‘రేవంత్‌ ఇంట్లో ఐటీ దాడి.. కాంగ్రెస్‌ ఖుష్‌’ | TRS Will Win 12 MlA Seats In Nalgonda Says Palla Rajeshwar rao | Sakshi
Sakshi News home page

రేవంత్‌ రెడ్డి ఆర్థిక నేరగాడు: టీఆర్‌ఎస్‌ ఎంపీ

Published Fri, Sep 28 2018 7:08 PM | Last Updated on Fri, Sep 28 2018 7:46 PM

TRS Will Win 12 MlA Seats In Nalgonda Says Palla Rajeshwar rao - Sakshi

సాక్షి, నల్గొండ : ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ సీట్లలో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాదిస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అక్టోబర్‌ 4న జిల్లాలో జరిగే టీఆర్‌ఎస్‌ బహిరంగ సభ ప్రాంతాన్ని ఎంపీ బుర నర్సయ్య గౌడ్‌, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యతో కలిసి శుక్రవారం  పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సభకు నాలుగు లక్షల మందికి తగ్గకుండా ప్రజల వస్తారని.. కేసీఆర్‌ను చూడాలని ప్రజలంతా ఎందో ఆత్రుతతో ఎదురుచుస్తున్నారని ఆయన తెలిపారు. ఈ సభ ద్వారా  జిల్లా ప్రజలు తమ అభిష్టాన్ని తెలియజేస్తారని పేర్కొన్నారు.

రేవంత్‌ రెడ్డి ఆర్థిక నేరస్తుడు..
రేవంత్‌ రెడ్డి ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని టీఆర్‌ఎస్‌ ఎంపీ బుర్రా నర్సయ్య గౌడ్‌ అన్నారు. చట్టం తన పని తాను చేసుకుని పోతుందని,దీనిలో తమ ప్రమేయం ఏమీ లేదని పేర్కొన్నారు. రేవంత్‌ జైలుకు పోతా.. జైల్‌ నుంచే పోటీ చేస్తానని ప్రకటనలు చేస్తున్నారని అంటే శిక్ష పడుతుందని రేవంత్‌కు తెలుసని వ్యాఖ్యానించారు. రేవంత్‌పై దాడులతో కాంగ్రెస్‌ నాయకులే కొంతమంది లోలోపల సంతోషంగా ఉన్నారని... ఆ పార్టీలో ఓ సీఎం అభ్యర్థి పీడ పోయిందని తెలిపారు.

రేవంత్‌ నేర చరిత్ర కలిగిన వ్యక్తి...
రేవంత్‌ రెడ్డి లాంటి నేర చరిత్ర కలిగిన వ్యక్తులు దేశానికి చాలా ప్రమాదకరమని ఆ పార్టీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌ విమర్శించారు. తమ పార్టీకి చెందిన ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి మీద కూడా గతంలో ఈడీ దాడులు జరిగాయని గుర్తుచేశారు. ఈడీ సంస్థ కేంద్ర పరిదిలోనిదని... టీఆర్‌ఎస్‌ పార్టీకి దాడులతో ఎలాంటి సంబందం లేదని ఆయన తెల్చి చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement