తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదు | Srikantachari mother Shankaramma joined the Congress | Sakshi
Sakshi News home page

తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదు

May 10 2024 4:43 AM | Updated on May 10 2024 4:43 AM

Srikantachari mother Shankaramma joined the Congress

బీఆర్‌ఎస్‌వన్నీ నిరాధార ఆరోపణలు: మంత్రి ఉత్తమ్‌ 

మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణకు బీజేపీ చేసిందేమీలేదని రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి కెప్టెన్‌.ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. నిజంగా తెలంగాణకు బీజేపీ చేసిందేదైనా ఉంటే ఫలానా పనిచేశానని మోదీ చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మతోపాటు హుజూర్‌నగర్‌ నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. గాం«దీభవన్‌లో గురువారం ఉత్తమ్‌తో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దీపాదాస్‌మున్షీలు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహా్వనించారు. 

అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శంకరమ్మతో కలిసి ఉత్తమ్‌ మాట్లాడుతూ శ్రీకాంతాచారి తెలంగాణ కోసం తన ప్రాణాలను త్యాగం చేశాడని, శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ చాలా కాలం బీఆర్‌ఎస్‌లో పనిచేసినా ఆమెకు న్యాయం చేయలేదన్నారు. తనపై శంకరమ్మ పోటీ చేసినా, ఎప్పుడూ తాము వ్యక్తిగత వైరాలకు వెళ్లలేదని, శంకరమ్మ చేరికతో హుజూర్‌నగర్‌లో బీఆర్‌ఎస్‌ ఖాళీ అయ్యిందని చెప్పారు.

లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలను మోసం చేసి గెలవాలని బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఎన్నికలు కాగానే కొత్త రేషన్‌కార్డులు ఇస్తామని, అర్హులైన వారందరికీ ఇళ్లు కట్టిస్తామని భరోసా ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 13 చోట్ల గెలుపొందుతుందని, 3 చోట్ల బీజేపీతో, ఒక చోట ఎంఐఎంతో కాంగ్రెస్‌కు పోటీ ఉందన్నారు. 

నాకు అన్యాయం జరిగింది: శంకరమ్మ 
శంకరమ్మ మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ పార్టీలో తమకు అన్యాయం జరిగిందని చెప్పారు. శ్రీకాంతాచారి మరణం చూసిన సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అందరూ కాంగ్రెస్‌ పార్టీకి ఓటేయాలని ఆమె కోరారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement