సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్‌ఎస్ పార్టీలో గౌరవం లేదని, పార్టీ తనను వద్దనుకుంటుందని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. ప్రజల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లే అవకాశం దొరకలేదని, అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చేసినట్లు పేర్కొన్నారు. మునుగోడు తనకు సమస్యే కాదని స్పష్టం చేశారు. హంపిలాంటి కుట్రదారుడిని తాను కాదని తెలిపారు. కేసీఆర్‌పై అభిమానంతో ఇప్పటి వరకు పార్టీలో ఉన్నానని.. అభిమానానికి, బానిసత్వానికి తేడా ఉంటుందని అన్నారు. కేటీఆర్ , హరీష్ రావు చేతుల్లో ఏమీ లేదని, వాళ్ల మనసులో కూడా అనేక బాధలు ఉన్నాయన్నారు. భవిష్యత్తు కార్యాచరణ త్వరలో ప్రకటిస్తానని వెల్లడించారు.
టీఆర్‌ఎస్‌కు మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ రాజీనామా చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు రాజీనామా లేఖను సమర్పించారు. అనంతరం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. ఎంతో బాధతో టీఆర్ఎస్పార్టీకి రాజీనామా చేశానని... ఏ రోజు కూడా పదవి అడగలేదని తెలిపారు. ఎంపీగా ఉన్న సమయంలో అనేక పనులు చేశానని, పార్టీ పదవులు ఎలాంటివి తనకు అక్కర్లేదని, ప్రజల సమస్యలను గౌరవ ముఖ్యమంత్రి పట్టించుకోలేదని విమర్శించారు. బూర నర్సయ్య గౌడ్ అవమానాన్ని భరిస్తాడు కానీ... ప్రజల సమస్యలను ఎత్తడంలో ఎప్పుడు కూడా వెనక్కి పోలేదని స్పష్టం చేశారు.
చదవండి: అదే జరిగితే మరణ శాసనం రాసుకున్నట్లే: మంత్రి కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment