సాక్షిప్రతినిధి, ఖమ్మం: కాంగ్రెస్ పార్టీ నిబంధనలు కొందరు నేతలకు శాపంగా.. మరికొందరికి వరంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల కోసం గెలుపు గుర్రాలను ఎంపిక చేసేందుకు ఆ పార్టీ వడపోత కార్యక్రమాన్ని చేపట్టింది. వరుసగా మూడుసార్లు పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వారు.. 25వేల ఓట్లకన్నా తక్కువ ఓట్లు లభించిన వారు.. 30వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన వారిని గుర్తించి.. వారికి కాకుండా.. అక్కడి ఆశావహుల్లో పార్టీపై పట్టున్న నేతలకు టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రతి నియోజకవర్గం నుంచి దాదాపు పదుల సంఖ్యలో ఆశావహులు టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహాకూటమి ఏర్పడటం.. భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, సీపీఐ సైతం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ప్రభావిత పార్టీలుగా ఉండగా.. ఆయా నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ ఆశావహులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకోవడానికి ఒక కారణంగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించి.. మూడోసారి టీపీసీసీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క మధిర నుంచి పోటీ చేసేందుకు ప్రచారం సైతం ప్రారంభించారు. ఆయన మినహా కాంగ్రెస్‌లో వరుసగా రెండుసార్లు గెలిచి.. మూడోసారి టికెట్ ఆశిస్తున్న వారు జిల్లాలో లేకపోవడం విశేషం. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సంభాని చంద్రశేఖర్ 2004 వరకు పాలేరు నుంచి పలుసార్లు కాంగ్రెస్ తరఫున గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత సంభాని ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు జనరల్ స్థానంగా మారింది.
దీంతో 2009లో జనరల్ నుంచి ఎస్సీ నియోజకవర్గంగా మారిన సత్తుపల్లికి రాజకీయ వలస వెళ్లాల్సి వచ్చింది. 2009, 2014లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సంభాని మొదటిసారి పోటీ చేసినప్పుడు 65,483 ఓట్లు సాధించగా.. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య సంభానిపై గెలుపొందారు. 2014 ఎన్నికల్లోనూ టీడీపీ నుంచి సండ్ర, కాంగ్రెస్ నుంచి సంభాని, వైఎస్సార్ సీపీ నుంచి మట్టా దయానంద్, టీఆర్‌ఎస్ నుంచి పిడమర్తి రవి పోటీ చేయగా.. సంభాని చంద్రశేఖర్ ఆ ఎన్నికల్లో 30,100 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. అయితే సంభాని కాంగ్రెస్ విధించిన నిబంధనలకు లోబడి మరోసారి టికెట్ పొందే అర్హత పొంది ఉన్నారని ఆయన వర్గీయులు భరోసా వ్యక్తం చేస్తున్నారు. 2004, 2009, 2014 ఎన్నికల్లో పోటీ చేసి.. ప్రస్తుతం అదే కాంగ్రెస్ నుంచి టికెట్లు ఆశిస్తున్న నేతలు లేకపోవడంతో జిల్లాలోని కాంగ్రెస్ సీనియర్ నేతలందరికీ టికెట్ల కేటాయింపునకు పార్టీ విధించిన నిబంధనలు అడ్డుపడే అవకాశం లేదని భావిస్తున్నారు.
‘వనమా’ ప్రయత్నాలు..
కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న వనమా వెంకటేశ్వరరావు 2004, 2009, 2014 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. 2004లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఘన విజయం సాధించగా.. 2009 ఎన్నికల్లో అదే పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఆయన సమీప ప్రత్యర్థి కాంగ్రెసేతర మిత్రపక్షాల అభ్యర్థిగా పోటీ చేసిన సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు 47,028 ఓట్లు సాధించి గెలుపొందగా.. వనమా 45,024 ఓట్లు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచారు. ఇక 2014 ఎన్నికల్లో అదే కొత్తగూడెం స్థానం నుంచి టికెట్ ఆశించిన వనమాకు సీపీఐ, కాంగ్రెస్ పొత్తు కారణంగా టికెట్ లభించలేదు. దీంతో అప్పుడు డీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉన్న వనమా పార్టీ టికెట్ తనకు నిరాకరించడంతో వైఎస్సార్ సీపీలో చేరి కొత్తగూడెం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి జలగం వెంకటరావుపై ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో వనమా 34వేల ఓట్లు సాధించారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వనమా మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరి.. ఈ ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్నారు. అయితే వనమా 2004లో కాంగ్రెస్ నుంచి గెలుపొందగా.. 2009లో 40వేలకు పైచిలుకు ఓట్లు సాధించడం, 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేయకపోవడం వంటి కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ రూపొందించిన మూడు నియమాలు ఆయనకు వర్తించే అవకాశం లేదని కాంగ్రెస్‌లోని ఆయన అనుచర వర్గం వాదిస్తోంది. వనమా సైతం ఈసారి కాంగ్రెస్ తరఫున తనకు టికెట్ ఇవ్వాలని అధిష్టానానికి దరఖాస్తు చేసుకోవడంతోపాటు అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడానికి తనవంతు ప్రయత్నాలు ప్రారంభించారు.
కొత్త ముఖాలకే సీట్లు..!
ఇక ఉమ్మడి జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కాంగ్రెస్ తరఫున 2004, 2009, 2014లో పోటీ చేసిన అభ్యర్థుల్లో అనేక మంది ఇప్పటికే వివిధ పార్టీలకు వలస వెళ్లడంతో కాంగ్రెస్ పార్టీ అత్యధిక నియోజకవర్గాల్లో కొత్త ముఖాలకు సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఖమ్మంలో 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటమి చెందిన మాజీ ఎమ్మెల్యే యూనిస్ సుల్తాన్, 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి విజయం సాధించిన పువ్వాడ అజయ్‌కుమార్ టీఆర్‌ఎస్ గూటికి చేరడంతో ఖమ్మం నియోజకవర్గంలో కొత్త అభ్యర్థికి టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. 1999లో సత్తుపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఖమ్మం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తుండగా.. మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, పారిశ్రామికవేత్త వద్దిరాజు రవిచంద్ర, కాంగ్రెస్ నేత మానుకొండ రాధాకిషోర్ తదితరులు టికెట్ కోసం దరఖాస్తు చేశారు.
అయితే వీరికి కాంగ్రెస్ విధించిన మూడు నిబంధనలు వర్తించే అవకాశం లేకపోవడంతో ఎవరికి వారు తమవంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పాలేరు నియోజకవర్గంలోని అభ్యర్థులకు సైతం కాంగ్రెస్ విధించిన నిబంధన వర్తించే అవకాశం లేదు. టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న ఆశావహులందరూ దాదాపు ఆ పార్టీ తరఫున తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న వారే కావడంతో ఈ నిబంధనల వల్ల సీటు కోల్పోయే అవకాశం లేదు. 2009, 2014లో ఆ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించిన మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి 2015లో మరణించడంతో 2016లో ఉప ఎన్నికలు నిర్వహించారు. ఉప ఎన్నికల్లో ఆయన సతీమణి సుచరితారెడ్డి 49వేలకు పైచిలుకు ఓట్లు సాధించారు. దీంతో రాంరెడ్డి కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ భావించినా.. వచ్చిన ఓట్ల ఆధారంగా అర్హత ఉన్నట్లేనని ఆయన అభిమానులు విశ్లేషిస్తున్నారు.
అక్కడా లేనట్లే..
ఇల్లెందు నియోజకవర్గం నుంచి 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కోరం కనకయ్య 2009లో ఓటమి చెందగా.. 2014లో వి జయం సాధించి.. అనంతరం టీఆర్‌ఎస్ తీర్థం పు చ్చుకున్నారు. దీంతో ఆ నియోజకవర్గంలో టికెట్ ఆశిస్తున్న 15 మందిలో ఎవరూ వరుసగా మూడుసార్లు ఓడిపోయిన జాబితాలో లేకపోవ డం విశేషం. అయితే ఈసారి అక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ నేతలు వివిధ పార్టీల నుంచి అదే నియోజకవర్గం నుంచి, ఇతర నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన అనుభవం మాత్రం ఉండటంతో దానినే అదనపు అర్హతగా చూపిస్తూ టికెట్ కోసం అధిష్టానం వద్ద ప్రయత్నం చేసు ్తన్నారు. 2009లో పినపాక నియోజకవర్గం ఆవిర్భవించాక కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రేగా కాంతారావు విజయం సాధించారు. 2014లో సీపీఐ, కాంగ్రెస్ మిత్రపక్షాల పొత్తులో భాగంగా ఆ సీ టును సీపీఐకి కేటాయించడంతో గత ఎన్నికల్లో రేగా పోటీ చేయలేదు. మళ్లీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున టికెట్ ఆశిస్తున్న రేగా కాంతారావు ఈసా రి తనకే టికెట్ ఇవ్వాలని అధిష్టానం వద్ద భారీ ప్రయత్నాలు చేస్తుండగా.. ఇదే నియోజకవర్గం ను ంచి అజ్మీరా శాంతి టికెట్ ఆశిస్తున్నారు.
వీరికి సై తం కాంగ్రెస్ రూపొందించిన మూడు నియమా లు వర్తించే అవకాశం లేదు. భద్రాచలంలో 2009 లో పోటీ చేసి విజయం సాధించిన కుంజా సత్యవతి.. 2014లోనూ అదే పార్టీ నుంచి పోటీ చేసి సీపీఎం అభ్యర్థి సున్నం రాజయ్యపై ఓటమి చెందారు. అయితే ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామా ల నేపథ్యంలో సత్యవతి బీజేపీలో చేరారు. ఈసా రి ఆమె బీజేపీ తరఫున భద్రాచలం నుంచి పోటీ చేసేందుకు సమాయత్తమవుతున్నట్లు ప్రచారం జ రుగుతోంది. ఇక భద్రాచలంలోనూ వరుసగా మూడుసార్లు ఓడిపోయిన అభ్యర్థులు లేకపోవడ ంతో అక్కడా కాంగ్రెస్ కొత్తవారికే అవకాశం ఇ చ్చే పరిస్థితి ఉందని రాజకీయ వర్గాలు భావిస్తు న్నా యి. అశ్వారావుపేటలో 2009లో కాంగ్రెస్ తర ఫున పోటీ చేసిన వగ్గెల మిత్రసేన విజయం సాధి ంచగా.. 2014లోనూ అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున ఆయనే పోటీ చేసి ఓట్లపరంగా 3వ స్థానంలో నిలిచారు.
అయితే అనారోగ్య కార ణంతో మిత్రసేన మరణించడంతో ఆ నియోజకవర్గంలోనూ కొత్త అభ్యర్థికి టికెట్ ఇవ్వాల్సిన పరి స్థితి కాంగ్రెస్‌లో నెలకొంది. ఇక వైరాలో 2009లో కాంగ్రెస్ తరఫున డాక్టర్ రామచంద్రనాయక్ పోటీ చేయగా.. 2014లో సీపీఐ, కాంగ్రెస్ మిత్రపక్షాల పొత్తు కారణంగా ఆ స్థానాన్ని సీపీఐకి కేటాయించడంతో కాంగ్రెస్ పోటీ చేయలేదు. 2009లో ఆ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన రామచంద్రనాయక్ ఈసారి ఇల్లెందు నుంచి టికెట్ ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్నారు. దీంతో వైరా నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ తరఫున ఎవరికి టికెట్ ఇచ్చినా మొదటిసారి పోటీ చేసినట్లే అవుతుంది. కాంగ్రెస్ రూపొందించిన మూడు నియమాల కారణంగా జిల్లాలో టికెట్ కోల్పోయే అవకాశం ఉన్న కాంగ్రెస్ నేతలు లేనట్లేనని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment