టికెట్‌ ఇవ్వకపోతే ప్రాణ త్యాగానికైనా సిద్ధం! | If I Don't Get Ticket, I'll Commit Suicide - Srikanth Chary's Mother | Sakshi
Sakshi News home page

టికెట్‌ ఇవ్వకపోతే ప్రాణ త్యాగానికైనా సిద్ధం!

Published Mon, Sep 17 2018 1:48 AM | Last Updated on Fri, Mar 22 2019 6:25 PM

If I Don't Get Ticket, I'll Commit Suicide - Srikanth Chary's Mother - Sakshi

హుజూర్‌నగర్‌: హుజూర్‌నగర్‌ నియోజకవర్గం నుంచి తనకు టికెట్‌ ఇవ్వకపోతే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ హెచ్చరించారు. ఆదివారం హుజూర్‌నగర్‌లోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో జరిగిన ఓటర్‌ జాబితా సవరణ సమావేశంలో ఆమె విలేకరులతో మాట్లాడారు.

2014లో కేసీఆర్‌ తనకు పార్టీ టికెట్‌ ఇస్తే 47 వేల ఓట్లు పొందానన్నారు. నాటి నుంచి నియోజకవర్గంలోనే ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నానన్నారు. అమరుల కుటుంబాలకు కేసీఆర్‌ న్యాయం చేస్తారని భరోసా ఉన్నప్పటికీ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డి తనకు టికెట్‌ రాకుం డా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. హుజూర్‌నగర్‌ నియోజకవర్గ టికెట్‌ తప్ప రాష్ట్రంలో ఎక్కడ ఇచ్చినా తాను అంగీకరించబోనన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement