సాక్షి, అమరావతి : బీసీ విద్యార్థులకు మాజీ ముఖ్యమంత్రి తీరని అన్యాయం చేశారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారయణ్ మండిపడ్డారు. రాష్ట్రంలో బీసీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, మెస్ చార్జీలు, కాస్మొటిక్ చార్జీలు గత ప్రభుత్వం దారి మళ్లించిందని తెలిపారు. బీసీ సంక్షేమ శాఖకు చెందిన 1432 కోట్ల రూపాయల నిధులను మళ్లింపు చేపట్టిన ప్రభుత్వం బీసీ, కాపు, ఈబీసీ, ఎంబీసీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వలేదని అన్నారు. చంద్రబాబు తమది బీసీల పార్టీ అని వారిని నిండా ముంచేశారని వ్యాఖ్యానించారు.
బీసీ, కాపు, ఈబీసీ విద్యార్థులు ప్రతిరోజు స్కాలర్‌షిప్‌ల కోసం పోన్లు చేస్తున్నారని తెలిపారు. గతేడాది పిల్లలకివాల్సిన నిధులను చంద్రబాబు ఓట్ల ప్రలోభాల కోసం మళ్లించారని ఆరోపించారు. ఎన్నికల ముందు బీసీలను అనేక రకాలుగా మోసం చేసిన చంద్రబాబు విద్యార్థులను కూడా వదల్లేదని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment