
నేను రెడీ.. మీరు సిద్ధమా?
బీసీలకు ఏపీ అసెంబ్లీలో 33 శాతం సీట్లు ఇచ్చేందుకు తాను సిద్ధమని.. అవతలివైపు టీడీపీ రెడీనా అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సవాలు చేశారు.
బీసీలకు ఏపీ అసెంబ్లీలో 33 శాతం సీట్లు ఇచ్చేందుకు తాను సిద్ధమని.. అవతలివైపు టీడీపీ రెడీనా అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సవాలు చేశారు. అసెంబ్లీ నిరవధిక వాయిదా పడిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. బీసీల మీద ప్రేమ తనకొక్కడికే ఉన్నట్లు దాన్ని ఒలకబోస్తున్నట్లుగా చంద్రబాబు హడావుడిగా బీసీ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టడాన్ని ఆయన ఖండించారు.
రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా తాను వంద సీట్లు ఇస్తామంటూ ఆయన ప్రకటించారు గానీ ఏనాడూ 50-60 సీట్లకు మించి ఇవ్వలేదు. ఇప్పుడు 33 శాతం సీట్లు బీసీలకు ఇవ్వడానికి నేను సిద్ధం, వాళ్లు సిద్ధమా అన్నారు. వాళ్లకు న్యాయం జరగాలంటే బీసీలకు అవకాశం ఇచ్చిన చోట అవతలి అభ్యర్థి కూడా బీసీయే అయి ఉండాలని ఆయన తెలిపారు. అప్రాప్రియేషన్ బిల్లు గురించి మాట్లాడేటప్పుడు బీసీల విషయం గురించి మాట్లాడాలనడం ఎంతవరకు న్యాయమని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడిగారు.