TDP Leaders Arranging People For Nara Lokesh Padayatra Audio Clip Goes Viral - Sakshi
Sakshi News home page

లోకేష్‌ పాదయాత్ర ప్లాప్‌.. జనం కోసం చంద్రబాబు, అచ్చెన్నా బాధ మామూలుగా లేదు

Published Thu, Feb 9 2023 12:42 PM | Last Updated on Thu, Feb 9 2023 1:27 PM

TDP Leaders Arranging People For Nara Lokesh Padayatra Audio Clip Viral - Sakshi

తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా చంద్రబాబు ప్రతిష్టాత్మకమంటూ ప్రచారం చేసిన లోకేష్‌ పాదయాత్ర జనం లేక తుస్సుమంటోందని తెలుగు తమ్ముళ్లే చెబుతున్నారు. సొంత జిల్లా చిత్తూరులోనే స్పందన లేకపోవడంతో నిన్న అంతా పార్టీ అధినేత చంద్రబాబు ఆందోళన పడ్డారు. హడావిడిగా పార్టీ సమీక్షా సమావేశమంటూ ఓ టెలికాన్ఫరెన్స్‌ పెట్టి.. స్థానిక నేతల చెవులు తుప్పు వదిలేలా క్లాసులు తీసుకున్నట్టు సమాచారం. 

ప్రస్తుతం చిత్తూరు రూరల్‌లో జరుగుతున్న పాదయాత్రకు నిన్న కనీస స్పందన కరువవడంతో ఎక్కువ సమయం క్యారవాన్‌కే లోకేష్‌ పరిమితమయ్యారని పార్టీ నేతలు చెప్పుకున్నారు. ఇదే విషయం చంద్రబాబుకు కూడా చెప్పినట్టు తెలిసింది. దీంతో, టెలికాన్ఫరెన్స్‌లో స్థానిక నేతలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారట చంద్రబాబు. 

- సాయంత్రం లోకేష్‌ సభకు జనం ఎందుకు లేరు? 
- ముందుగా ఎందుకు ప్రచారం చేయలేదు? 
- ఇంతగా చెప్పినా జనం ఎందుకు రావడం లేదు?
- ఏమన్నా చేయండి.. లోకేష్‌ కోసం జనం రావాలి..

ఇవీ చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్‌లో ఇచ్చిన ఆదేశాలు. ఏ సభకయినా జనం స్వచ్ఛందంగా రావాలి కానీ.. ఇదేం గోల అంటూ స్థానిక నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా ప్రజా నేత అంటే ఆకట్టుకునేలా ప్రసంగించాలి, ఆదర్శంగా నిలవాలి కానీ.. వచ్చిన వారు షాకయ్యే స్టేట్‌మెంట్లు ఇస్తే మేమేం చేయాలి అంటూ కొందరు నేతలు  పక్కకు వచ్చి గుసగుసలాడారట.

ఇక పరిస్థితి మరీ దిగజారిపోవడంతో అచ్చెన్నాయుడు రంగంలోకి దిగారు. జిల్లానేతలతో ఆయన చేసిన సంభాషణ ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అచ్చెన్నాయుడితో జీడీ నెల్లూరు నియోజకవర్గం ఇన్‌ఛార్జీ బీమినేని చిట్టిబాబు ఫోన్‌లో చెప్పిన అంశాలు వైరల్‌గా మారాయి. 

"ఆఫీసులో పర్మిషన్‌ తీసుకుంటున్నాను. మీరు చెప్పినట్టుగా ఉదయాన్నే నేను.. 8 గంటల కల్లా ఒక వెయ్యి మంది వచ్చేట్టుగా వెహికిల్స్‌తో అరేంజ్‌ చేశాను. రోజూ కూడా పాదయాత్ర స్టార్ట్‌ అయ్యేలోగా ఆరు మండలాల్లో.. 50 వెహికిల్స్‌ పెడతాం. 300 వెహికిల్స్‌కు అల్‌రెడీ డబ్బులు ఇచ్చేశాను. నాలుగు రోజులకు బుక్‌ చేశాను. దాని తర్వాత ప్రతీరోజు మూడు వేల మందిని తీసుకుని అక్కడకు రావాలని చెప్పాను అన్న" అని మాట్లాడుకున్నారు.

మొత్తమ్మీద చిన బాబు పాదయాత్ర ఏంటో కానీ.. అరువు తెచ్చుకున్న జనంతో అష్టకష్టాలు పడాల్సి వస్తోందని వాపోతున్నారు స్థానిక నేతలు. గత వారం వరకు స్థానికంగా జనం అందుబాటులో లేకపోగా.. తమిళనాడు నుంచి అతి కష్టమ్మీద తెలుగు మాట్లాడే వాళ్లను గుర్తించి తీసుకొచ్చామని, మళ్లీ మళ్లీ జనాన్ని తెమ్మంటే ఏం చేయగలమని చెప్పుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement