మా కులానికి బాబు కరోనాలా మారాడు  | Former TDP MLA Adusumilli Jayaprakash with Sakshi | Sakshi
Sakshi News home page

మా కులానికి బాబు కరోనాలా మారాడు 

Published Mon, Sep 25 2023 4:59 AM | Last Updated on Mon, Sep 25 2023 6:22 PM

Former TDP MLA Adusumilli Jayaprakash with Sakshi

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి :  చంద్రబాబు స్వశక్తి హీనుడని, పరాన్నజీవి రకమని.. సొంత బలంతో ఎప్పుడూ ముందడుగు వేయలేదని, ఇకపైనా వేయలేడని టీడీపీ మాజీ ఎమ్మెల్యే, సీనియర్‌ నేత అడుసుమిల్లి జయప్రకాశ్‌ వ్యాఖ్యానించారు. కుట్రలు, కుతంత్రాలు, అవినీతే ప్రధాన బలాలని.. వ్యవస్థల విధ్వంసం, మాయోపాయాలే ఆయన ఆయుధాలన్నారు. ఎన్టీఆర్, వైఎస్సార్, జగన్‌మోహన్‌రెడ్డిలా ప్రజలకు శాశ్వతంగా గుర్తుండిపోయేలా ఒక్క మంచి పథకాన్ని అమలుచేయలేకపోయాడని “సాక్షి’తో అన్నారు. తమ కులానికి కరోనాలా మారాడని తమ పెద్దలు మథనపడుతున్నారని అడుసుమిల్లి ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. 

బాబు పాపం పండింది 
వైఎస్సార్‌ను మించి జగన్‌మోహన్‌రెడ్డి పనిచేస్తున్నారు. కరోనా సమయంలో జగన్‌ ప్రభుత్వ సేవలు, పరిపాలనా విధానాలు యావత్‌ దేశంతోపాటు నోబెల్‌ బహుమతి గ్రహీతల నుంచి ప్రశంసలు దక్కాయి. కానీ.. అమరావతి రాజధాని పేరిట ఐదేళ్లలో చంద్రబాబు చేసిందేముంది? అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌ అయిన బాబు పాపం పండి రాజమండ్రి జైలులో ఊచలు లెక్కిస్తున్నాడు. ఒంటరిగా పోటీచేయలేని స్థాయికి టీడీపీని దిగజార్చాడు.

ఇక మా కులానికి కరోనా వైరస్‌లా దాపురించిన అతని నుంచి ఎలా కాపాడుకోవాలనే ఆలోచనల్లో మా పెద్దలున్నారు. బాబు జైలుకు వెళ్లింది కేవలం ఆయన చేసిన అవినీతి, అక్రమాలవల్లే. దానికోసం సామాజికవర్గం మొత్తం రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయాలా? వీటివల్ల గ్రామాల్లో మా వర్గం ఒంటరిదవుతోంది. బాబు తన నిర్దోíÙత్వాన్ని నిరూపించుకో­వాలేగానీ కృత్రిమ ఉద్యమాలు చేయించకూడదు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement