టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరీ పీఏ అరెస్ట్‌ | MLA Gorantla Butchaiah Chowdary PA Arrested In Srisailam | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరీ పీఏ అరెస్ట్‌

Published Wed, Jan 20 2021 7:21 PM | Last Updated on Wed, Jan 20 2021 7:35 PM

MLA Gorantla Butchaiah Chowdary PA Arrested In Srisailam - Sakshi

తూర్పు గోదావరి: రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పీఏ చిటికెల సందీప్‌ను పోలీసులు బుధవారం శ్రీశైలంలో అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. హుకుంపేట వినాయకుని విగ్రహానికి మలినం పూసిన ఘటనపై సోషల్ మీడియాలో మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రచారం చేశాడని సందీప్‌పై ఆరోపణలు వచ్చాయి. అయితే ఇదే ఘటనలో పోలీసులు మొదట టీడీపీ నేత బాబుఖాన్‌ చౌదరిని అరెస్టు చేశారు.

కానీ ఈ అంశంలో బుచ్చయ్య చౌదరీ పీఏ సందీప్‌ హస్తం ఉందని తెలుసుకున్న పోలీసులు అతన్ని అరెస్టు చేసేందుకు సిద్ధమవ్వగా అప్పటినుంచి అతను పరారీలో ఉన్నాడు. తాజాగా పరారీలో ఉన్న సందీప్‌ శ్రీశైలంలో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా.. కోర్టు సందీప్‌కు రిమాండ్‌ విధించింది. కాగా ఈ కేసులో మరికొందరిపై కూడా కేసు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.  


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement