
సాక్షి, విజయవాడ: ఈఎస్‌ఐ కుంభకోణం తమ దృష్టికి వచ్చిందని జాతీయ లేబర్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్ జయప్రకాష్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈఎస్‌ఐలో జరిగిన అవినీతిని కేంద్ర కార్మిక శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. కేంద్ర దర్యాప్తు బృందంతో విచారణ జరపాలని కేంద్రమంత్రిని కోరతామని చెప్పారు. ఈఎస్‌ఐ అవినీతికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. అచ్చెన్నాయుడు ప్రధాని పేరును వాడుకోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఈఎస్‌ఐలో ఎన్నో అవకతవకలు జరిగినట్లు సమాచారం ఉందని వెల్లడించారు. తెలంగాణలో అవినీతికి పాల్పడిన కంపెనీలే ఏపీలో కూడా అవినీతికి పాల్పడ్డాయని చెప్పారు. అవినీతి పాల్పడిన వారికి శిక్ష తప్పదని జయప్రకాష్ స్పష్టం చేశారు. (ఈఎస్‌ఐ స్కామ్ : తవ్వేకొద్దీ బయటపడుతున్నభారీ అక్రమాలు)