దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనేది సామెత. అయితే అధికారం ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి. అనే విధంగా అధికార పార్టీ నేతలు సామెతను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అచ్చంగా ఈ సామెతను జిల్లా టీడీపీలో కీలక నేత ఒకరు బాగా వంటబట్టించుకున్నారు. ఎన్నికలకు ముందు కౌన్సిలర్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే టిక్కెట్లతో పాటు ఎంపీపీ పదవులిప్పిస్తామంటూ వసూళ్లకు తెగబడ్డారు. ఇప్పుడేమో నామినేటేడ్ పదవులిప్పిస్తామంటూ మరోసారి రంగంలోకి దిగారు. జిల్లా టీడీపీలో ఇప్పుడీ చర్చ జోరుగా నడుస్తోంది.
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఎన్నికలకు ముందు జిల్లా టీడీపీలో ఆ నేత చక్రం తిప్పారు. తనకున్న పార్టీ పదవిని అ డ్డం పెట్టుకుని చెలరేగిపోయారు. పోటీకి ఆసక్తి చూపిన నాయకుల్ని క్యాష్ చేసుకున్నారు. ఎం పీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్ స్థానాలకు అభ్యర్థులుగా నిలబెడతామంటూ ఆశ చూపి పెద్ద ఎ త్తున డబ్బులు వసూలు చేశారు. జిల్లాలోని ఒక డివిజన్‌కు చెందిన వారే ఈ నేత ట్రాప్‌లో ఎక్కువగా పడిపోయారు.పెద్ద ఎత్తున సమర్పించుకున్నారు. అప్పట్లో ఆ నేతపై విపరీతమైన ఆరోపణలొచ్చాయి. పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదులు కూడా అందాయి. కొందరు నాయకులైతే బాహాటంగానే విమర్శలు గుప్పించారు.
సాధారణ ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే టిక్కెట్‌కు ఆశపడి కాంగ్రెస్ నుంచి వచ్చిన ఒక నాయకుడి దగ్గర రూ.30లక్షల వరకు లాగేసినట్టు అప్పట్లో ఆరోపణలొచ్చాయి. చివరికి అధిష్ఠానం వేరొకరికి సీటు ఖరారు చేయ డంతో కంగుతిన్న ఆ కాంగ్రెస్ నాయకుడు పెద్దఎత్తున తిట్టుకుని తిరిగి తన సొంత గూటికెళ్లిపోయారు. టిక్కెట్ ఇస్తామని డబ్బులు తీసుకున్న టీడీపీ నేతతో సన్నిహితులుగా ఉన్న ప్రతి ఒక్కరికీ చెప్పి ఆ నాయకుడు బాధపడ్డాడు. అలాగే, వైఎస్సార్‌సీపీ టిక్కెట్ రాదని పసిగట్టిన మరో నాయకురాలు కూడా ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పిస్తామం టూ ఆమె దగ్గరి నుంచి రూ.లక్షలు గుంజేసిన ట్టు తెలిసింది.
కాకపోతే, ఆ నాయకురాలు కక్కలేక, మింగలేక మౌనంగా ఉండిపోయారు. అయినా ఆ నేత త న వైఖరిని మార్చుకున్న దాఖ లాల్లేవు. తాజాగా ఏఎంసీ చైర్మన్, వైస్‌చైర్మన్, డెరైక్టర్ పదవులకని, గ్రంథాలయ సంస్థ చైర్మన్, ఇతర డెరైక్టర్ల పదవులకంటూ లక్షలాది రూపాయలు దండుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రంథాలయ సంస్థ పదవి గానీ, ఏఎంసీ చైర్మన్ పదవి గానీ ఇస్తామంటూ ఒక నాయకుడ్ని విమాన టిక్కెట్లు, హైదరాబాద్‌లో రూమ్‌లకని వాడుకున్నట్టు కూడా పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. నామినేటెడ్ పదవులకు సంబంధించి ఇప్పటికే తయారు చేసిన ప్రతిపాదిత జాబితాను పట్టుకుని చెలరేగిపోతున్నట్టు సమాచారం. విసృ్తతంగా వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఉన్న పార్టీ పదవి కూడా పోయే ప్రమాదం ఉందని, ఈలోపే లక్ష్యాన్ని దాటిపోవాలన్న ఉద్దేశంతో వసూళ్ల దందా పెంచారని పార్టీలోని కొందరు నేతలు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికే ఆ నేత పరిస్థితి పార్టీలో బాగోలేదు. కీలక పదవి పోతుందనే భయంతోనే ఏమో గానీ..నియోజకవర్గ ఇన్‌చార్జ్ పదవి అడిగినట్టు తెలిసింది. అందుకు జిల్లాలోని పార్టీ నేతల మద్దతు కూడగట్టి అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఆ ఇన్‌చార్జ్ పదవి కూడా ఇచ్చేందుకు హైకమాండ్ సిద్ధంగా లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ఇప్పుడా కీలక నేత జిల్లా టీడీపీలో హాట్‌టాఫిక్ అయ్యారు.
నామినేటెడ్ పదవి కావాలంటే సమర్పించాల్సిందే!
Published Sat, Feb 7 2015 3:21 AM | Last Updated on Fri, Mar 22 2019 6:18 PM
Advertisement