలి కాబట్టి కేటాయింపులు భారీగా పెరగబోతున్న విషయాన్ని అందరూ తెలుసుకోవాల్సిన అవసరముంది’ అంటూ ఆర్థిక మంత్రి వివరించారు.

చదవండి: అసెంబ్లీలో ఏపీ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన బుగ్గన 
చదవండి: రైతులపై వరాలు కురిపించిన ఏపీ బడ్జెట్‌
చదవండి: వ్యవసాయ బడ్జెట్‌ కేటాయింపులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement