కవాడిగూడ (హైదరాబాద్): చిత్రపురి భూ కబ్జాలపై ప్రభుత్వం తక్షణమే సీబీఐ విచారణ జరిపించి పేద సినీ కార్మికులకు ఇళ్ల స్థలాలను అప్పగించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చే శారు. చిత్రపురి సొసైటీలో వందకోట్ల రూపాయల అవి నీతి జరిగిందని అధికారులు నివేదికలు ఇచ్చినా చర్యలు చేపట్టకపోవడం సిగ్గుచేటన్నారు. సోమవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద చిత్రపురి సాధన సమితి ఆధ్వర్యంలో పేద సినిమా కార్మికుల న్యాయపోరాట దీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. పేదల ఇళ్ల స్థలాలను కొందరు ఇష్టారాజ్యంగా ఆక్రమించుకుంటున్నారని అన్నారు. చిత్రపురి పేద సినీ కార్మికులు చేస్తున్న న్యాయ పోరాటానికి బీసీ సంక్షేమ సంఘం అండగా ఉంటుం దని పేర్కొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. ప్రస్తుత సొసైటీ పాలక మండలి సభ్యులు కార్మికుల సొంతింటి కలను నిర్వీర్యం చేస్తూ పేదల స్థలాలను ప్రభుత్వ ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు కేటాయించి ప్రభుత్వాన్ని కూడా మోసం చేస్తున్నా రని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి సొసైటీలో జరిగే అవినీతి పై చర్యలు చేపట్టి పేద సినిమా కార్మికులకు న్యాయం చేయాలని డిమాం డ్ చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. సినిమా కార్మికులు చేస్తున్న పోరాటం న్యాయమైందన్నారు. హౌసింగ్ సొసైటీలో అక్రమాలపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment