Acchennaidu
-
‘అచ్చెన్నా.. లోకేష్ బాబు కోసం జనాలు రెడీ.. నాలుగు రోజులకు బుక్ చేశా’
తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా చంద్రబాబు ప్రతిష్టాత్మకమంటూ ప్రచారం చేసిన లోకేష్ పాదయాత్ర జనం లేక తుస్సుమంటోందని తెలుగు తమ్ముళ్లే చెబుతున్నారు. సొంత జిల్లా చిత్తూరులోనే స్పందన లేకపోవడంతో నిన్న అంతా పార్టీ అధినేత చంద్రబాబు ఆందోళన పడ్డారు. హడావిడిగా పార్టీ సమీక్షా సమావేశమంటూ ఓ టెలికాన్ఫరెన్స్ పెట్టి.. స్థానిక నేతల చెవులు తుప్పు వదిలేలా క్లాసులు తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం చిత్తూరు రూరల్‌లో జరుగుతున్న పాదయాత్రకు నిన్న కనీస స్పందన కరువవడంతో ఎక్కువ సమయం క్యారవాన్‌కే లోకేష్ పరిమితమయ్యారని పార్టీ నేతలు చెప్పుకున్నారు. ఇదే విషయం చంద్రబాబుకు కూడా చెప్పినట్టు తెలిసింది. దీంతో, టెలికాన్ఫరెన్స్‌లో స్థానిక నేతలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారట చంద్రబాబు. - సాయంత్రం లోకేష్ సభకు జనం ఎందుకు లేరు? - ముందుగా ఎందుకు ప్రచారం చేయలేదు? - ఇంతగా చెప్పినా జనం ఎందుకు రావడం లేదు? - ఏమన్నా చేయండి.. లోకేష్ కోసం జనం రావాలి.. ఇవీ చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్‌లో ఇచ్చిన ఆదేశాలు. ఏ సభకయినా జనం స్వచ్ఛందంగా రావాలి కానీ.. ఇదేం గోల అంటూ స్థానిక నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా ప్రజా నేత అంటే ఆకట్టుకునేలా ప్రసంగించాలి, ఆదర్శంగా నిలవాలి కానీ.. వచ్చిన వారు షాకయ్యే స్టేట్మెంట్లు ఇస్తే మేమేం చేయాలి అంటూ కొందరు నేతలు పక్కకు వచ్చి గుసగుసలాడారట. ఇక పరిస్థితి మరీ దిగజారిపోవడంతో అచ్చెన్నాయుడు రంగంలోకి దిగారు. జిల్లానేతలతో ఆయన చేసిన సంభాషణ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అచ్చెన్నాయుడితో జీడీ నెల్లూరు నియోజకవర్గం ఇన్ఛార్జీ బీమినేని చిట్టిబాబు ఫోన్లో చెప్పిన అంశాలు వైరల్‌గా మారాయి. "ఆఫీసులో పర్మిషన్ తీసుకుంటున్నాను. మీరు చెప్పినట్టుగా ఉదయాన్నే నేను.. 8 గంటల కల్లా ఒక వెయ్యి మంది వచ్చేట్టుగా వెహికిల్స్‌తో అరేంజ్ చేశాను. రోజూ కూడా పాదయాత్ర స్టార్ట్ అయ్యేలోగా ఆరు మండలాల్లో.. 50 వెహికిల్స్ పెడతాం. 300 వెహికిల్స్‌కు అల్రెడీ డబ్బులు ఇచ్చేశాను. నాలుగు రోజులకు బుక్ చేశాను. దాని తర్వాత ప్రతీరోజు మూడు వేల మందిని తీసుకుని అక్కడకు రావాలని చెప్పాను అన్న" అని మాట్లాడుకున్నారు. మొత్తమ్మీద చిన బాబు పాదయాత్ర ఏంటో కానీ.. అరువు తెచ్చుకున్న జనంతో అష్టకష్టాలు పడాల్సి వస్తోందని వాపోతున్నారు స్థానిక నేతలు. గత వారం వరకు స్థానికంగా జనం అందుబాటులో లేకపోగా.. తమిళనాడు నుంచి అతి కష్టమ్మీద తెలుగు మాట్లాడే వాళ్లను గుర్తించి తీసుకొచ్చామని, మళ్లీ మళ్లీ జనాన్ని తెమ్మంటే ఏం చేయగలమని చెప్పుకుంటున్నారు. -
టీడీపీలో యూజ్ అండ్ త్రో పాలసీ..! అచ్చెన్న వ్యాఖ్యలు నిజమే?
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : తెలుగుదేశం పార్టీలో యూజ్ అండ్ త్రో పాలసీ మరోసారి తెరపైకి వచ్చింది. పాతపట్నం టీడీపీలో ‘చేతిచమురు’తో క్రియాశీలకంగా వ్యవహరించిన మామిడి గోవిందరావు విషయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు గతంలో చేసిన వ్యాఖ్యలే నిజమయ్యాయి. పార్టీ కోసం ఎంత ఖర్చు పెడుతున్నా కూరలో కరివేపాకు మాదిరిగానే వాడుకుంటున్నట్టు మరోసారి స్పష్టమైంది. మామిడి వెంట తిరుగుతున్న వారిపై వేధింపులు ప్రారంభించి.. తనను కాదని వెళ్లితే టార్గెట్ చేయక తప్పదని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జి కలమట వెంకటరమణ తన చేతల ద్వారా చూపిస్తున్నారు. అధినేతలు తన మాటకే విలువ ఇస్తారని టీడీపీ కేడర్‌కు సంకేతాలు ఇస్తున్నారు. ఇప్పుడీ వ్యవహారం పాతపట్నం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. కేడర్‌కు వేధింపులు.. టీడీపీలో డబుల్ గేమ్ నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, మరో నేత మామిడి గోవిందరావు మధ్య ఆసక్తికర పోరు నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తనకే టిక్కెట్ వస్తుందనే విధంగా గోవిందరావు దూకుడుగా వెళ్తున్నారు. టీడీపీలో ఉన్న అరకొర కేడర్‌ను నయానో భయానో తనవైపు తిప్పుకుంటున్నారు. దీంతో అక్కడ పార్టీ ఇన్చార్జిగా ఉన్న కలమట వెంకటరమణ ఉనికి తగ్గింది. అటు లోకేష్‌ను, ఇటు చంద్రబాబును తరుచూ కలుస్తూ, వాటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వదులుతూ గోవిందరావు హడావుడి చేస్తున్నారు. అధిష్టానం వద్దే మామిడికే ప్రాధాన్యత ఉందని టీడీపీలో ఉన్న కార్యకర్తలు ఒక్కొక్కరిగా మామిడి వైపు వస్తున్నారు. ఈ పరిణామాలను గమనించిన కలమట ..ఇంకా వదిలేస్తే తన అస్థిత్వానికే ముప్పుతప్పదని గ్రహించి యాక్షన్‌లోకి దిగారు. కేడర్ చేజారిపోకుండా జాగ్రత్తపడ్డారు. తన నుంచి వెళ్తున్న నాయకులు, కార్యకర్తలపై వేధింపులు మొదలు పెట్టారు. పార్టీ పదవులుండి.. మామిడి వెంట వెళ్తున్న నాయకులపై వేటు వేయిస్తున్నారు. దానికొక ఉదాహరణగా ఎల్‌ఎన్‌పేట పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వెలమల గోవిందరావు తాజాగా మామిడి గోవిందరావు వెంట వెళ్లడంతో ఆయన పదవిని తొలగించారు. అచ్చెన్నాయుడు, రామ్మోహన్నాయుడు, కూన రవికుమార్లకు చెప్పి హుటాహుటీన వెలమల గోవిందరావుకు ఉన్న మండల పార్టీ అధ్యక్ష పదవిని మెండ మనోహార్ అనే వ్యక్తికి కట్టబెట్టారు. దీంతో మామిడి వెంట ఉన్న వెలమల గోవిందరావు మరికొందరు నాయకులు ఎదురుదాడి చేసి కలమటపై ఆరోపణలు చేసినా అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. ఇదంతా చూస్తుంటే నిమ్మాడలో అచ్చెన్నాయుడు చెప్పినట్టు మామిడి గోవిందరావును వాడుకోవడానికే తప్ప అంతకుమించి ఏమీ లేదన్న వ్యాఖ్యల్ని నిజం చేస్తున్నట్టుగా జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఆ రోజు..మామిడి గోవిందరావుకు టికెట్ ఇచ్చే ఆలోచన లేదని.. కలలో కూడా ఊహించొద్దని...నీ కోసం వాడుకోవడానికే ఉపయోగిస్తున్నానని.. పార్టీ కోసం డబ్బులిస్తున్నాడు.. తరుచూ చెక్‌లు తీసుకొచ్చి ఇస్తున్నాడు.. చెక్ కాదు కదా ఆస్తి రాసిచ్చినా పార్టీకి వాడుకుంటాం.. వాడుకోవాలన్నదే నా ఉద్దేశమని కలమట వెంకటరమణకు అచ్చెన్నాయుడు చెప్పిన మాటలు ఇప్పుడు నిజమయ్యాయనిపిస్తోంది. మామిడి గోవిందరావు ఎంత ఖర్చు పెట్టినా, ఎవరి వద్దకు తిరిగినా మా మద్దతు నీకే అన్నట్టుగా కలమటకు అనుకూలంగా అధినేతలంతా వ్యవహరిస్తున్నారు. దీంతో పారీ్టలో అంతర్గత పోరు మరింత ఎక్కువైనట్లయ్యింది. -
వారికి శిక్ష తప్పదు..!
సాక్షి, విజయవాడ: ఈఎస్ఐ కుంభకోణం తమ దృష్టికి వచ్చిందని జాతీయ లేబర్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్ జయప్రకాష్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈఎస్ఐలో జరిగిన అవినీతిని కేంద్ర కార్మిక శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. కేంద్ర దర్యాప్తు బృందంతో విచారణ జరపాలని కేంద్రమంత్రిని కోరతామని చెప్పారు. ఈఎస్ఐ అవినీతికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. అచ్చెన్నాయుడు ప్రధాని పేరును వాడుకోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఈఎస్ఐలో ఎన్నో అవకతవకలు జరిగినట్లు సమాచారం ఉందని వెల్లడించారు. తెలంగాణలో అవినీతికి పాల్పడిన కంపెనీలే ఏపీలో కూడా అవినీతికి పాల్పడ్డాయని చెప్పారు. అవినీతి పాల్పడిన వారికి శిక్ష తప్పదని జయప్రకాష్ స్పష్టం చేశారు. (ఈఎస్ఐ స్కామ్ : తవ్వేకొద్దీ బయటపడుతున్నభారీ అక్రమాలు) -
అక్రమాలపై విచారణకే ‘సిట్’
విజయనగరం గంటస్తంభం: రాజధాని అమరావతి నిర్మాణంలో అక్రమాలు జరిగాయని, దానిపై విచారణ జరిపేందుకే ‘సిట్’ను నియమించినట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఈ నెల 24వ తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన ఏర్పాట్లపై శనివారం కలెక్టరేట్లో అధికారులతో మంత్రి బొత్స సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. అమరావతిలో అక్రమాలు, దోపిడీ జరగలేదని, దమ్ముంటే విచారణ చేయాలని గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులే అన్నారని గుర్తుచేశారు. విచారణ చేసేందుకు ‘సిట్’ వేస్తే ఇప్పుడు కక్షపూరితం అంటున్నారని మండిపడ్డారు. అమరావతి అభివృద్ధి కోసం రూ.17,800 కోట్లుతో టెండర్ వేసి, అంచనాలు పెంచి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆర్కీవ్స్ ఫీజ్ కింద రూ.842 కోట్ల చెల్లింపులు చేసేందుకు ఒప్పందం చేసుకుని, రూ.300 కోట్లకుపైగా చెల్లించారన్నారు. దీనిపై విచారణ జరిపిస్తున్నామన్నారు. వాస్తవాలను నిర్ధారించేందుకు ‘సిట్’ వేసినట్టు వెల్లడించారు. కులాలు, పార్టీల వారీగా చట్టాలు తెచ్చుకోవాలా? ఈఎస్ఐ కుంభకోణంలో బీసీ మంత్రిని కావున టార్గెట్ చేస్తున్నారన్న టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు వాఖ్యలను మంత్రి బొత్స తప్పుబట్టారు. గతంలో అసెంబ్లీలో టీడీపీ నాయకులు తనను ఉద్దేశించి ఎన్నో మాటలన్నారని, అప్పుడు నేను బీసీ మంత్రిని కాదా? అని ప్రశ్నించారు. టీడీపీలో ఉన్నవారే బీసీలా? అని నిలదీశారు. చట్టం ముందు ఎవరైనా ఒక్కటేనని, తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందేనని తేల్చిచెప్పారు. విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేశారు. కులాలు, పార్టీల వారీగా చట్టాలు తెచ్చుకోవాలా? అని వ్యాఖ్యానించారు. అక్రమాలు గురించి మాట్లాడితే ప్రధానమంత్రి పేరు చెబుతున్నారని, అక్రమాలు చేయమని ఆయన చెప్పారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఒక విధానం చెబుతుందని, దోచేయాలని చెప్పదన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, బొత్స అప్పలనరసయ్య తదితరులు పాల్గొన్నారు. -
అచ్చెన్నాయుడు, రవికుమార్లకు నోటీసులు
సాక్షి, అమరావతి : స్పీకర్ తమ్మినేని సీతారాంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కూన రవికుమార్లకు అసెంబ్లీ సెక్రటరీ మంగళవారం సభాహక్కుల నోటీసులు పంపారు. నోటీసులపై వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసులో ఆదేశించారు. -
అవాక్కైన మీడియా ప్రతినిధులు..!
సాక్షి, అమరావతి: అయిదేళ్లు ప్రజాకంటక పాలన అందించడంతో ఓటరు మహాశయులు టీడీపీని ప్రతిపక్షానికి పరిమితం చేశారు. అయినప్పటికీ వారు తమపాత్రను నిర్వహించకుండా.. అధికారం కోల్పోయామన్న అసహనంతో వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రజానీకానికి అన్నీ చేశామని డబ్బాకొట్టుకుంటున్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, మరికొందరి మాటల్లో ఈ విషయం మరోసారి స్పష్టమైంది. ప్రెస్మీట్లో వారు మాట్లాడుతూ.. రుణాలపై వడ్డీ పూర్తిగా మాఫీ చేశామని అన్నారు. అయితే, ఎంత వడ్డీ మాఫీ చేశారంటూ మీడియా సభ్యులు ఎమ్మెల్యేలను ప్రశ్నించడంతో సమాధానం చెప్పకుండా వారు చిందులు తొక్కారు. విలేకరులు పార్టీ ప్రతినిధులుగా వ్యవహిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. అధికార పక్షాన్ని ప్రశ్నించాలంటూ దాటవేశారు. ‘మే చేయాల్సింది చేశాం. కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు’ అంటూ అక్కడినుంచి తప్పుకున్నారు. ఎమ్మెల్యేల వ్యాఖ్యలతో మీడియా ప్రతినిధులు అవాక్కయ్యారు. -
మంత్రి అచ్చెన్నాయుడును ఏ–1గా చేర్చాలి
టెక్కలి: రాజకీయంలో రౌడీయిజాన్ని ప్రోత్సహించే విధంగా తన పార్టీ నాయకులతో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులను ప్రోత్సహించిన మంత్రి అచ్చెన్నాయుడును ఏ–1గా, ఆయన అనుచరుడు బోయిన రమేష్‌ను ఏ–2 ముద్దాయిలుగా చేర్చాలని వైఎస్సార్సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం, పీఏసీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్, శ్రీకాకుళం పార్లమెంట్ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్ డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంపై గురువారం టీడీపీ నాయకులు దాడి చేయడంతో పాటు పార్టీ నాయకులు బోయిన నాగేశ్వరరావు, నేతింటి నగేష్, పిల్లల లక్ష్మణరావు, మెండ తాతయ్య, కాళ్ల ఆదినారాయణ, తోట రమణమూర్తి, కాళ్ల సంజీవరావు, అన్నెపు రామారావు, దుబ్బ వెంకట్రావు తదితరులపై మారణాయుధాలతో దాడులకు పాల్పడటాన్ని నిరసిస్తూ శుక్రవారం కోటబొమ్మాళిలో శాంతియుత ర్యాలీతో పాటు బంద్ నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి కోటబొమ్మాళి, కొత్తపేట వరకు బాధితులతో కలిసి కార్యకర్తలంతా భారీ ర్యాలీ చేశారు. శాంతియుతంగా చేస్తున్న ర్యాలీ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు కొంత మంది కవ్వింపు చర్యలకు పాల్పడడంతో, ఇరువర్గాల మధ్య తగాదాకు దారితీసింది. శాంతియుతంగా చేస్తున్న ర్యాలీ, బంద్‌ను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేయడంపై వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అసహనం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కోటబొమ్మాళిలో రౌడీ రాజకీయాలకు ఊపిరి పోసేలా మంత్రి అచ్చెన్నాయుడు తన అనుచరులతో తోడేళ్ల మాదిరిగా వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు చేయడం అప్రజాస్వామికమని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఓటమి భయంతోనే మంత్రి ఇటువంటి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న కోటబొమ్మాళిలో విధ్వంసాన్ని సృష్టిస్తే సహించేది లేదని హెచ్చరించారు. తమ పార్టీ వారిపై దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో తమకు న్యాయం జరగకపోతే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. బంద్‌కు వ్యాపారులు, ప్రజలు స్వచ్ఛందంగా సహకరించారు. దుకాణాలు మూతపడ్డాయి. టెక్కలి, కోటబొమ్మాళి, నందిగాం, సంతబొమ్మాళి మండలాలకు చెందిన పార్టీ శ్రేణులు బంద్‌లో పాల్గొన్నారు. -
టీడీపీ నాయకుల దాష్టీకం!
టెక్కలి రూరల్/కోటబొమ్మాళి: మంత్రి అచ్చెన్నాయుడు ఇలాకాలో టీడీపీ నాయకులు.. కార్యకర్తలు దౌర్జన్యకాండకు దిగారు. గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి పట్టుతగ్గుతోందనే భయంతో అధికార పార్టీ కార్యకర్తలు బరితెగింపు రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఓటమి భయాన్ని సహించుకోలేక దాడులకు తెగబడుతున్నారు. ఈ క్రమంలోనే కోటబొమ్మాళిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోకి గురువారం ఉదయం పది గంటల సమయంలో దౌర్జన్యంగా ప్రవేశించి అక్కడ ఉన్న కార్యకర్తలు.. నాయకులపై విచక్షణ రహితంగా దాడిచేశారు. కర్రలు, మారణాయుధాలతో దాడి చేసి కొట్టడంతో 8 మంది వైఎస్సార్ సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. గాయడినవారిలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి బొయిన నాగేశ్వరరావు, నేతింటి నగేష్, అన్నెపు రామారావు, దుబ్బ వెంకట్రావు, మెండ తాతయ్య, తోట వెంటరమణ, కళ్ల ఆదినారాయణ, పిల్లల లక్ష్మణరావు ఉన్నారు. వీరిలో తోట వెంకటరమణ పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. మిగిలిన వారిని టెక్కలిలోని జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. టీడీపీ వర్గీయుల దాడులతో కోటబొమ్మాళిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అధికార పార్టీ శ్రేణులు చేసిన దాడిని నిరసిస్తూ వైస్సార్సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ బైఠాయించి మంత్రి అచ్చెన్నాయుడును ఏ–1గా, టీడీపీ మండల అధ్యక్షుడు బొయిన రమేష్‌పై ఏ–2గా కేసు నమోదు చేసి వెంటనే అరెస్టులు చేయాలని నినాదాలు చేశారు. సుమారు 3 గంటల పాటు అటు పోలీసులకు, ఇటు వైఎస్సార్ సీపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తక్షణమే దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులు పట్టుబట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో కాశీబుగ్గ డీఎస్పీ బర్ల ప్రసాద్‌రావు, సీఐలు శ్రీనివాసరావు, పైడప్పనాయుడు, తిరుపతిరావు, మహేష్‌లు, ఆరుగురు ఎస్సైలతోతోపాటు సుమారు 50 మందికి పైగా పోలీసులు కోటబొమ్మాళి స్టేషన్‌కు చేరుకొని ఆందోళన విరమించాలని వైఎస్ఆర్సీపీ నాయకులను కోరారు. అయితే తమకు న్యాయం జరిగే వరకూ ఇక్కడ నుంచి కదిలేది లేదని దువ్వాడ శ్రీనివాస్, తిలక్‌లు స్పష్టం చేశారు. దాడులకు పాల్పడిన వారిపై అట్రాసిటీ, 307 కేసులు నమోదు చేయాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. దీంతో డీఎస్పీ ప్రసాదరావు జోక్యం చేసుకొని దాడికి పాల్పడిన వారిపై 307, 324 సెక్షన్లతోపాటు అట్రాసిటీ కేసులు నమోదు చేస్తామని అందరి మధ్యలో ప్రకటించారు. దీంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు శాంతించారు. కాగా వైఎస్ఆర్సీపీ పీఏసీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్ కోటబొమ్మాళిలోని పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. టీడీపీ నాయకుల దాడిలో గాయపడి.. గచ్చుపై పడి ఉన్న రక్తం మరకలను పరిశీలించారు. ఆందోళన కార్యక్రమంలో పార్టీ నాయకులు యర్ర చక్రవర్తి, సింగుపురం మోహన్‌రావు, కుర్మాణ బాలకృష్ణ, ఎస్.హేమసుందరరాజు, చిన్ని జోగారావు, చింతాడ గణ పతి, తమ్మన్నగారి కిరణ్, బగాది హరి, సత్తారు సత్యం, కవిటి రామరాజు, శ్రీరాంమూర్తి, బి.మోహన్‌రెడ్డి, ఎం.నాగభూషణరావు, ఎం భాస్కర్‌రెడ్డి, మదీన్, శ్యామలరావు, తిరుమల రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాడి ఘటనను దళిత నాయకుడు బొకరి నారాయణరావు ఖడించారు. నేడు కోటబొమ్మాళి బంద్కువైఎస్సార్ సీపీ పిలుపు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ నాయకుల దాడిని నిరసిస్తూ శుక్రవారం కోటబొమ్మాళి బంద్‌కు పార్టీ నాయకులు పిలుపునించారు. బంద్‌కు అన్నివర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. వైఎస్ఆర్సీపీ పీఏసీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్, దువ్వాడ శ్రీనివాస్, తిలక్‌లు కొత్తపేట నుంచి కోటబొమ్మాళి వరకూ ర్యాలీ చేయనున్నారు. -
కోటబొమ్మాళిలో కొనసాగుతున్న ఉద్రిక్తత
-
వైఎస్సార్సీపీ కార్యాలయంపై దాడి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడి ఇలాకాలోనే ప్రజలకు రక్షణ కరువైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకు ప్రజాదరణ పెరగడాన్ని ఓర్వలేక దాడులకు తెగబడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాళిలో వైఎస్సార్సీపీ కార్యాలయంపై గురువారం ఉదయం వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడిచేశారు. కార్యాలయంలోని పార్టీ ప్రచారపత్రాల్ని చించి కుర్చీలు విరగ్గొట్టారు. ఈ ఘటనలో వైఎస్సార్సీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి బోయిన నాగేశ్వరరావు, కార్యకర్తలు నేతింటి నాగేశ్, మెండ తాతయ్య, అన్నెపు రామారావు, తోట వెంకటరమణ, కాళ్ల ఆదినారాయణ, దుబ్బ వెంకటరావు, పిల్లల లక్ష్మణ్‌లు గాయపడ్డారు. వీరిని టెక్కలిలోని జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. తోట వెంకటరమణ పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీకాకుళంలోని రిమ్స్‌కు తరలించారు. ర్యాలీగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్తున్న వైఎస్సార్సీపీ నాయకులు అచ్చెన్నాయుడి హస్తం ఉందని ఫిర్యాదు వైఎస్సార్ సీపీ శ్రేణులపై దాడి వెనుక మంత్రి అచ్చెన్నాయుడి హస్తం ఉందని, కోటబొమ్మాళిలో బుధవారం ఆయన పర్యటన సమయంలో కుట్రకు బీజం పడిందని వైఎస్సార్సీపీ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్‌లు ఆరోపించారు. దాడిని నిరసిస్తూ వారిద్దరి నేతృత్వంలో కోటబొమ్మాళిలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులు ఆందోళనకు దిగారు. పార్టీ కార్యాలయం నుంచి స్థానిక పోలీసుస్టేషన్ వరకూ ర్యాలీ నిర్వహించారు. అక్కడ బైఠాయించి మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రి అచ్చెన్నతో పాటు మండల టీడీపీ అధ్యక్షుడు బోయిన రమేష్, మరో 30 మంది టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేయాలని డిమాండు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసు బలగాల్ని రప్పించారు. ఫిర్యాదు పత్రంలోని వారందరిపై ఐపీసీ 307, అట్రాసిటీ కేసులు నమోదు చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు ఆందోళన విరమించాయి. అయితే మంత్రి మినహా మిగతావారిపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడంతో పాటు, రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ తరఫున ఏజెంట్లు లేకుండా బూత్‌లు ఆక్రమించడానికి ఇప్పటినుంచే టీడీపీ నేతలు దాడులకు పథక రచన చేశారని వైఎస్సార్సీపీ నాయకులు జిల్లా ఎస్పీ ఎ.వెంకటరత్నంకు ఫిర్యాదు చేశారు. కోటబొమ్మాళి తరహా దాడులు పునరావృతమైతే తాము కూడా ఆత్మరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఎస్పీని కలిసినవారిలో వైఎస్సార్సీపీ నాయకులు తమ్మినేని సీతారాం, ధర్మాన కృష్ణదాస్, దువ్వాడ శ్రీనివాస్, పేరాడ తిలక్ తదితరులు ఉన్నారు. కోటబొమ్మాళిలో ఘటనను పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు ఖండించారు. ఓటమి భయంతోనే వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులను మంత్రి అచ్చెన్నాయుడు ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. టీడీపీ అరాచకానికి నిరసనగా శుక్రవారం కోటబొమ్మాళిలో బంద్‌కు వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. -
టీడీపీ పయనమెటు?
-
రవాణా మంత్రితో లారీ యాజమాన్యాల భేటీ
అమరావతి: సచివాలయంలో రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడితో లారీ యజమానుల సంఘం నేతలు భేటీ అయ్యారు. డీజిల్ పై వ్యాట్ తగ్గింపు, రవాణా శాఖలో అధిక మొత్తంలో ఉన్న చలాన్ల తగ్గింపు, తెలంగాణతో సింగల్ పర్మిట్ అంశం, తదితర అంశాలపై చర్చించారు. 8 రోజులుగా లారీ యాజమాన్య సంఘాలు సమ్మె చేస్తున్న సంగతి తెల్సిందే. -
బాబాయ్ అబ్బాయ్‌ల మధ్య విబేధాలు