నిరుద్యోగ గర్జనలో అభివాదం చేస్తున్న ఆర్.కృష్ణయ్య తదితరులు
సైదాబాద్ (హైదరాబాద్): ఖాళీ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకుండా తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులతో చెలగాటమాడుతోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో 40 వేల ఉపాధ్యాయ పోస్టులు, గురుకుల పాఠశాలల్లోని 12 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో రాష్ట్రంలో మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడా తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. శనివారం సైదాబాద్ డివిజన్ గడ్డిఅన్నారంలోని రామయ్య కోచింగ్ సెంటర్ హాల్‌లో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలం వెంకటేశ్, బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ నేషనల్ కన్వీనర్ గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుద్యోగుల గర్జన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయకపోతే.. నిరుద్యోగులతో కలిసి పెద్దఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment