
ఒడిదుడుకులను అధిగమిస్తేనే ఉన్నత శిఖరాలు ఎస్సీ గురుకుల విద్యార్థులతో రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి జూమ్‌లో పాఠాలు
సాక్షి, హైదరాబాద్: ప్రతి వ్యక్తి తన జీవిత ప్రయాణంలో ఒడిదుడుకులను అధిగమిస్తేనే.. ఉన్నత శిఖరాలకు చేరుకుంటాడని ఎంపీ సుధామూర్తి స్పష్టం చేశారు. విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం, పరీక్షల్లో భయం వీడి ధైర్యంగా సన్నద్ధం కావడం, ఆత్మస్థైర్యంతో జీవితంలో రాణించేందుకు ఎస్సీ గురుకుల సొసైటీ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రము ఖులతో విద్యార్థులను మాట్లాడించి చైతన్యపరిచేందుకు.. ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి అలగు వర్షిణి ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సొసైటీ పరిధిలోని పలువురు పాఠశాల విద్యార్థులను సోమవారం జూమ్ ద్వారా కనెక్ట్ చేసిన అనంతరం.. సుధామూర్తిని భాగస్వామిని చేశారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో ముచ్చటిస్తూ తన అనుభవాలను పంచు కున్నారు.
సుధామూర్తి బెస్ట్ ఫ్రెండ్ పేరు చెప్పాలని ఈ సందర్భంగా విద్యా ర్థులు అడిగారు. దీనిపై ఆమె స్పందిస్తూ తనకు ప్రత్యేకంగా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరూ లేరని, తనకు తానే బెస్ట్ ఫ్రెండ్ అన్నారు. విద్యార్థులకు క్రమశిక్షణ, ఓర్పు, సహనం ముఖ్యమని, నిత్యం ఇష్టమైన పుస్తకాలను చదువుతూ ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా తన బాల్య దశలో ఎదుర్కొన్న ఇబ్బందులు, కష్టాలను విద్యార్థులకు వివరించారు. తను చదువుకునే రోజుల్లో కళా శాలలు లేవని, రెండు మైళ్లకు పైగా పాఠశాల నుంచి ఇంటికి నడిచానన్నారు. 1968లో తన 17వ ఏట ఇంజనీరింగ్ కోర్సులో చేరేందుకు.. సైన్స్ గ్రూపులో దరఖాస్తు చేసుకుంటే కంప్యూటర్ సైన్స్‌లో సీటు వచ్చిందన్నారు. ఆ కళా శాలలో తాను ఒకే ఒక్క బాలికనని, మిగతా విద్యార్థులంతా బాలురేనని గుర్తు చేసుకున్నారు.
దీంతో ఆ కళాశాల ప్రిన్సిపల్.. ఇంత మంది మధ్యలో ఎలా చదువుకుంటావని ప్రశ్నించారన్నారు. చదువుపై తనకు విశేషమైన ఆసక్తి ఉన్నందున అది పెద్ద సమస్య కాదనడంతో.. ప్రిన్సిపల్ ఎంతో మెచ్చుకుని ప్రోత్సహించారన్నారు. బోధన అంటే చాలా ఇష్టమని, పీహెచ్‌డీ పూర్తి చేసు కొని ఉపాధ్యాయినిగా స్థిరపడాలనుకున్నా.. జీవితంలో ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొని ఒక సంస్థ స్థాపించడానికి దారితీసిందని సుధామూర్తి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment