వరంగల్/ఎంజీఎం: హనుమకొండ జిల్లా ఆరెపల్లి సమీపంలోని మహాత్మా జ్యోతిరావుపూలే బీసీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో ఆదివారం ఉదయం 10వ తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థినులు శానిటైజర్ తాగారు. దీంతో రుతిక, స్ఫూర్తి, జోత్స్న, ఉమాదేవి, చార్విక అనే విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో చికిత్స కోసం వారిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
చికిత్స అందిస్తున్న వైద్యు లు విద్యార్థినులకు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పడంతో స్కూల్ నిర్వాహకులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ములుగు జిల్లా పాకాల కొత్తగూడకు సంబంధించిన జ్యోతిరావుపూలే బీసీ రెసిడెన్షియల్ పాఠశాలను ఆరెపల్లి వద్ద ఒక ప్రైవేటు పాఠశాలను అద్దెకు తీసుకుని నిర్వహిస్తున్నారు. కాగా, శనివారం 10వ తరగతి విద్యార్థిని పుట్టినరోజు వేడుకల్లో తలెత్తిన గొడవ ఈ ఘటనకు దారి తీసినట్లు తెలుస్తోంది. బర్త్‌డేకు హాస్టల్‌లోని వారే కాకుండా ఇతర విద్యార్థులు కూడా హాజరు కావడంతో హాస్టల్ విద్యార్థినుల మధ్య గొడవ చోటు చేసుకుంది. దీంతో ఈ గొడవపై వసతి గృహం అధి కారులు విద్యార్థినులను మందలించినట్లు తెలిసింది.
అంతేకాకుండా ఈ విషయాన్ని వారు ఆదివారం ఉదయం ప్రిన్సి పాల్ దృష్టికి తీసుకెళ్లడంతో గొడవతో సంబంధం ఉన్న ఐదుగురు విద్యార్థినులు శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసింది. అధికారులు మాత్రం విద్యారి్థని బర్త్ డే వేడుకల్లో తలెత్తిన గొడవ కారణంగానే ఈ ఘటన జరిగినట్లు చెబుతున్నారు. కాగా, హాస్టల్లో విద్యార్థినులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌లు ఆరా తీసినట్లు సమాచారం. ఆస్పత్రి లో ఉన్న విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలని వై ద్యులకు సూచించినట్లు తెలుస్తోంది.
విచారణకు ఆదేశించిన మంత్రి..
ఈ ఘటనపై మంత్రి సత్యవతి రాథోడ్ విచారణకు ఆదేశించినట్లు చెపుతున్నారు. మరో పక్క ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చే స్తున్నాయి. ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని వరంగల్ అదనపు కలెక్టర్ శ్రీవత్స పరిశీలించారు. ఈ సందర్భంగా వారికి ఎలాంటి వైద్యం అందిస్తున్నారో.. తెలుసుకుని మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. విద్యారి్థనుల తల్లిదండ్రులతో మాట్లాడి హాస్టల్‌లో జరిగిన సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు.
చదవండి: ఎమ్మెల్యేలకు ఎర కేసు.... ఇప్పట్లో సిట్ ఎదుట సంతోష్ హాజరు లేనట్టే!
Comments
Please login to add a commentAdd a comment