CBI action
-
సీబీఐ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
దమ్ముంటే సీబీఐ విచారణ వేయండి: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘నీళ్లు, నిధుల పేరుతో కేసీఆర్ రూ.వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. ఒక్క విద్యుత్ ప్రాజెక్టుల్లోనే రూ.వెయ్యికోట్ల అవినీతి జరిగింది. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి సవాల్ చేస్తున్నా. కేసీఆర్ అవినీతిని నేను నిరూపిస్తా. అలా నిరూపించకపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా’అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కొంపల్లిలోని కాంగ్రెస్ కార్యకర్తల శిక్షణ శిబిరం ముగింపు సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. కాంగ్రెస్‌పై ఉన్న భయంతోనే ప్రధాని మోదీ డైరెక్షన్లో సీఎం కేసీఆర్ బీజేపీని తిట్టినట్టు యాక్షన్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్, ప్రధాని మోదీ–కేంద్ర హోంమంత్రి అమిత్‌షాల బంధం గట్టిదని, అందుకే కేసీఆర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని తిడుతున్నారేకానీ ఆ పార్టీని పల్లెత్తు మాట కూడా అనడంలేదని దుయ్యబట్టారు. కేసీఆర్, బండి సంజయ్‌ల ప్రెస్మీట్లు చిక్కడపల్లి కల్లు కాంపౌండ్‌ను తలపిస్తున్నాయని ఎద్దేవాచేశారు. యూపీలో యోగిని మళ్లీ సీఎం చేసేందుకు... కేసీఆర్ ఇచ్చిన డబ్బులను తమిళనాడు ఎన్నికలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తరలించారని, తమిళనాడులో బీజేపీ ఎన్నికల ఖర్చంతా కేసీఆర్ పెట్టుకున్నారని రేవంత్ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లో యోగిని మరోసారి ముఖ్యమంత్రిగా చేసేందుకు మోదీతో కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి అక్కడ ఎంఐఎం చేత వంద సీట్లకు పోటీ చేయించి ప్రతిపక్ష ఓట్లను చీల్చి బీజేపీ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. మంత్రుల దోపిడీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్ రెడ్డి, స్పీకర్ పోచారం, ఎంపీ సంతోష్‌కుమార్ ఇసుక మాఫియాలా వ్యవహరిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని రేవంత్ ఆరోపించారు. హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లో సంజీవయ్య పార్క్‌కు సంబంధించి పదెకరాల భూమిని మంత్రి తలసాని ఆక్రమించారన్నారు. ట్యాంక్ బండ్‌పై నిర్మిస్తున్న అమరవీరుల స్తూపంలో కూడా అవినీతి జరిగిందన్నారు. స్తూపం నిర్మాణ ఖర్చును రూ.60 కోట్ల నుంచి రూ.180 కోట్లకు పెంచి.. రూ.120 కోట్లను ఏపీకి చెందిన కాంట్రాక్టర్‌కు చెల్లించారని ఆరోపించారు. సోనియా గాంధీ ఆమోదిస్తే వచ్చే సంవత్సరం ఏఐసీసీ ప్లీనరీ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహిస్తామన్నారు. కార్యకర్తల శిబిరాల్లో మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్, పార్టీ రాష్ట్ర నేతలు బోసురాజు, భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్యయ్య, రాంరెడ్డి దామోర్‌రెడ్డి, దాసోజు శ్రవణ్‌కుమార్ తదితరులు మాట్లాడారు. -
చిత్రపురిలో భూ కబ్జాలపై సీబీఐ విచారణ జరిపించాలి
కవాడిగూడ (హైదరాబాద్): చిత్రపురి భూ కబ్జాలపై ప్రభుత్వం తక్షణమే సీబీఐ విచారణ జరిపించి పేద సినీ కార్మికులకు ఇళ్ల స్థలాలను అప్పగించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చే శారు. చిత్రపురి సొసైటీలో వందకోట్ల రూపాయల అవి నీతి జరిగిందని అధికారులు నివేదికలు ఇచ్చినా చర్యలు చేపట్టకపోవడం సిగ్గుచేటన్నారు. సోమవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద చిత్రపురి సాధన సమితి ఆధ్వర్యంలో పేద సినిమా కార్మికుల న్యాయపోరాట దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. పేదల ఇళ్ల స్థలాలను కొందరు ఇష్టారాజ్యంగా ఆక్రమించుకుంటున్నారని అన్నారు. చిత్రపురి పేద సినీ కార్మికులు చేస్తున్న న్యాయ పోరాటానికి బీసీ సంక్షేమ సంఘం అండగా ఉంటుం దని పేర్కొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. ప్రస్తుత సొసైటీ పాలక మండలి సభ్యులు కార్మికుల సొంతింటి కలను నిర్వీర్యం చేస్తూ పేదల స్థలాలను ప్రభుత్వ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కేటాయించి ప్రభుత్వాన్ని కూడా మోసం చేస్తున్నా రని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి సొసైటీలో జరిగే అవినీతి పై చర్యలు చేపట్టి పేద సినిమా కార్మికులకు న్యాయం చేయాలని డిమాం డ్ చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. సినిమా కార్మికులు చేస్తున్న పోరాటం న్యాయమైందన్నారు. హౌసింగ్ సొసైటీలో అక్రమాలపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
నారాయణరెడ్డి హత్యకేసు సీబీఐకి అప్పగించాలి
పత్తికొండ టౌన్: చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యకేసును సీబీఐకి అప్పగించాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం సాయంత్రం పత్తికొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పత్తికొండకు వచ్చిన సీఎం చంద్రబాబు చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యతో కేఈ శ్యాంబాబుకు సంబంధం లేదని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. హత్యకేసుతో టీడీపీ నాయకులకు సంబంధం లేనప్పుడు సీబీఐ దర్యాప్తునకు ఎందుకు జంకుతున్నారని ఆయన ప్రశ్నించారు. అధికారం కోసం పిల్లనిచ్చిన మామను చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే, కేఈ శ్యాంబాబు ప్రతిపక్ష నాయకులను హత్యలు చేస్తున్నాడని ఆరోపించారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఎన్నికల ప్రచారంలో చెప్పుకునేందుకు ఏమీ లేక చంద్రబాబు.. ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. పసుపు–కుంకుమ ఇచ్చినందుకు ఆడపడుచులందరూ తమకే ఓట్లు వేయాలని అడుగుతున్న చంద్రబాబు, జిల్లాలో వందలాదిమంది మహిళల పసుపుకుంకుమలు పోవడానికి కారకులైన కోట్ల, కేఈ కుటుంబాలకు టికెట్లు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. నారాయణరెడ్డి హత్యకేసు నిందితులను పక్కనే పెట్టుకుని, నీతిమాటలు వల్లెవేయడం బాబుకే చెల్లిందన్నారు. అధికారం కోసం హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తున్న టీడీపీ నాయకులకు ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. -
నకిలీ విమాన టికెట్ బిల్లులు సమర్పించిన ఎంపీ
న్యూఢిల్లీ: జనతా దళ్ యునైటెడ్ (జేడీయూ) రాజ్యసభ సభ్యుడు అనిల్ సహానీ(53) సీబీఐ విచారణను ఎదుర్కోనున్నారు. పార్లమెంటుకు సమర్పించిన ట్రావెల్ అలవెన్స్ లో నకిలీ విమాన టికెట్ బిల్లులు సమర్పించిన కేసులో సీబీఐ విచారణకు ఆదేశిస్తూ రాజ్యసభ చైర్మన్ హమిద్ అన్సారీ ఉత్తర్వులను జారీ చేశారు. సహానీ రెండో సారి రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు. ఆయనపై చర్యలకు జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ వెనకాడుతున్నట్టు సమాచారం. నకిలీ ఎయిర్ ఈ- టికెట్లు, బోర్డింగ్ పాసులు మొత్తం కలిపి రూ.23 లక్షల బిల్లులను ఆయన పార్లమెంటుకు సమర్పించారు. ఆయన ఎక్కడికీ ప్రయాణం చేయకుండానే ఈ బిల్లులను సమర్పించారని ఆయనపై ఉన్న ప్రధాన అభియోగం. ఈ స్కామ్ లో ఢిల్లీ ఎయిర్ ఇండియా అధికారి ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రతీ పార్లమెంటు సభ్యునికి దేశంలో ప్రయాణించడానికి 34 విమాన టికెట్లు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం తనను అక్రమంగా కేసులో ఇరికించడానికి ప్రయత్నం చేస్తోందని సహానీ మండిపడ్డారు.