నకిలీ విమాన టికెట్ బిల్లులు సమర్పించిన ఎంపీ
నకిలీ విమాన టికెట్ బిల్లులు సమర్పించిన ఎంపీ
Published Fri, Apr 15 2016 8:13 PM | Last Updated on Sun, Sep 3 2017 10:00 PM
న్యూఢిల్లీ: జనతా దళ్ యునైటెడ్ (జేడీయూ) రాజ్యసభ సభ్యుడు అనిల్ సహానీ(53) సీబీఐ విచారణను ఎదుర్కోనున్నారు. పార్లమెంటుకు సమర్పించిన ట్రావెల్ అలవెన్స్ లో నకిలీ విమాన టికెట్ బిల్లులు సమర్పించిన కేసులో సీబీఐ విచారణకు ఆదేశిస్తూ రాజ్యసభ చైర్మన్ హమిద్ అన్సారీ ఉత్తర్వులను జారీ చేశారు.
సహానీ రెండో సారి రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు. ఆయనపై చర్యలకు జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ వెనకాడుతున్నట్టు సమాచారం. నకిలీ ఎయిర్ ఈ- టికెట్లు, బోర్డింగ్ పాసులు మొత్తం కలిపి రూ.23 లక్షల బిల్లులను ఆయన పార్లమెంటుకు సమర్పించారు. ఆయన ఎక్కడికీ ప్రయాణం చేయకుండానే ఈ బిల్లులను సమర్పించారని ఆయనపై ఉన్న ప్రధాన అభియోగం. ఈ స్కామ్ లో ఢిల్లీ ఎయిర్ ఇండియా అధికారి ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రతీ పార్లమెంటు సభ్యునికి దేశంలో ప్రయాణించడానికి 34 విమాన టికెట్లు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం తనను అక్రమంగా కేసులో ఇరికించడానికి ప్రయత్నం చేస్తోందని సహానీ మండిపడ్డారు.
Advertisement
Advertisement