సాక్షి, అమరావతి: అయిదేళ్లు ప్రజాకంటక పాలన అందించడంతో ఓటరు మహాశయులు టీడీపీని ప్రతిపక్షానికి పరిమితం చేశారు. అయినప్పటికీ వారు తమపాత్రను నిర్వహించకుండా.. అధికారం కోల్పోయామన్న అసహనంతో వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రజానీకానికి అన్నీ చేశామని డబ్బాకొట్టుకుంటున్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, మరికొందరి మాటల్లో ఈ విషయం మరోసారి స్పష్టమైంది.
ప్రెస్‌మీట్‌లో వారు మాట్లాడుతూ.. రుణాలపై వడ్డీ పూర్తిగా మాఫీ చేశామని అన్నారు. అయితే, ఎంత వడ్డీ మాఫీ చేశారంటూ మీడియా సభ్యులు ఎమ్మెల్యేలను ప్రశ్నించడంతో సమాధానం చెప్పకుండా వారు చిందులు తొక్కారు. విలేకరులు పార్టీ ప్రతినిధులుగా వ్యవహిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. అధికార పక్షాన్ని ప్రశ్నించాలంటూ దాటవేశారు. ‘మే చేయాల్సింది చేశాం. కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు’ అంటూ అక్కడినుంచి తప్పుకున్నారు. ఎమ్మెల్యేల వ్యాఖ్యలతో మీడియా ప్రతినిధులు అవాక్కయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment