ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసనసభలో స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ సభ్యుల వైఖరిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సభను హుందాగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. ఒకసమయంలో.. ‘ఇదేమీ ఫిష్ మార్కెట్ కాదు. ప్రజలందరూ మనల్ని గమనిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత మాట్లాడేటప్పుడు ఏ ఒక్కరూ అంతరాయం కలిగించొద్దు’అని అసహనం వ్యక్తం చేశారు.