జిల్లాలో టీడీపీలో అసమ్మతి జ్వాలలు కొనసాగుతున్నాయి. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతున్నప్పటికీ పలు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై అనిశ్చితి నెలకొంది. కొన్ని చోట్ల టికెట్లపై స్పష్టత రాకపోవడం.. మరికొన్ని చోట్ల టీడీపీ ప్రకటించిన అభ్యర్థులపై తీవ్ర అసంతృప్తి చెలరేగడం పార్టీకి తలనొప్పిగా మారింది. నెలిమర్ల నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి ఎవరనేది ఇంకా స్పష్టత రాలేదు. నియోజకవర్గంలో మరోసారి ఐవీఆర్‌ఎస్ ద్వారా సర్వే చేపట్టాలని టీడీపీ భావిస్తోంది.