సాక్షి, హైదరాబాద్: ప్రముఖ న్యాయ కోవిదుడు, మాజీ అడ్వొకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది సత్తి వెంకట్‌రెడ్డి కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన వయస్సు 97 సంవత్సరాలు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నా రు. వెంకట్‌రెడ్డి అంత్యక్రియలు బుధవారం సా యంత్రం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో నిర్వహించనున్నారు. సత్తి వెంకట్‌రెడ్డి స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా, కవిటం గ్రామం.
అక్కడే 1926, ఫిబ్ర వరి 25న జన్మించారు. 1951లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. కొంత కాలం పాటు రాజమండ్రిలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. అటు తరువాత 1956లో హైదరాబాద్‌కు మకాం మార్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉత్తమ న్యాయవాదుల్లో ఒకరిగా పేరుగాంచారు. 1992–94 మధ్య కాలంలో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, సత్తి వెంకట్‌రెడ్డి అడ్వొకేట్ జనరల్‌గా సేవలు అందించారు.
ఆయన పలు కీలక కేసుల్లో వాదనలు వినిపించారు. ఆయన ముగ్గురు కుమారులు న్యాయవాదులే. వెంకట్‌రెడ్డి అల్లుడు సీవీ మోహన్‌రెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అడ్వొకేట్ జనరల్‌గా వ్యవహరించారు. సత్తి వెంకట్‌రెడ్డి మృతి పట్ల పలువురు న్యాయమూర్తులు, విశ్రాంత న్యాయమూర్తులు, సీనియర్ న్యాయవాదులు ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు.
Comments
Please login to add a commentAdd a comment