buchaiah chowdary
-
పవన్ పర్యటనతో రెండు వర్గాల మధ్య రగులుతున్న చిచ్చు
-
టీడీపీలో నా పరిస్థితే ప్రశ్నార్థకంగా మారింది... ఇంక మీకేం చేయగలను?
సాక్షి, రాజమహేంద్రవరం: టీడీపీ – జనసేన పార్టీలకు సంబంధించినంత వరకూ రాజమహేంద్రవరం రూరల్ రాజకీయం రంజుగా మారుతోంది. ఇక్కడి ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై కొనసాగుతున్న పీటముడి ఇంకా వీడటం లేదు. ఇక్కడి నుంచి తాను పోటీ చేస్తానని జనసేన నుంచి ఆ పార్టీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్.. కాదు కాదు.. ఈ సీటు తనదేనంటూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇప్పటికే ప్రకటించుకున్నారు. ఈ పరిస్థితుల్లో రూరల్ సీటు కేటాయింపుపై రెండు పార్టీల శ్రేణుల్లోనూ సస్పెన్స్ ఏర్పడింది. ముందుగా ప్రకటించుకున్నట్టు దుర్గేష్ పోటీ చేస్తారా.. లేక గోరంట్లకు వదిలేస్తారా అనే విషయం ఎటూ తేలడం లేదు. ఇటీవల మండపేటలో పోటీ చేస్తామని చంద్రబాబు ప్రకటించిన వెంటనే.. రాజానగరం, రాజోలు నియోజకవర్గాల్లో పోటీపై పవన్ కల్యాణ్ కూడా హడావుడిగా ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే, రాజమహేంద్రవరం రూరల్ విషయానికి వచ్చేసరికి చంద్రబాబు స్పష్టత ఇవ్వడం లేదు. పవన్ కల్యాణ్ నోరు మెదపడం లేదు. దీంతో రెండు పార్టీల్లోనూ గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఓసారి సై.. మరోసారి నైనై.. ఇదిలా ఉండగా జనసేన నేత దుర్గేష్ ఊగిసలాట ధోరణి ప్రదర్శిస్తున్నారంటూ ఆ పార్టీ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. కాసేపు పోటీ చేస్తానని, మరికాసేపు పోటీ చేయనని ఆయన సంకేతాలిస్తున్నారు. జనసేన – టీడీపీ పొత్తులో భాగంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రూరల్ స్థానం నుంచి దుర్గేష్ బరిలోకి దిగడం ఖాయమని తొలుత సంకేతాలు వెలువడ్డాయి. ఆయన సైతం నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించి తానే అభ్యర్థినని ప్రకటించుకుని, ఎన్నికలకు సన్నద్ధమయ్యారు. అంతలోనే ఆయన మనసు మార్చుకున్నారని తెలుస్తోంది. ఆర్థిక పరిస్థితులు, వ్యక్తిగత సమస్యల కారణంగా రానున్న ఎన్నికల్లో పోటీకి విముఖత చూపుతున్నారని చెబుతున్నారు. దీంతో రూరల్ రాజకీయం తాజాగా మరో మలుపు తిరిగింది. వాస్తవానికి రూరల్ సీటు మరోసారి ఆశిస్తున్న టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల, దుర్గేష్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాకుండా ఈ ఇద్దరు నేతలూ రహస్యంగా కలిసి చర్చించుకుని, ఓ నిర్ణయానికి వచ్చారని, అప్పటి నుంచే ఎన్నికల్లో పోటీకి దుర్గేష్ సుముఖంగా లేరన్న వాదన వినిపిస్తోంది. ఇదే అదునుగా బుచ్చయ్య చౌదరి తన ఎమ్మెల్యే స్థానం తనకే పదిలమని, రూరల్ సీటును తన నుంచి దూరం చేసే దమ్ము ఎవరికై నా ఉందా? అంటూ ఆవేశంతో ప్రకటనలు కూడా చేశారు. తాను ఎమ్మెల్యేగా మరోసారి గెలుపొంది, మంత్రి కావడం ఖాయమనే లెక్కలు వేసుకునేంత వరకూ వెళ్లారాయన. నేతల ఒత్తిడితో మళ్లీ సై పోటీకి దుర్గేష్ దూరమవుతున్న సంగతి తెలుసుకు న్న రూరల్ నియోజకవర్గ జనసేన నేతలు ఆయనపై అగ్గిమీద గుగ్గిలమయ్యారు. సువర్ణ అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నారని వాదనకు దిగారు. ‘ఎమ్మెల్యేగా ఎన్నికవ్వాలన్న మీ కలను మీ రే నాశనం చేసుకుంటారా?’ అని ప్రశ్నించారు. ఇది మంచి పద్ధతి కాదని అసంతృప్తి వ్యక్తం చేశారు. నాయకులు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నా దుర్గే ష్ ససేమిరా అని భీష్మించారు. ‘మీరు చేయకపోతే మరో నేతను రంగంలోకి దింపుతాం. అంతే కానీ సీటు మాత్రం త్యాగం చేసుకునే పరిస్థితి తీసుకురాం’ అని స్పష్టం చేశారు. స్వపక్ష నేతల ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి అయిన దుర్గేష్ ఆత్మరక్షణలో పడ్డారు. పార్టీ శ్రేణులను విస్మరిస్తే రాజకీయ భవిష్యత్తు సమాధి అయ్యే ప్రమాదం ఉండటంతో దిక్కు తోచని పరిస్థితిలో చేసేది లేక పోటీకి సై అన్నారు. సిటీపై గోరంట్ల కన్ను దుర్గేష్ తాజా నిర్ణయంతో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల గొంతులో పచ్చి వెలక్కాయ అడ్డం పడినట్టయ్యింది. ఈ పరిస్థితుల్లో ఆయన ప్రత్యమ్నాయ ఆలోచనలో పడ్డారు. రూరల్ చేజారిన పక్షంలో తనకు అనువైన రాజమహేంద్రవరం సిటీలోనైనా పాగా వేయాలని ప్రయత్నిస్తున్నారు. అందుకు అవసరమైన వ్యూహరచన చేస్తున్నారు. తన రాజకీయ భవిష్యత్తుపై చంద్రబాబు వద్ద తాడోపేడో తేల్చుకోవాలని సిద్ధమవుతున్నారు. ఆదిరెడ్డి వర్గంలో అలజడి ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్టు.. రూరల్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి తమ ఆశలకు ఎసరు పెడుతుందేమోనని మరోసారి రాజమహేంద్రవరం సిటీ సీటు ఆశిస్తున్న ఆదిరెడ్డి అప్పారావు వర్గం ఆందోళన చెందుతోంది. తన కుమారుడు వాసును ఎమ్మెల్యేగా చూడాలన్నది ఆదిరెడ్డి అప్పారావు కల. దీనికోసమే ఆయన తన కోడలు, ప్రస్తుత ఎమ్మెల్యే భవానీని ప్రజలకు దూరం పెట్టారు. ఆమె బదులు ఆమె భర్త, తన తనయుడు వాసు ప్రజల్లో ఉండేలా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తన కలను గోరంట్ల నాశనం చేస్తారేమోనని అప్పారావు అంతర్మధనం చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ స్థానంపై ఏదో ఒకటి తేల్చుకునేందుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు వద్ద పంచాయతీ పెట్టారు. ‘టీడీపీలో నా పరిస్థితే ప్రశ్నార్థకంగా మారింది. ఇంక మీకేం చేయగలను? మీ స్థాయిలో మీరు చూసు కోండి’ అంటూ అచ్చెన్నాయడు చేతులెత్తేయడంతో ఆదిరెడ్డి వర్గం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ప్రస్తుతం ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో వారు కొట్టుమిట్టాడుతున్నారు. స్కిల్ స్కామ్‌లో అరెస్టయి, రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబు ఉన్న సమయంలో ఆయన కుటుంబానికి ఆదిరెడ్డి కుటుంబం వెన్నంటి నిలిచింది. లోకేష్‌తో ఆదిరెడ్డి వాసు సన్నిహిత సంబంధాలు నెరిపి, ఆయన దృష్టిలో పడ్డారు. ఆ నేపథ్యంలో ఇక తనకు ఎవరూ అడ్డురానన్న ధైర్యంతో సిటీలో పర్యటనలు మొదలు పెట్టారు. ఇటువంటి సమయంలో బుచ్చయ్య ప్రయత్నాలు ఆదిరెడ్డి కుటుంబంలో అలజడి రేపుతున్నాయి. ఈ పరిణామం ఎటువైపు దారితీస్తోందనని, చివరకి తమ సీటుకు ఎక్కడ ఎసరు వస్తుందోనని ఆదిరెడ్డి వర్గం ఆందోళన చెందుతోంది. రాజమహేంద్రవరం రూరల్, సిటీ నియోజకవర్గాల్లో నెలకొన్న ఈ గందరగోళ పరిస్థితులపై కాతేరులో సోమవారం నిర్వహించిన రా.. కదలిరా సభలో సైతం చంద్రబాబు ఎటువంటి ప్రకటనా చేయలేదు. ఆయన ఉదాశీన వైఖరితో ఇరు వర్గాల మధ్య విభేదాలు మరింతగా భగ్గుమంటున్నాయి. -
రాజమండ్రి రూరల్‌లో జనసేన, టీడీపీ మధ్య చిచ్చు
సాక్షి, రాజమహేంద్రవరం: చంద్రబాబు వ్యవహార శైలి టీడీపీ, జనసేన నేతల మధ్య అగ్నికి ఆజ్యం పోస్తోంది. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే స్థానంపై ఎటూ తేల్చకపోవడం ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ప్రస్తుతం అది బహిరంగంగా ప్రెస్మీట్లు పెట్టి విమర్శలు గుప్పించే స్థాయికి చేరింది. తనకు అధిష్టానం ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని, తనకే టికెట్ దక్కుతుందని జనసేన నేత కందుల దుర్గేష్ ఇటీవల విలేకర్ల సమావేశంలో స్పష్టం చేశారు. దానిని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి ప్రెస్‌మీట్ పెట్టి ఖండించారు. ప్రెస్మీట్లు.. సిగపట్లు.. పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు పవన్, చంద్రబాబు కలిసే చేస్తారని, కచ్చితంగా తనకే టిక్కెట్ దక్కుతుందని కందుల దుర్గేష్ ధీమా వ్యక్తం చేశారు. సిటింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు అని గతంలో చంద్రబాబు చేసిన ప్రకటన తమ పొత్తు తర్వాత చెల్లదన్నారు. దీంతో తానే పోటీ చేస్తానని పరోక్షంగా వెల్లడించారు. దుర్గేష్ ఇలా ప్రకటించిన ఒక రోజు వ్యవధిలోనే టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల స్పందించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఖాయమని చంద్రబాబు చెప్పిన విషయాన్ని గుర్తుచేసి.. అది ఇప్పుడు చెల్లదనడానికి జనసేన నాయకుడు ఎవరని దుర్గేష్‌పై శివాలెత్తారు. ఎవరేమన్నా రానున్న ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రూరల్ ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని బల్లగుద్ది మరీ ప్రకటించారు. బుచ్చయ్యకు కష్టమేనా.. బుచ్చయ్య రూరల్ ఎమ్మెల్యే అయినా ఆయన దృష్టంతా రాజమహేంద్రవరం సిటీ స్థానంపైనే ఉండేది. పార్టీలో సీనియర్ అయిన తనను కాదని ఇతరులను ప్రోత్సహిస్తున్నారని ఆవేదన చెందేవారు. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో వెళ్లగక్కారు. ఆయనకు రూరల్ ఇవ్వని పక్షంలో ఆదిరెడ్డి వాసును ఎంపీగా రంగంలోకి దింపి, సిటీ సీటు బలమైన క్యాడర్ ఉన్న బుచ్చయ్యకు కేటాయిస్తారన్న ప్రచారం కొంతకాలం నడిచింది. బాబు ఇక్కడి సెంట్రల్ జైలుకు వచ్చాక ఆయన కుటుంబం ఇక్కడే ఉండి ఆందోళనల్లో పాల్గొన్నపుడు.. చొరవగా వ్యవహరించిన ఆదిరెడ్డి వాసుకే సిటీ సీటు ఖాయమన్న వాదన వినిపిస్తోంది. దీంతో బుచ్చయ్యకు సిటీ ఆశ కూడా అడియాసగా మారుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. బాబు వైఖరితోనే.. చంద్రబాబు వైఖరితోనే రాజమండ్రి రూరల్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని టీడీపీ, జనసేన కార్యకర్తలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. స్పష్టత ఇవ్వకుండా చంద్రబాబు విభేదాలకు మరింత ఆజ్యం పోస్తున్నారని మండి పడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఖాయమని గతంలో చంద్రబాబు ప్రకటించేశారు. దీంతో రూరల్ సీటు తనకే అన్న ధీమాలో బుచ్చయ్య ఉండగా.. పొత్తులో భాగంగా దుర్గేష్‌కు ఇద్దామన్న మరో ప్రతిపాదన సైతం బుచ్చయ్య వద్ద ఉంచారు. ఇలా రెండువైపులా అనుకూలంగా వ్యవహరిస్తూ.. ఇరు వర్గాల మధ్య గొడవలకు చంద్రబాబు ఆజ్యం పోస్తున్నారని జనసేన, టీడీపీ నేతలు అంటున్నారు. గుంటూరులో సిగపట్లు ♦ గుంటూరు పశ్చిమం, తెనాలి కావాలని జనసేన డిమాండ్ ♦ ఆ రెండూ తమ పార్టీకి బలమైన సీట్లు అంటున్న నేతలు ♦ కానీ, తెనాలిలో పాదయాత్ర మొదలుపెట్టిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా ♦ గుంటూరు పశ్చిమ.. మా సిట్టింగ్ సీటు అంటున్న తెలుగుదేశం సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి జనసేనతో పొత్తు తలనొప్పిగా మారుతోంది. టీడీపీకి పట్టున్న రెండు సీట్లను జనసేన డిమాండ్ చేస్తుండడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తెనాలి నియోజకవర్గంలో తెలుగుదేశం నుంచి ఆలపాటి రాజా, జనసేన నుంచి ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పోటీపడుతున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో ఇక్కడ్నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. కాంగ్రెస్, జనసేన తరఫున మరో రెండుసార్లు ఓటమి చవిచూశారు. నాదెండ్ల మనోహర్ ఇప్పుడు మళ్లీ తెనాలి నుంచి టీడీపీ–జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీచేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ కూడా సమ్మతించారు. అయితే, ఇక్కడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ కూడా మరోసారి పోటీచేయాలని చూస్తున్నారు. రెండు పార్టీలు కలిసి పోటీచేస్తే గెలుస్తామన్న భావనతో ఆయన పార్టీపరంగా లైన్ క్లియర్ చేసుకునేందుకు లోకేశ్‌తో టచ్‌లో ఉన్నారు. నియోజకవర్గంలోనూ ఆయన పర్యటిస్తున్నారు. రెండురోజుల క్రితం పాదయాత్ర మొదలుపెట్టారు. గత ఎన్నికల్లో జనసేనకు 29 వేల ఓట్లు రాగా టీడీపీకి 76 వేల ఓట్లు వచ్చాయి. తమకు బలమైన సీటును వదులుకోవడానికి సిద్ధంగాలేమని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. గుంటూరు పశ్చిమం కోసం జనసేన పట్టు.. ఇక జనసేన అడుగుతున్న రెండో సీటు గుంటూరు పశ్చిమం. ఈ సీటు 2014, 2019లో కూడా తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. తమ సిట్టింగ్ సీటును ఇచ్చేదిలేదని వారు తెగేసి చెబుతున్నారు. అయితే ఇక్కడ తెలుగుదేశం బలంతో పాటు కాపు ఓటింగ్ కూడా గణనీయంగా ఉండటంతో ఇక్కడ పోటీచేయాలని జనసేన భావిస్తోంది. గత ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీచేసిన బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఈ సీటు కోసం పట్టుపడుతున్నారు. ఇందులో భాగంగా.. సోమవారం కూడా గుంటూరు జనసేన నేతలు పవన్‌ను కలిసి ఈ సీటు కావాల్సిందేనని, ఏ విధంగా గెలుస్తామో ఆయనకు వివరించారు. మరోవైపు.. టీడీపీ కూడా ఇక్కడ అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. ఇక్కడ వైఎస్సార్సీపీ నుంచి మంత్రి విడదల రజిని బరిలోకి దిగడంతో ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని బరిలోకి దింపేందుకు తెలుగుదేశం ప్రయత్నిస్తోంది. దీంతో ఇప్పటివరకూ ఈ నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్న ఎన్ఆర్ఐలు తమ కార్యకలాపాలు నిలిపివేశారు. ఈ నేపథ్యంలో.. పొత్తులో భాగంగా ఏ సీటు వదులుకోవాలో, ఏ సీటు ఉంచుకోవాలో తెలీక టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. -
టీడీపీలో వర్గపోరు.. బుచ్చయ చౌదరి ఎదుటే బాహాబాహీ!
సాక్షి, తూర్పుగోదావరి: కొవ్వూరు టీడీపీలో మరోసారి వర్గ విబేధాలు బయటపడ్డాయి. టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రసాభాస చోటుచేసుకుంది. అయితే, టీడీపీ ఏర్పాటు చేసిన సభలో బుచ్చయ్య చౌదరి ఎదుటే జవహర్ అనుకూల, వ్యతిరేక వర్గాలు బాహాబాహికి దిగాయి. కాగా, రెండు వర్గాల ఆందోళనలతో సమావేశం అర్థాంతరంగానే ముగిసింది. ఈ ఘటనతో బుచ్చయ్య చౌదరి అసహనం చెందినట్టు సమాచారం. ఇక, ఈ నియోజకవర్గానికి జవహర్ వచ్చిన ప్రతీసారి వ్యతిరేక వర్గం అడ్డుకుంటున్నట్టు తెలుస్తోంది. -
టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరీ పీఏ అరెస్ట్
తూర్పు గోదావరి: రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పీఏ చిటికెల సందీప్‌ను పోలీసులు బుధవారం శ్రీశైలంలో అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. హుకుంపేట వినాయకుని విగ్రహానికి మలినం పూసిన ఘటనపై సోషల్ మీడియాలో మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రచారం చేశాడని సందీప్‌పై ఆరోపణలు వచ్చాయి. అయితే ఇదే ఘటనలో పోలీసులు మొదట టీడీపీ నేత బాబుఖాన్ చౌదరిని అరెస్టు చేశారు. కానీ ఈ అంశంలో బుచ్చయ్య చౌదరీ పీఏ సందీప్ హస్తం ఉందని తెలుసుకున్న పోలీసులు అతన్ని అరెస్టు చేసేందుకు సిద్ధమవ్వగా అప్పటినుంచి అతను పరారీలో ఉన్నాడు. తాజాగా పరారీలో ఉన్న సందీప్ శ్రీశైలంలో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా.. కోర్టు సందీప్‌కు రిమాండ్ విధించింది. కాగా ఈ కేసులో మరికొందరిపై కూడా కేసు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. -
ముగ్గురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్
సాక్షి, అమరావతి : ఏపీ అసెంబ్లీ సమావేశాల నుంచి ముగ్గురు టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. సభకు అంతరాయం కలిగిస్తున్న టీడీపీ సభ్యులు బుచ్చయ్య చౌదరి,నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడుపై స్పీకర్ సస్పెషన్ వేటు వేశారు. ఈ సెషన్ ముగిసే వరకు సభకు రావొద్దని ఆ ముగ్గురిని స్పీకర్ ఆదేశించారు. మంగళవారం ఉదయం నుంచి టీడీపీ సభ్యులు సభా సమయాన్ని వృధా చేస్తూ వస్తున్నారు. స్పీకర్ సూచనలు పట్టించుకోకుండా పోడియం వద్దకు దూసుకొచ్చారు. స్పీకర్ మైకును లాగేందుకు యత్నించారు. దీంతో ముగ్గురు టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఈ సమావేశాలు ముగిసే వరకూ వీరి సస్పెన్షన్ కొనసాగనుంది. ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్సీపీ ఎన్నికల హామీపై స్పష్టతకు టీడీపీ సభ్యుడు రామానాయుడు డిమాండ్ చేశారు. అయితే అలాంటి హామీ ఇవ్వలేదని పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జోక్యం చేసుకున్నారు. ఎన్నికల సమయంలో తాను మాట్లాడిన వీడియోను సభలో ప్రదర్శింస్తుండగా టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తూ సభకు అంతరాయం కలిగించారు. స్పీకర్ ఆదేశాలను పాటించకుండా పోడియం వైపు దూసుకొచ్చారు. ఆగ్రహించిన శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.. ఈ సమావేశాలు ముగిసేవరకు టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, బుచ్చయ్య చౌదరిలను సస్పెండ్ చేయాలని స్పీకర్‌కు ప్రతిపాదించారు. అనంతరం స్పీకర్ దీనిని ఆమోదించారు. అయినప్పటీ ఆ ముగ్గురు సభ్యులు సభలోనే ఉంటూ నినాదాలు చేయడంతో మార్షల్స్ వచ్చి వారిని తీసుకెళ్లారు. -
కాకి లెక్కలతో వృద్ధి పెరిగిందా?
సాక్షి, అమరావతి: గోరంట్ల బుచ్చయ్యా.. ఇక మీ అసత్యాలు ఆపండయ్యా.. అంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. కాకి లెక్కలు, చేపల లెక్కలతో వ్యవసాయ వృద్ధి రేటు పెరిగిందన్న టీడీపీ వాదనలో పస లేదని తేల్చి చెప్పారు. అంకెల గారడీతో ఎంత కాలం మోసం చేస్తారని నిలదీశారు. 2019–20 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై సోమవారం అసెంబ్లీలో చర్చను ప్రారంభిస్తూ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలను బుగ్గన ఖండించారు. అంతకుముందు గోరంట్ల మాట్లాడుతూ బడ్జెట్ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించేలా లేదన్నారు. వాస్తవ పరిస్థితుల్ని ప్రజల దృష్టికి తెచ్చేందుకు తాను ప్రయత్నిస్తున్నానన్నారు. 2014లో రూ.1,12,000 కోట్లుగా ఉన్న బడ్జెట్ ఇప్పుడు రూ.2,26,000 కోట్లకు చేరిందని, గత ఐదేళ్లలో అభివృద్ధి లేకపోతే ఇదెలా సాధ్యమైందని ప్రశ్నించారు. 2013–14లో 5.3 శాతంగా ఉన్న అభివృద్ధి 2019 నాటికి 11.5 శాతానికి చేర్చిన ఘనత తమదేనని వివరించారు. ఆర్థిక సర్వేలో అభివృద్ధి సాధించామని చెబుతూ బడ్జెట్‌లోనేమో లేదనడం ఎలా సాధ్యమన్నారు. ప్రస్తుత బడ్జెట్ పార్టీ ఎన్నికల ప్రణాళికగా ఉందని, తాము ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీలను మూత వేయిస్తున్నారని ఆరోపించారు. దీనికి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ అభ్యంతరం తెలిపారు. ప్లానింగ్ విభాగం తయారు చేసిన ఆర్థిక సర్వేకు తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. కాకి లెక్కలు చెప్పవద్దన్నారు. వ్యవసాయాభివృద్ధిని కొలవడానికి నిర్ధిష్టమైన పద్ధతులు లేవనే విషయం తెలియదా? అని ప్రశ్నించారు. పథకాల పేర్ల మార్పును గోరంట్ల తప్పుబడుతున్నారని, వాస్తవానికి ఆరోగ్య శ్రీ,, ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత విద్యుత్, సామాజిక పింఛన్ల పెంపు వంటివి డాక్టర్ వైఎస్సార్ ప్రవేశపెట్టినవేనని, అందుకే వాటికి ఆయన పేరు పెట్టామని చెప్పినప్పుడు సభ చప్పట్లతో మార్మోగింది. రాష్ట్రంలో తాము ఏ ఫ్యాక్టరీని ఆపలేదని, కర్నూలులో ఏ సీడ్ ఫ్యాక్టరీని ఆపామో చెప్పాలని నిలదీశారు. ఈ ఏడాదికి సున్నా వడ్డీ డబ్బులను వచ్చే బడ్జెట్లో కేటాయిస్తారన్న విషయం తెలియకపోతే ఎలా? అని నిలదీశారు. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడతారని వివరిస్తూ వచ్చే ఉగాదికి కచ్చితంగా 23 లక్షల మందికి ఇళ్ల పట్టాలు, 5 లక్షల ఇళ్లు కట్టిస్తామన్నారు. చంద్రబాబు మాదిరిగా నిరుద్యోగులను మోసం చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. లక్షన్నర మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రస్తుతం ఇంటర్వూ్యలు నిర్వహిస్తుంటే టీడీపీ సభ్యులు దుర్బుద్ధితో అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఈ దశలో టీడీపీ, అధికార పార్టీ సభ్యులకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. మీరు చేసిన అప్పును మేము తీర్చాం చంద్రన్న కానుక అని టీడీపీ ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుందిగానీ పౌర సరఫరా శాఖకు రూ.100 కోట్లు బకాయి పెట్టిందని మంత్రి బుగ్గన తెలిపారు. ఆ అప్పును తాము తీర్చామన్నారు. విత్తనాల కొనుగోలుకు గత ప్రభుత్వం డబ్బులు చెల్లించనే లేదని, తమ ప్రభుత్వం వచ్చాక రూ.400 కోట్లు చెల్లించి విత్తనాలు సమీకరించామన్నారు. 2014 నుంచి 2017వరకు పాఠశాలల మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. 2017–18లో మాత్రం రూ.69.94 కోట్లు కేటాయించి, 2018–19లో మొండి చేయి చూపిందని చెప్పారు. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం తొలి బడ్జెట్లోనే రూ.1,500 కోట్లు కేటాయించి ప్రభుత్వ పాఠశాలల పట్ల తమ చిత్తశుద్ధిని నిరూపించుకుందన్నారు. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో అమరావతి నిర్మాణానికి రూ.1,777 కోట్లు కేటాయించగా అందులో కేంద్ర ప్రభుత్వం రూ.1,500 కోట్లు ఇచ్చిందని, అంటే రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.277 కోట్లు మాత్రమే ఇచ్చిందని వివరించారు. తమ ప్రభుత్వం తొలి బడ్జెట్లోనే రూ.500 కోట్లు కేటాయించిందని తెలిపారు. పింఛన్ల కోసం టీడీపీ ఐదేళ్లలో సగటున రూ.5 వేల కోట్లు వెచ్చిస్తే తమ ప్రభుత్వం తొలి బడ్జెట్లోనే రూ.15,746.58 కోట్లు కేటాయించిందని తెలిపారు. రాబోయే నాలుగేళ్లలో దీన్ని మరింత పెంచుకుంటూ పోతామన్నారు. రాజధానిలో కి.మీ. రోడ్డుకు రూ.32 కోట్ల చొప్పున తమ సన్నిహితులకు కాంట్రాక్టులు ఇచ్చి చంద్రబాబు దోపిడీకి పాల్పడ్డారని, ఈ తరహా దోపిడీని అడ్డుకునేందుకే రివర్స్‌టెండరింగ్ విధానాన్ని తీసుకువచ్చామన్నారు. నీరు–చెట్టు పథకం పేరిట కూడా దోచుకున్నారని మండిపడ్డారు. -
అవాక్కైన మీడియా ప్రతినిధులు..!
సాక్షి, అమరావతి: అయిదేళ్లు ప్రజాకంటక పాలన అందించడంతో ఓటరు మహాశయులు టీడీపీని ప్రతిపక్షానికి పరిమితం చేశారు. అయినప్పటికీ వారు తమపాత్రను నిర్వహించకుండా.. అధికారం కోల్పోయామన్న అసహనంతో వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రజానీకానికి అన్నీ చేశామని డబ్బాకొట్టుకుంటున్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, మరికొందరి మాటల్లో ఈ విషయం మరోసారి స్పష్టమైంది. ప్రెస్మీట్లో వారు మాట్లాడుతూ.. రుణాలపై వడ్డీ పూర్తిగా మాఫీ చేశామని అన్నారు. అయితే, ఎంత వడ్డీ మాఫీ చేశారంటూ మీడియా సభ్యులు ఎమ్మెల్యేలను ప్రశ్నించడంతో సమాధానం చెప్పకుండా వారు చిందులు తొక్కారు. విలేకరులు పార్టీ ప్రతినిధులుగా వ్యవహిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. అధికార పక్షాన్ని ప్రశ్నించాలంటూ దాటవేశారు. ‘మే చేయాల్సింది చేశాం. కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు’ అంటూ అక్కడినుంచి తప్పుకున్నారు. ఎమ్మెల్యేల వ్యాఖ్యలతో మీడియా ప్రతినిధులు అవాక్కయ్యారు. -
కోడెల వ్యవహారంపై టీడీపీ కీలక నిర్ణయం!
సాక్షి, అమరావతి: ‘కే టాక్స్’ వ్యవహారంలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఆయన కుమారుడు, కుమార్తెపై వస్తున్న ఫిర్యాదులపై నోరు మెదపకూడదని టీడీపీ నిర్ణయించినట్లు తెలిసింది. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కోడెలను వెనకేసుకుని వస్తే ఉన్న పరువు కూడా పోతుందని ఈ విషయంలో నిశ్శబ్దంగా ఉంటే మంచిదని పలువురు పార్టీ సీనియర్ నేతలు సూచించడంతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అధికారంలో ఉన్న సమయంలో తమ నుంచి డబ్బులు వసూలు చేశారని అనేక మంది బాధితులు కోడెలతో పాటు ఆయన కుమారుడు, కుమార్తెపై వరుసగా ఫిర్యాదులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇవన్నీ రాజకీయ వేధింపుల్లో భాగంగానే వస్తున్నాయని ఒక ప్రతినిధి బృందం డీజీపీకి ఫిర్యాదు చేయాలని రెండురోజుల క్రితం జరిగిన టీడీపీ శాసనసభాపక్ష సమావేశంలో నిర్ణయించారు. సోమవారం ఆ బృందం డీజీపీని కలవాలని నిర్ణయించినా టీడీపీ నాయకులెవరూ వెళ్లలేదు. ఆ తర్వాత జరిగిన మరో సమావేశంలో పలువురు నాయకులు కోడెల వైఖరిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో చంద్రబాబు మిన్నకుండిపోయినట్లు సమాచారం. కోడెల కుటుంబీకులపై ఎప్పటి నుంచో తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు వస్తున్నాయని, చాలామంది ఆయన, ఆయన కుమారుడు, కుమార్తె అవినీతి వ్యవహారాల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారని టీడీపీ ఉప నేత బుచ్చయ్యచౌదరి ఆ సమావేశంలో మండిపడినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో పార్టీ తలదూర్చితే ఆయన అవినీతి వ్యవహారాలను సమర్థించినట్లవుతుందని, మౌనంగా ఉంటే మంచిదని, లేకపోతే ఉన్న పరువు కూడా పోతుందని చెప్పడంతో చంద్రబాబు వెనక్కి తగ్గినట్లు తెలిసింది. అందుకే కోడెలను సమర్థిస్తూ ఏ ఒక్క టీడీపీ నాయకుడు మాట్లాడేందుకు ముందుకు రావడంలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. (చదవండి: కోడెల బండారం బట్టబయలు) -
ఉప్పు.. నిప్పు..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వీరిద్దరూ తరచుగా పరస్పరం వ్యక్తిగత దూషణలకు దిగుతూ జిల్లాలో హాట్ టాపిక్‌గా మారుతున్నారు. అటు పార్టీ శ్రేణులు, ఇటు నగర వాసులు నివ్వెరపోయేలా వీరిద్దరూ వ్యక్తిగత దూషణలకు దిగడం చర్చనీయాంశమవుతోంది. గత అక్టోబర్ 26న జరిగిన ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో ఎంపీ మాగంటి మురళీమోహన్ సాక్షిగా ఎమ్మెల్సీఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. రాజమహేంద్రవరంలో జరిగిన ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమాన్ని గోరంట్ల రాకుండానే ఆదిరెడ్డి ప్రారంభించేశారు. దీనిపై గోరంట్ల నిలదీయడంతో ‘నీకు నగరంలో పనేంటి?’ అంటూ ఆదిరెడ్డి గట్టిగా నిలదీశారు. దీంతో వారి మధ్య మాటామాటా పెరిగింది. ఒకరిపై ఒకరు నోరు పారేసుకున్నారు. తాజాగా ఈ నెల ఆరో తేదీన ఆదిరెడ్డి, గోరంట్ల మధ్య మరోసారి గొడవ జరిగింది. ఈసారి రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం వేదికగా ఘర్షణ చోటు చేసుకుంది. వ్యక్తిగత దూషణలు పతాక స్థాయికి చేరాయి. పరస్పరం వాగ్వాదానికి దిగడంతో కార్పొరేటర్లు, అధికారులు ప్రేక్షకులయ్యారు. శాప్ నిధులు తీసుకొచ్చింది తానేనంటూ అంతకు నాలుగు రోజుల క్రితం ఆదిరెడ్డి ప్రకటించడమే ఈ వివాదానికి దారి తీసింది. చేసిందేమి లేకపోయినా గొప్పలు చెప్పుకోవడం, డబ్బాలు కొట్టుకోవడం సరికాదని ఆదిరెడ్డిపై గోరంట్ల వ్యాఖ్యానించి అగ్గి రాజేశారు. ‘‘ఎమ్మెల్యేలమైన మేము చవటలమనుకుంటున్నావా? అంతా నువ్వే చేశావని చెప్పుకుంటున్నావు?’’ అంటూ ఏకవచనంతో గోరంట్ల ఫైర్ అవ్వడంతో వివాదం పరాకాష్టకు చేరింది. ‘‘ఎప్పుడో లెటర్ ఇచ్చాను అంటున్నారు. అప్పుడు ఏ పార్టీలో ఉన్నాడో!’’ అంటూ ఆదిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రెచ్చిపోయిన ఆదిరెడ్డి ఘాటుగా విరుచుకుపడ్డారు. ఎవరేమిటో అందరికీ తెలుసని, వేషాలు వేయొద్దని మండిపడ్డారు. ‘‘నా నిజాయితీ అందరికీ తెలుసు. నీ సంగతి కూడా ప్రజలకు తెలుసు’’ అని అన్నారు. దీంతో మరింత రెచ్చిపోయిన గోరంట్ల ‘‘కోస్తా, ఉంటే ఉండు లేకపోతే బయటకు ఫో’’ అంటూ శివాలెత్తారు. ఆది నుంచీ విభేదాలే.. ఆదిరెడ్డి, గోరంట్ల మధ్య విభేదాలు ఇప్పటివి కావు. ఆదిరెడ్డి భార్య వీరరాఘవమ్మ రాజమహేంద్రవరం మేయర్‌గా ఉన్నప్పటి నుంచీ ఉన్నాయి. అప్పట్లో కార్పొరేషన్లో గోరంట్ల జోక్యం చేసుకోవడాన్ని ఆదిరెడ్డి తప్పు పట్టేవారు. అప్పట్లో వారిమధ్య వాగ్వాదాలు జరిగాయి. ఆ తర్వాత ఆదిరెడ్డి పార్టీ మారారు. అయితే, తరువాత ఆయన నమ్మి ఎమ్మెల్సీ పదవిని ఇచ్చిన వైఎస్సార్ సీపీని వంచించి, టీడీపీలోకి ఫిరాయించారు. దీంతో గోరంట్ల, ఆదిరెడ్డి మధ్య విభేదాలకు మళ్లీ ఆజ్యం పోసినట్టయ్యింది. ఇటీవల కాలంలో కూడా రాజమహేంద్రవరం కార్పొరేషన్లో గోరంట్ల జోక్యాన్ని ఆదిరెడ్డి తప్పు పడుతున్నట్టు పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఎన్నికలే లక్ష్యంగా కుమ్ములాటలు తాజాగా వీరి మధ్య గొడవలు చోటు చేసుకోవడానికి మాత్రం 2019లో జరగనున్న ఎన్నికలే కారణమని తెలుస్తోంది. ఆ ఎన్నికల్లో గోరంట్ల రాజమహేంద్రవరం సిటీ నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో తన కుమారుడు ఆదిరెడ్డి వాసును కూడా అక్కడి నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేయించాలనే ఎత్తుగడలో ఆదిరెడ్డి అప్పారావు ఉన్నారు. దీంతో వీరి మధ్య ఆధిపత్య పోరు చోటు చేసుకుంటోంది. సిటీలోకి గోరంట్ల ప్రవేశించడం ఆదిరెడ్డికి ఎంతమాత్రం ఇష్టం లేదు. ఆయనొస్తే తన అవకాశాలకు గండి పడతాయనే అభిప్రాయంతో ఆదిరెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. ఏదో ఒకవిధంగా గోరంట్ల అడ్డు తొలగించుకోవాలనే లక్ష్యంతో ఆయన ప్రత్యేక గ్రూపును కూడా నడుపుతున్నారు. గోరంట్లకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ద్వారా టిక్కెట్ తమకే దక్కుతుందన్న ప్రచారానికి కూడా శ్రీకారం చుట్టారు. ఇక గోరంట్ల కూడా వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది. ఈసారి సిటీలోనే పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తన వర్గీయులకు సంకేతాలు ఇచ్చినట్టు తెలిసింది. ఇందులో భాగంగానే ఆదిరెడ్డిని వ్యూహాత్మకంగా టార్గెట్ చేస్తున్నట్టు సమాచారం. మొక్క దశలోనే ఆదిరెడ్డిని తొలగించుకోవాలనే అభిప్రాయంతో ఆధిపత్య పోరుకు తెర లేపినట్టు తెలుస్తోంది. ఆదిరెడ్డిపై తనదే పైచేయి కావాలనే ధోరణితో పావులు కదుపుతున్నారు. సీనియారిటీతోపాటు, పార్టీలో తమ సామాజికవర్గానికి పట్టు ఉన్న నేపథ్యంలో తనకే సీటు దక్కుతుందని, ఆదిరెడ్డి తనకేమాత్రం పోటీ కాదని సంకేతాలు పంపిస్తున్నట్టు ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒకరినొకరు అడ్డు తొలగించుకునేందుకు, పైచేయి సాధించేందుకు, ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు తరచూ వాగ్వాదాలకు, వ్యక్తిగత దూషణలకు దిగుతున్నట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. ఏదో ఒకటి ఇప్పుడే తేలిపోవాలన్న యోచనతో ఇద్దరూ వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ రచ్చకెక్కుతున్నట్టు తెలుస్తోంది. -
వేషాలేయకు...
‘‘వేషాలు వేయకు.. నోరు అదుపులో పెట్టుకో! ఎక్కువగా మాట్లాడితే కోస్తా.. నీ సంగతి ఎవరికి తెలియదు.. ఎంతలో ఉండాలో అంతలో ఉండు.. ఇలా తిట్ల పర్వానికి దిగింది ఆకతాయిలు కాదు ... రోడ్డు మీద తిరిగే ఆవారాగాళ్లంతకన్నా కాదు ... వారిద్దరూ అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు. ఒకరు ఎమ్మెల్యే కాగా, మరొకరు ఎమ్మెల్సీ. ఒకరిపై ఒకరు రాజమహేంద్రవరం కార్పొరేషన్ సాక్షిగా మాటల తూటాలు వదులుకున్నారు. వారిద్దరూ అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు. ఒకరు ఎమ్మెల్యే కాగా, మరొకరు ఎమ్మెల్సీ. ఒకరిపై ఒకరు మాటల తూటాలు వదులుకున్నారు. వ్యక్తిగత దూషణలకు దిగారు. ‘‘వేషాలు వేయకు.. నోరు అదుపులో పెట్టుకో! ఎక్కువగా మాట్లాడితే కోస్తా.. నీ సంగతి ఎవరికి తెలియదు.. ఎంతలో ఉండాలో అంతలో ఉండు.. ఇలా ఒకరినొకరు దూషించుకున్నారు. ఇది చూసిన వారంతా ‘వార్’నాయనో! ఇదేం గొడవ అంటూ ముక్కున వేలేసుకున్నారు. సాక్షి, రాజమహేంద్రవరం: ‘‘డబ్బాలు కొట్టుకుంటున్నావ్, వేషాలు వేయకు, నోరు అదుపులో పెట్టుకో, చూసుకుందాం.. కోస్తా, నీ సంగతి ఎవరికి తెలియదు.. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు.. ఇవీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావులు మంగళవారం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ సాధారణ సమావేశంలో మాట్లాడిన మాటలు. ఇరువురు నేతలు వ్యక్తిగత దూషణలు చేసుకుంటూ వాగ్వివాదానికి దిగడంతో కార్పొరేటర్లు, అధికారులు ప్రేక్షకపాత్ర వహించారు. సాప్ నుంచి తాను నిధులు తీసుకొచ్చానని, అందుకు సంబంధించిన జీవో చూపిస్తూ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి నాలుగు రోజుల క్రితం విలేకర్ల సమావేశంలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్సీ ఆదిరెడ్డి తీరుపై విరుచుకుపడ్డారు. ‘ఎప్పుడో లేటర్ ఇచ్చాను అంటున్నారు. అప్పడు ఏ పార్టీలో ఉన్నాడో’ అంటూ గోరంట్ల ఆదిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పరిధిలోకి రాకుండా నీ పని నీవు చూసుకోవాలని, ఇవన్నీ నీవు చేస్తుంటే నగర ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, తాను చవటలమనుకుంటున్నావా? అని ప్రశ్నించారు. దీనికి ఆదిరెడ్డి కూడా ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్సీగా నిధులు తేచ్చే అవకాశం తనకూ ఉందని పేర్కొన్నారు. డబ్బాలు కొట్టుకోకూడదని గోరంట్ల అన్నారు. ఎవరు ఏమిటో అందరికీ తెలుసని, వేషాలు వేయొద్దంటూ చురక అంటించారు. తన నిజాయితీ అందరికీ తెలుసని, నీ సంగతీ కూడా ప్రజలకు తెలుసంటూ ఆదిరెడ్డి ఫైర్ అయ్యారు. ఒకానొక దశలో బుచ్చయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘కోస్తా, ఉంటే ఉండు లేకపోతే బయటకు పో’ అంటూ విరుచుకుపడ్డారు. ఇదే సమయంలో బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కల్పించుకుని ఆదిరెడ్డిపై ఫైర్ అయ్యారు. పార్టీ ఆదేశాల మేరకు తాను చేస్తానని ఆదిరెడ్డి చెప్పారు. అయితే మిత్రధర్మం ఎక్కడుందంటూ ఆకుల ప్రశ్నించారు. ఇరువురి మధ్య వాగ్వివాదం తారాస్థాయికి చేరడంతో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కల్పించుకుని సర్దిచెప్పారు. సమావేశం జరుగుతున్న తీరు సినిమా షూటింగ్‌ను తలపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేటర్లు తమ డివిజన్ సమస్యలు పరిష్కారం కాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. కౌన్సిల్లోనే కాకుండా మేయర్, కమిషనర్ ప్రతినెలా కార్పొరేటర్లతో సమావేశమై ఆయా డివిజన్లలో సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనులు ఎంత మేర జరిగాయో సమీక్షించుకోవాలని సూచించారు. -
వైఎస్ జగన్ సహా ఎమ్మెల్యేల ఆందోళన
హైదరాబాద్ : సభలో విపక్ష నేతలను మాట్లాడనీవ్వటం లేదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శనివారం అసెంబ్లీ ఎదుట ఆందోళనకు దిగింది. అసెంబ్లీలో టీడీపీ వైఖరని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా పార్టీ ఎమ్మెల్యేలు నోటికి నల్ల రిబ్బను కట్టుకుని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ప్రతిపక్షం నోటిని నొక్కేస్తున్నారంటూ అంతకు ముందు వైఎస్ఆర్ సీపీ నేతలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన విషయం తెలిసిందే. ప్రతిపక్షానికి స్పీకర్ వంత పాడుతున్నారని వైఎస్ఆర్ సీపీ ఆరోపించింది. దీనిపై నిరసన తెలుపుతూ నేటి అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించింది. అంతకు ముందు సభలో పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని యథేచ్ఛగా రాష్ట్ర అసెంబ్లీలోనే ఖూనీ చేస్తున్నారని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. శాంతిభద్రతలపై చర్చ పునఃప్రారంభమైన తర్వాత కూడా టీడీపీ సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి నోటికి వచ్చినట్లల్లా అసత్యాలు మాట్లాడుతూ, ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఒక శాసన సభ్యుడు తన ఇష్టంవచ్చినట్లు అబద్ధాలు చెబుతుంటే, ఆ అబద్ధాలు చెప్పుకోనివ్వండంటూ సమయం కేటాయిస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. -
అసెంబ్లీలోనే ప్రజాస్వామ్యం ఖూనీ
పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని యథేచ్ఛగా రాష్ట్ర అసెంబ్లీలోనే ఖూనీ చేస్తున్నారని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. శాంతిభద్రతలపై చర్చ పునఃప్రారంభమైన తర్వాత కూడా టీడీపీ సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి నోటికి వచ్చినట్లల్లా అసత్యాలు మాట్లాడుతూ, ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఒక శాసన సభ్యుడు తన ఇష్టంవచ్చినట్లు అబద్ధాలు చెబుతుంటే, ఆ అబద్ధాలు చెప్పుకోనివ్వండంటూ సమయం కేటాయిస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. 'ఇదేంటి అధ్యక్షా.. ఆయన నోటికొచ్చినట్లు తప్పులు మాట్లాడుతుంటే, మీరు అనుమతిస్తూనే ఉన్నారు. ఇదే కేసుకు సంబంధించి నేను సూటిగా అడుగుతున్నాను' అని చెప్పారు. ఆ సమయంలో స్పీకర్ కలగజేసుకుని, అధ్యక్ష స్థానం మీద ఆరోపణలు చేస్తున్నారని, అది సరికాదని చెప్పారు. శాంతిభద్రతలపై చర్చలో వాళ్లకు సమయం ఇచ్చామని, మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు చెప్పుకోవాలని అన్నారు. ప్రతిపక్ష నాయకుడికి అవకాశం ఇస్తే ఆయన స్పీకర్ మీదే ఆరోపణలు చేస్తున్నారని పదే పదే చెప్పారు. మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు అవకాశం ఇచ్చామని అన్నారు. తాను పూర్తి నిష్పక్షపాతంగానే వ్యవహరిస్తున్నానన్నారు. ఆ తర్వాత యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ, ఎవరికి అవకాశం వచ్చినప్పుడు వాళ్లు మాట్లాడాలని, స్పీకర్ మీద ఆరోపించడం కూడా సరికాదని, సభా మర్యాదలను కూడా పాటించాలని, స్పీకర్ అనుమతించడం వల్లే ఆయన మాట్లాడారని చెప్పారు. ఆ సమయంలో సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. ఒక్కసారిగా అధికార, విపక్ష సభ్యులు నేరుగా ఒకరితో ఒకరు వాగ్వాదానికి దిగడంతో సభ ఏమాత్రం అదుపులో లేకుండా పోయింది. దాంతో అధికారపార్టీ సభ్యుల వ్యాఖ్యలకు నిరసనగా వైఎస్ఆర్సీపీ సభ్యులు వాకౌట్ చేశారు. ఆ తర్వాత టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ శాసనసభను ఇడుపులపాయ, లోటస్‌పాండ్ అనుకుని సొంత పాలన చేస్తున్నారని అంటూ.. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి వ్యక్తిగతంగా తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి, స్పీకర్, ప్రతిపక్ష నాయకుడు ఈ ముగ్గురూ ఇతర సభ్యులకు ఆదర్శంగా ఉండాలన్నారు. అంతకుముందు శనివారం నాడు చర్చను ప్రారంభించిన బుచ్చయ్య చౌదరి వైఎస్ పాలనను ఉద్దేశించి దోపిడీ అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడారు. మధ్యమధ్యలో విపక్ష సభ్యులను ఉద్దేశించి కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఎవరో భూమిని ముఖ్యమంత్రి సారథ్యంలో ఆక్రమించారంటూ దివంగత ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేశారు. ఆయుధాలు దిగుమతి చేసుకున్నారని, బాంబే ముఠాలను ఇక్కడకు రప్పించారని, ఛోటా రాజన్ హత్య చేయడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి గ్యాంగును దుబాయ్ నుంచి అనంతపురం రప్పించారని అన్నారు. దీనిపై విపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయగా.. 'ఉండవయ్యా, ఉండు' అంటూ సభ్యులను తానే అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రక్షణకు వాడుతున్న వాటికంటే అత్యాధునిక ఆయుధాలు తెప్పించారని చెబుతూ.. ఓ పోలీసు అధికారి కూడా ఆయుధాల ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. -
రికార్డుల నుంచి తొలగిస్తున్నాం
శాంతిభద్రతలపై చర్చ సందర్భంగా జరిగిన వివాదానికి స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఫుల్స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. ఇరుపక్షాలకు చెందిన కొంతమంది సభ్యులు చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. పావుగంట వాయిదా అనంతరం సభ పునఃప్రారంభమైనప్పుడు ముందుగా ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడారు. చాలా సందర్భాలలో చాలామంది నాయకులు ఆవేశానికి లోనైనప్పుడో, పొరపాటునో కొన్ని వ్యాఖ్యలు చేస్తారని, ఆ తర్వాత దానికి వాళ్లు క్షమాపణలు చెప్పడం కూడా సర్వసాధారణమని ఆయన అన్నారు. ఇంతకుముందు సభలో ముఖ్యమంత్రులు, స్పీకర్లు, ప్రతిపక్ష నాయకులు కూడా పొరపాటుగా మాట్లాడితే క్షమాపణలు చెప్పిన సందర్భాలున్నాయని, సభలో ఎవరూ ఇగోలకు పోకూడదని ఆయన చెప్పారు. అన్‌పార్లమెంటరీ పదాలు మాట్లాడినవాళ్లు వాటిని స్వచ్ఛందంగా ఉపసంహరించుకుని, సభకు క్షమాపణ చెబితే హుందాగా ఉంటుందని అన్నారు. ఈ అంశాన్ని ఇంతటితో వదిలేసి, చర్చను సజావుగా సాగించాలని సూచించారు. అనంతరం స్పీకర్ కోడెల మాట్లాడుతూ, ''నిన్న చర్చ సందర్భంగా సభ గౌరవం, మర్యాద, హుందాతనాలకు భంగం కలిగించేలా ఇరుపక్షాలకు చెందిన కొందరు సభ్యులు చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నాం. ఎవరైనా ఉపసంహరించుకుంటున్నామంటే చేయొచ్చు, లేకపోతే అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. అర్థవంతమైన చర్చలు జరిగితే సభకు, ప్రజలకు అందరికీ మేలు జరుగుతుంది'' అని, ఆ తర్వాత ముఖ్యమంత్రికి అవకాశం ఇచ్చారు. -
నేను తప్పన్నానా? సమాధానం చెప్పాలి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మరోసారి శాంతిభద్రతలపై రగడ జరిగింది. దాంతో అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొంది. శనివారం సభలో ప్రశ్నోత్తరాల సమయం అనంతరం శాంతిభద్రతలపై చర్చ పునఃప్రారంభమైంది. చర్చ ప్రారంభం కాగానే టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ తాను ఎలాంటి పరుష పదజాలం వాడలేదని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే విషయంపై టీడీపీ సభ్యులు నిరసన తెలుపుతూ స్పీకర్ పోడియం వద్దకు దూసుకు వెళ్లి నినాదాలు చేశారు. దాంతో అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సభ్యులు తమ తమ స్థానాల్లో కూర్చోవాలని స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. సభ్యుడు మాట్లాడేందుకు నిలబడి ఉన్నారని, ఆయనకు అవకాశం ఇవ్వాలని కోరినా అధికార సభ్యులు ఏమాత్రం వినిపించుకోలేదు. దాంతో స్పీకర్ సభను పావుగంట వాయిదా వేశారు. -
అంచనాలు తారుమారు
సాక్షి, రాజమండ్రి : రాజమండ్రి నగరపాలక సంస్థపై తెలుగుదేశం పార్టీ అంచనాలు బూమరాంగ్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మూడోసారి మేయర్ పీఠం దక్కించుకుందామనుకున్న ఆ పార్టీ నేతలను ఇప్పుడు ఓటమి భయం వెంటాడుతోంది. ఒక పక్క అంతర్గత కుమ్ములాటలు, మరో పక్క పేదల పక్కా ఇళ్ల పంపిణీని అడ్డుకున్న ఆ పార్టీ నేతల పాపం కట్టకట్టుకుని తమకు ముప్పు తెస్తున్నాయని పార్టీ అభ్యర్థులే ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. బాజా భజంత్రీలతో స్థానికేతర జనాలతో డివిజన్లలో టీడీపీ పెద్ద ఎత్తున ప్రచారం సాగిస్తూ పైకి బింకం ప్రదర్శిస్తున్నా, స్థానికులలో వ్యక్తం అవుతున్న వ్యతిరేకత పార్టీ వర్గాలను అంతర్గతంగా గుబులుకు గురిచేస్తోంది. ఎసరు పెడుతున్న అసంతుష్టులు పార్టీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి కార్పొరేషన్ ఎన్నికల్లో అవలంబించిన కొత్త వ్యూహం బెడిసి కొడుతోంది. సీనియర్లు, పార్టీని నమ్ముకుని కొనసాగుతున్న వారిని కాదని కొత్తవారికి కార్పొరేటర్ టికెట్లు కేటాయించిన తీరు పలువార్డుల్లో క్యాడర్ని తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. దీంతో పన్నెండుకు పైగా డివిజన్లలో స్థానిక తమ్ముళ్లు ఇండిపెండెంట్లకు కొమ్ముకాస్తూ, సొంత అభ్యర్థులకు ఎసరు పెడుతున్నారని తెలుస్తోంది. తొలిరోజుల్లో తమ పార్టీకి బూమ్ ఉందని జూమ్ చేసి చూపించిన టీడీపీ నేతలు, తాజా పరిస్థితులు చూసి బెంబేలెత్తుతున్నారు. భంగపడ్డ ఆశావహుల తీరుకు అసంతృప్తిగా ఉన్న అభ్యర్థులు ప్రచారజోరు కూడా తగ్గించారని సమాచారం. పేదల ఇళ్లకు అడ్డుపడిన పాపం వెంటాడుతోంది.. ఎప్పుడు తమకు పక్కా ఇళ్లు అందుతాయా అని నగరంలో నిరుపేదలు ఎనిమిదేళ్లుగా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశారు. ఎట్టకేలకు రెండు నెలల క్రితం అధికారులు 2500 ఇళ్ల పంపిణీని చేపట్టారు.అయితే వీటి పంపకాాలను బుచ్చయ్యచౌదరి నాయకత్వంలో టీడీపీ నేతలు అడ్డుకోవడంతో లబ్ధిదారులు తిరగబడ్డారు. అంతేకాకుండా తరిమికొట్టారు. దీంతో ఆగ్రహించిన బుచ్చయ్య ఈ ప్రభుత్వం ఉండగా ఇళ్లను పంచనివ్వబోమని సభ పెట్టి మరీ సవాల్ చేశారు. నాటి ఈ సంఘటన ప్రభావం నేడు పేదల వాడల్లో ప్రతిఫలిస్తోంది. తమ నోటికాడ కూడు లాక్కున్న నేతకు ఓటడిగే హక్కు ఎక్కడిదని వివిధ డివిజన్లలో ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ ఎదురుగాలి నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి మురళీమోహన్ సైతం డివిజన్లలో పర్యటనకు అనాసక్తత వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.