
కాచిగూడ (హైదరాబాద్): అసెంబ్లీలో ఈనెల 7న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో బీసీల సంక్షేమానికి రూ.10 వేల కోట్లు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం కాచిగూడలోని ఓ హోటల్‌లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన 14 బీసీ సంఘాల ప్రతినిధుల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ ఇప్పటికే పలుమార్లు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావును, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను కలసి బీసీల బడ్జెట్‌పై చర్చించామన్నారు. ఈ సారి బడ్జెట్ పెంచకపోతే వెనకబడిన వర్గాల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. అలాగే బీసీలకు సబ్‌ప్లాన్‌ను, బీసీబంధు పథకాన్ని వెంటనే ప్రవేశపెట్టాలని కోరారు.
బడ్జెట్‌లో బీసీ కార్పొరేషన్‌కు సబ్సిడీ రుణాల కోసం రూ.3వేల కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.2 వేల కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బీసీ అడ్వొకేట్లకు ఇచ్చే స్టైపెండ్‌ను రూ.10 వేలకు పెంచాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థుల స్కాలర్‌షిప్స్, మెస్ చార్జీలు పెంచాలన్నారు. బీసీ స్టడీ సర్కిల్‌కు రూ.200 కోట్లు కేటాయిం చాలని, అర్హులందరికీ డీఎస్సీ, పోలీస్, గ్రూప్ పరీక్షలు, సివిల్స్, ఇతర పోటీ పరీక్షలకు కోచింగ్ ఇవ్వాలన్నారు
Comments
Please login to add a commentAdd a comment