సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 74మంది అభ్యర్థుల లిస్టుకు ఓకే చెప్పిన కాంగ్రెస్ మిగిలిన 20 స్థానాల అభ్యర్థుల ప్రకటనలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ స్థానాలకు కూడా ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటిస్తే అక్కడున్న అసమ్మతి నేతలు రెబల్స్‌గా మారే అవకాశం ఉండడమే దీనికి కారణంగా కనిపిస్తోంది. 74 మంది అభ్యర్ధులతో తొలి జాబితాను ఈనెల 10న విడుదల చేయనున్న కాంగ్రెస్ మిగిలిన 20 స్థానాలపై వ్యూహాత్మకంగానే జాప్యం చేస్తోంది. టికెట్ రాని నేతలకు ప్రత్యర్థి పార్టీలు గాలం వేయకుండా చివరి నిమిషంలో అభ్యర్థులను ప్రకటించనుంది.
కాంగ్రెస్ ఆపిన స్థానాలు ?
1. మునుగోడు | 2. మేడ్చల్ |
3. మంచిర్యాల | 4. సూర్యాపేట |
5. ఇల్లందు | 6. కొత్తగూడెం |
7. నకిరేకల్ | 8. నాగర్‌కర్నూల్ |
9. తుంగతుర్తి | 10. సికింద్రాబాద్ |
11. వికారాబాద్ | 12. మహబూబ్‌నగర్ |
13. దేవరకొండ | 14. వరంగల్ ఈస్ట్ |
15. ములుగు | 16. మెదక్ |
17. పాలకుర్తి | 18. భద్రాచలం |
19. ఇబ్రహీంపట్నం | 20. నారాయణఖేడ్ |
Comments
Please login to add a commentAdd a comment