సాక్షి, న్యూఢిల్లీ : సీట్ల కేటాయింపు వ్యవహారం కాంగ్రెస్ హైకమాండ్‌కు తలనొప్పిగా మారింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 74 మంది అభ్యర్థుల లిస్టుకు ఓకే చెప్పిన ఆ పార్టీ మిగిలిన 19 స్థానాలను పెండింగ్‌లో ఉంచిన విషయం తెలిసిందే. అయితే సీట్ల కేటాయింపు వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సీనియర్ నాయకులు హైకమాండ్‌తో బ్లాక్‌మెయిలింగ్ పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కోమటి రెడ్డి బ్రదర్స్.. తమ అనుచరుడు చిరమర్తి లింగయ్యకు నకిరేకర్ టికెట్ ఇవ్వకపోతే పోటీ నుంచి తప్పుకుంటామని బహిరంగంగా ప్రకటించారు. తాజాగా కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి సైతం అలకబూనినట్లు తెలుస్తోంది. పార్టీలో చేరినప్పుడు ఇచ్చిన హామీ అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. తన అనుచరులకు టికెట్లు దక్కపోతే తాను కూడా పోటీ నుంచి తప్పుకుంటానని హైకమాండ్‌ను హెచ్చరించినట్లు తెలుస్తోంది.
రేవంత్ కోరుతున్న సీట్లు: 1.వరంగల్ వెస్ట్ (నరేందర్ రెడ్డి) 2. నిజామాబాద్ రూరల్ (అరికెల నర్సారెడ్డి) 3. ఆర్మూరు (రాజారామ్ యాదవ్) 4. ఎల్లారెడ్డి (సుభాష్ రెడ్డి) 5. దేవరకొండ (బిల్యా నాయక్) 6. ఇల్లందు (హరిప్రియ) 7. సూర్యాపేట (పటేల్ రమేష్ రెడ్డి) 8. చెన్నూరు (బోడ జనార్దన్)
Comments
Please login to add a commentAdd a comment