srikanth chary
-
నాకు ఒక పదవి కల్పించాలని సీఎం కేసీఆర్ ను కోరుతున్న: శంకరమ్మ
-
ఎమ్మెల్సీ పదవి ప్రచారంపై శంకరమ్మ స్పందన
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ సర్కార్ ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అమరవీరుల స్మృతి వనం మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. అయితే ఈ కార్యక్రమానికి తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలిగా అమరుడైన శ్రీకాంత్ చారి తల్లికీ ఆహ్వానం.. ఆ ఆహ్వానం వెనుక ఆమెకు శాసనమండలి సభ్యురాలిగా అవకాశం ఇచ్చే ప్రతిపాదనపైనా రాజకీయ చర్చ మొదలైంది. యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం పొడిచేడు గ్రామానికి చెందిన కాసోజు శంకరమ్మకు తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి ఫోన్ చేసి కార్యక్రమానికి ఆహ్వానించారట. ఈ విషయాన్ని స్వయంగా శంకరమ్మ సాక్షికి తెలిపారు. అయితే ఎమ్మెల్సీ పదవి గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని అంటున్నారామె. గతంలో ఎన్నడూ సీఎం కేసీఆర్‌ను కలవలేదని.. అలాగని ఆయన మీద వ్యతిరేకత ఏం లేదని చెప్పారామె. స్మృతి వనం రూపంలో తన కొడుకు లాంటి ప్రత్యేక రాష్ట్రం కోసం బలిదానాలు చేసినవాళ్లు సజీవంగా బతికే ఉన్నట్లు భావిస్తానని సంతోషం వ్యక్తం చేశారామె. కేసీఆర్ ప్రకటన? ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ శ్రేణుల్లో, ఆయా సంబంధిత వాట్సాప్ గ్రూపుల్లో గత కొంతకాలంగా శంకరమ్మ ఎమ్మెల్సీ పదవి గురించే జోరుగా చర్చ నడుస్తోంది. ఆమెకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వడంతో పాటు గన్‌మన్‌ను ఓ పీఏను, ప్రభుత్వ వాహనాన్ని సీఎం కేసీఆర్ కేటాయించారంటూ పుకార్లు చక్కర్లు కొట్టాయి. గురువారం ఉదయం నుంచి ఆమెకు ఈ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని కూడా ప్రచారం నడుస్తోంది. అలాగే.. అమరవీరుల స్మృతి వనం ప్రారంభోత్సవ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ స్వయంగా శంకరమ్మ ఎమ్మెల్సీ ప్రకటన చేయొచ్చనే ప్రచారమూ నడుస్తోంది. గతంలో రాజకీయ ఎంట్రీ కోసం శంకరమ్మ తీవ్ర యత్నాలే చేసి భంగపడిన సంగతి విదితమే. మరోవైపు అమరవీరుల కుటుంబాల నుంచి పలు అభ్యంతరాలు, విమర్శలు వ్యక్తం అవుతుండడంతో.. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో శంకరమ్మకు ఎమ్మెల్సీ ఆఫర్ చేస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇదీ చదవండి: గద్దర్.. కేసీఆర్‌ను నిలదీయు -
శ్రీకాంతాచారి తండ్రి అదృశ్యం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి తండ్రి కాసోజు వెంకటచారి అదృశ్యమయ్యాడు. ఈ మేరకు ఆయన భార్య శంకరమ్మ శనివారం హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీకాంతాచారి తల్లిదండ్రులు కొంత కాలంగా హయత్‌నగర్ డివిజన్ సూర్యానగర్‌లో నివాసముంటున్నారు. శ్రీకాంతాచారి తండ్రి వెంక టచారి ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఈ నెల 1న పనిమీద బయటికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన వెంకటచారి తిరిగి రాలేదు. 2వ తేదీన సోషల్ మీడియా ద్వారా అతను ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ వద్ద ఉన్నట్లు గుర్తించిన కుటుంబ సభ్యులు ఆయనకు ఫోన్ చేయగా ఎత్తలేదు. వెంకటచారి ఎంతకీ తిరిగి రాపోవడంతో ఆయన కేఏ పాల్ వద్ద ఆశ్రయం పొందుతున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తూ శంకరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
‘కేఏపాల్‌తో మా కుటుంబానికి ప్రాణహాని.. నా భర్తను విడిపించండి’
సాక్షి, హైదరాబాద్: ప్రజాశాంతి పార్టీ అధినేత కేఎపాల్ తన భర్త కాసోజు వెంకటాచారిని మభ్యపెట్టి బంధించాడని, వెంటనే అతడిని విడుదల చేయాలని తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంత్‌చారి తల్లి కాసోజు శంకరమ్మ డిమాండ్ చేశారు. సోమవారం ఎల్బీనగర్లోని శ్రీకాంత్‌చారి విగ్రహం వద్ద బంధువులతో కలిసి కేఏ పాల్ చిత్రపటాన్ని దహనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన భర్తను కేఎపాల్ తన ఇంటిలో బంధించాడని, తాము కేఎపాల్ ఇంటికి వెళ్లి వెంకటాచారిని విడిచిపెట్టాలని కోరగా బౌన్సర్లతో గెంటి వేయించాడని ఆరోపించారు. గేటుకు తాళాలు వేసి లోపలికి రానివ్వడం లేదన్నారు. వెంకటాచారి విడాకుల నోటీసును మీ ఇంటికి పంపించాడు అందలేదా.. అని కేఏ పాల్ తన అనుచరులతో చెప్పిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కేఏ పాల్‌తో తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆరోపించారు. శ్రీకాంత్‌చారి పేరు చెప్పుకుని, ఉద్యమకారుల పేరుతో రాజకీయాలు చేస్తే కేఏపాల్‌కు బుద్ధి చెబుతామన్నారు. కేఏపాల్ చేపట్టే బస్సు యాత్రలో తన భర్త వెంకటాచారిని వెంట తీసుకెళుతూ, తన కుమారుడు శ్రీకాంత్‌చారి ఫొటోను వాడుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎల్బీనగర్లోని శ్రీకాంత్‌చారి విగ్రహం వద్ద కేఎపాల్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో తెలంగాణ నుంచి అతడిని తరిమి కొడతామన్నారు. కార్యక్రమంలో బంధువులు సునంద, లలిత, నర్సింహాచారి, వీరాచారి, వాసుదేవాచారి, సంపతాచారి, రఘు తదితరులు పాల్గొన్నారు. చదవండి: Amnesia Pub Case: ఎమ్మెల్యే రఘునందర్‌రావుపై కేసు నమోదు -
టికెట్ ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటా : శ్రీకాంతాచారి తల్లి
-
శ్రీకాంతాచారి తల్లికి టికెట్ ఇవ్వాలని..
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇద్దరు యువకులు రేడియో టవర్ ఎక్కారు. శుక్రవారం ఎల్బీనగర్లోని చింతల్ కుంటలోని రేడియో టవర్ ను ఎక్కిన యువకులు శంకరమ్మకు టికెట్ ఇస్తేనే కిందకు దిగుతామని స్పష్టం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రెండు గంటల నుంచి ఇద్దరు యువకులు రేడియో టవర్ పైనే ఉండటంతో అక్కడ స్థానికులు భారీగా గుమిగూడారు. తెలంగాణ ఉద్యమంలో ఆమరణ దీక్షకు సిద్దమైన కేసీఆర్ అరెస్ట్‌ను నిరసిస్తూ.. నల్గొండ జిల్లాకు చెందిన శ్రీకాంతాచారి ఎల్బీనగర్ చౌరాస్తాలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో ప్రస్తుత పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. గత కొన్ని రోజులుగా తెలంగాణ అమరవీరులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె బహిరంగంగానే విమర్శిస్తున్న విషయం తెలిసిందే. -
శ్రీకాంతాచారి తల్లి తీవ్ర ఆవేదన
-
శ్రీకాంతాచారి తల్లి తీవ్ర మనోవేదన
సాక్షి, భువనగిరి : తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి.. తెలంగాణ రాష్ట్రం కోసం మలిదశ ఉద్యమంలో మొదట తనకు తాను నిప్పటించుకొని ఆత్మత్యాగం చేసుకున్న అమరుడు ఆయన.. కానీ శ్రీకాంతాచారి ఆత్మత్యాగం నిరూపయోగమైపోయిందని ఆయన తల్లి శంకరమ్మ శనివారం తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకల సందర్భంగా తనను మొదట వేదిక మీదకు పిలువకపోవడంతో ఆమె మనస్తాపానికి గురయ్యారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో ఈ ఘటన జరిగింది. తెలంగాణ రాష్ట్ర నాలుగోవ ఆవిర్భావ వేడుకల్లో ఇక్కడ నిర్వహించిన కార్యక్రమంలో తనను వేదికపైకి మొదట పిలువకపోవడంతో ఆమె ఆవేదన చెందారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు శ్రీకాంతాచారి త్యాగాన్ని మరిచిపోయి.. తన కొడుకును అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత జోక్యం చేసుకుని.. ఆమెను సముదాయించే ప్రయత్నం చేశారు. దీంతో వేదికపై తనను సన్మానించిన వెంటనే.. ఆవేదనతో అక్కడి నుంచి శంకరమ్మ వెళ్లిపోయారు. -
శ్రీకాంత్ చారి కుటుంబాన్నిపరామర్శించిన గద్దర్
మోత్కూరు: తెలంగాణ అమరవీరుడు, మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలిసారి ప్రాణాలు త్యాగం చేసిన శ్రీకాంత్ చారి కుటుంబాన్ని గద్దర్ పరామర్శించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పుడిచేడు గ్రామంలోని వారి ఇంట్లో అమరజ్యోతి వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు. శ్రీకాంత్ చారి ఆశయాల కోసం పోరాటం చేస్తామని ఈ సందర్భంగా గద్దర్ తెలిపారు. -
త్యాగానికి, ద్రోహానికి మధ్య పోరు: హరీష్‌రావు
ఎవరికి ఓటేస్తారో ప్రజలే తేల్చుకోవాలి : హరీష్‌రావు హుజూర్నగర్, న్యూస్‌లైన్: ఈ ఎన్నికలు త్యాగానికి, ద్రోహానికి మధ్య జరుగుతున్నాయని టీఆర్ఎస్ నేత హరీష్‌రావు అన్నారు. తెలంగాణ కోసం ఆత్మ బలిదానానికి పాల్పడిన శ్రీకాంతాచారిది త్యాగమైతే.. అదే ఉద్యమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డిది ద్రోహం.. త్యాగానికి ఓటేస్తారో.. ద్రోహానికి ఓటేస్తారో హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజలే తేల్చుకోవాలని కోరారు. నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌లో బుధవారం రాత్రి జరిగిన తెలంగాణ నవ నిర్మాణ సాధన మహాసభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున నడుస్తున్న సమయంలో ఉద్యమకారులపై కేసులు పెట్టించి, దెబ్బలు కొట్టించిన చరిత్ర ఉత్తమ్‌కుమార్ రెడ్డికి ఉందన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన పోరాటంలో 1200 మంది యువకులు ఆత్మ బలిదానాలకు పాల్పడినా.. ఒక్కరోజైనా అమరుల కుటుంబాలను పరామర్శించని కాంగ్రెస్ నాయకులు.. తామే ఏర్పాటు చేశామంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. అమరవీరుల కుటుంబాలను గౌరవిస్తూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ తొలి అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ కేటాయించినట్లు గుర్తుచేశారు. ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు, డాక్టర్లు, కళాకారులు, ర చయితలు, న్యాయవాదులు, ఉద్యోగులందరికీ అవకాశాలు కల్పిస్తూ ఎమ్మెల్యే, ఎంపీ సీట్లను టీఆర్ఎస్ పార్టీ కేటాయించిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక్క అమరవీరుడి కుటుంబానికి కూడా సీటు కేటాయించకపోవడాన్ని చూస్తుంటే ఆ పార్టీకి అమరవీరుల కుటుంబాలపై ఏపాటి ప్రేమ ఉందో తెలిసిపోతుందన్నారు. తెలంగాణ అమరవీరులపై ఏ మాత్రం గౌరవం ఉన్నా టీడీపీ, కాంగ్రెస్ నాయకులు తమ నామినేషన్లను ఉపసంహరించుకొని శంకరమ్మను ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలని హరీష్‌రావు కోరారు. టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు రమణాచారి మాట్లాడుతూ అమర వీరుల త్యాగాలు, కేసీఆర్ పోరాటపటిమ ఫలితంగానే తెలంగాణ ప్రజల కల సాకారమైందన్నారు. హుజూర్నగర్ అసెంబ్లీ అభ్యర్థి శంకరమ్మ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం తన కుమారుడు శ్రీకాంత్‌చారి ఆత్మ బలిదానానికి పాల్పడి మంటల్లో కాలుతూ జై తెలంగాణ అన్నాడే తప్ప అమ్మా, నాన్నలను తలచలేదన్నారు. తెలంగాణ అమరవీరులను కేసీఆర్ ఒక్కరే గౌరవించారని తెలిపారు. -
'కేసీఆర్ టిక్కెటివ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా'
-
లోకమంతా సంరంభం
అరవై ఏళ్ల కల.... లోక్‌సభ సాక్షిగా సాకారమైన వేళ... నల్లగొండ నగారై మోగింది... ఊరూవాడా...ఎక్కడ చూసినా... జై తెలంగాణ....జైజై తెలంగాణ త్యాగాల బాటలో..పోరు కె రటాలై.. మలి ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతచారి.. ఉస్మానియాలో ఊపిరొదిలిన వేణుగోపాలరెడ్డి.. మంత్రి పదవినే వదులుకున్న కోమటిరెడ్డి.. నిత్య నిర్బంధాలను (పీడీ యాక్టు) లెక్కచేయని చెరుకు సుధాకర్.. ఎందరో...ఇంకెందరో పోరుబిడ్డలు... నా తెలంగాణ...ఇప్పుడు కోటి సంబురాల వీణ సాక్షిప్రతినిధి, నల్లగొండ: ‘ప్రాణమివ్వడం.. అంటే .. పొద్దూ పొడవడమాని..’ అన్న కవి వాక్కులను అక్షర సత్యం చేస్తూ అగ్నికీలలతో పునీతుడైన శ్రీకాంతచారి తెలంగాణ తొలిపొద్దు పొడుపు. 2009 డిసెంబరు ప్రకటన అనంతరం వెనక్కితగ్గిన కేంద్రం తీరుకు నిరసనగా నిలువెల్లా కాలిపోయిన కాసోజు శ్రీకాంతచారి పొడిచేడు పేరును తెలంగాణ ఉద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాడు. వేణుగోపాల్‌రెడ్డి ఆత్మత్యాగం .. తెలంగాణ ప్రజాప్రతినిధులను కదలించిన వైనం.. పదవులు పూచిక పుల్లలతో సమానమంటూ అమాత్య పదవిని అమాంతం వదిలేసుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ప్రభుత్వ నిరంకుశ విధానానికి బాధితునిగా పీడీ యాక్టు కింద జైలుపాలైన డాక్టర్ చెరుకు సుధాకర్.. ఇలా.. తెలంగాణ త్యాగాల చరిత్రలో జిల్లాదే ప్రధానముద్ర. తెలంగాణ చరిత్రలో జిల్లాకు ఓ ప్రత్యేకమైన పేజీ ఉంటుంది . ఇపుడు తెలంగాణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొంది కొత్త రాష్ట్రం ఏర్పాటుకు అన్ని అడ్డంకులూతొలిగిపోయిన వేళ, మంగళవారం జిల్లా అంతటా సంబరాలు అంబరాన్ని అంటాయి. లోక్‌సభలో బిల్లుప్రవేశ పెట్టినప్పుటి నుంచే అంతా టీవీల ముందు కదలకుండా కూర్చున్నారు. సీమాంధ్ర నేతల గొడవలతో లోక్‌సభ సమావేశాలకు అంతరాయం కలగడం, వరసగా వాయిదా పడుతుండడంతో ఆవేశానికి లోనయ్యారు. తీరా బిల్లు ఆమోదం పొందాక పట్టరాని సంతోషంతో రోడ్లపైకి వచ్చారు. మహిళలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు, ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులు అన్న తారతమ్యం లేదు. అంతా ఒక్క చోట చేరి సంబరాలు చేసుకున్నారు. గడిచిన ఆరునెలలుగా ఎన్నో పరిణామాలను చూస్తున్న తెలంగాణవాదులు ఉత్కంఠగా గడుపుతున్నారు. యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన జూలై 30వ తేదీ నుంచి ఎంతో సంయమనంతో వేచి చూసిన జిల్లా ప్రజానీకం మంగళవారం కట్టలు తె ంచుకున్న ఆనందంతో ఒక్కసారిగా రోడ్లెక్కారు. టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత నుంచి ఊపందుకున్న తెలంగాణ ఉద్యమంలో గడచిన పధ్నాలుగున్నరేళ్లలో జిల్లా తెలంగాణవాదులు పోషించిన పాత్ర తక్కువేం కాదు. పలు ప్రధాన ఘట్టాలకు నల్లగొండ వేదికంగా నిలిచింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మూక్కుమ్మడి రాజీనామాలు, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్యమ కార్యక్రమాలు, శ్రీకాంతచారి అమరత్వం, తెలుగు సమాజం ఆలోచించేలా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘జై బోలో తెలంగాణ’ సినిమా, సకల జనుల సమ్మె కాలంలో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన జాతీయరహదారుల దిగ్బంధం ఇలా.. ఎన్నో ప్రధానమైన పోరాటాలకు, త్యాగాలకు జిల్లా చిరునామాగా నిలిచింది. ఈ కారణంగానే బిల్లు ఆమోదం పొందగానే.. అనూహ్యమైన స్పందన ప్రజల్లో కనిపించింది. నా త్యాగం.. వృథా కాలేదు : కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే ‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అలవోకగా ప్రాణత్యాగం చేసిన యువతీ యువకుల సాహసం కదిలించింది. స్ఫూర్తిగా నిలిచింది. యువత తమ విలువైన ప్రాణాలనే తృణప్రాయం అనుకుంటుంటే.. ఇక నా పదవేం గొప్ప, దానికేం విలువ లేదనుకున్నా. పదవులు పట్టుకు వేలాడడం ఆత్మవంచనే అనిపించింది. అందుకే మంత్రి పదవిని వదులుకున్నా. ఇపుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కల సాకరమవుతుంటే .. అమరుల ప్రాణత్యాగానికి గౌరవం లభించిందనిపిస్తోంది. నా పదవీ త్యాగం.. వృథా కాలేదు అని అనిపిస్తోంది..’ అని మాజీ మంత్రి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. దశాబ్దాల పోరాటం ఫలించింది చెరుకు సుధాకర్, టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు దశాబ్దాల పోరాటం ఫలించింది. 1200మంది అమరవీరుల త్యాగాలతో తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించింది. త్వరలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది. లాఠీ తూటాలను, అక్రమ అరెస్టులను, సీమాంధ్ర ద్రోహుల కుట్రలను ఎండగట్టి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్నాం. ఇకపై తెలంగాణను పునర్నిర్మించుకుందాం.