Badugula Lingaiah Yadav
-
బీజేపీకి మతం ఎజెండా తప్ప మరేదీ లేదు
సాక్షి, హైదరాబాద్: బీజేపీకి మతం ఎజెండా తప్ప మరో అంశం లేదని, అన్ని మతాలను గౌరవించే సంప్రదాయం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉన్నందునే ఆ పార్టీకి దడ పుడుతోందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం టీఆర్ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ జాతీయ ఎజెండాతో కేంద్రంలో తమ అధికార పీఠం కదులుతుందని బీజేపీ నేతలు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. వివిధ రాష్ట్రాల్లో కుటుంబ పార్టీల మద్దతును బీజేపీ తీసుకుంటుండగా, మోదీ మాత్రం ఇతరులవి కుటుంబ పార్టీలంటూ విమర్శలు చేస్తున్నారన్నారు. మోదీ విభజన చట్టం హామీల అమలును పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వాటా అడుగుతారనే బీసీ జనగణనపై వెనుకడుగు
పంజగుట్ట: బీసీలు వారికి రావల్సిన న్యాయపరమైన వాటా అడుగుతారనే భయంతోనే కేంద్రం బీసీ జనగణన చేపట్టడంలేదని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోదీని కలిసి జనగణన చేపట్టాలని టీఆర్ఎస్ కోరినా స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ‘బీసీ జనగణన–కేంద్ర ప్రభుత్వ విధానం, బీసీల తక్షణ కర్తవ్యం’అంశంపై అఖిలపక్ష పార్టీలు, బీసీ ఉద్యోగ సంఘాలు, బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... 75 సంవత్సరాల స్వాతంత్య్ర చరిత్రలో గొల్ల, కురుమ వర్గానికి చెందిన తనను, ముదిరాజ్ వర్గానికి చెందిన బండ ప్రకాష్‌ను రాజ్యసభకు పంపింది తెలంగాణ ప్రభుత్వమే అన్నారు. బీసీ జనగణనతో పాటు కులగణన చేపట్టాలనే డిమాండ్‌తో ఈ నెల 13న ఢిల్లీలో తలపెట్టిన బీసీల జంగ్ సైరన్, 14న పార్లమెంట్ ముట్టడి, 15న జాతీయ స్థాయి అఖిలపక్ష సమావేశానికి తన పూర్తి మద్దతు తెలిపారు. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ... కుక్కలు, పిల్లులు అన్నింటికీ లెక్కలు ఉన్నాయి కాని బీసీలకు మాత్రమే లెక్కలు లేకపోవడం బాధాకరమన్నారు. బీసీల లెక్కలు తేల్చకపోతే రాజకీయంగా దెబ్బతింటామని భావించేలా ఉద్యమం చేయాలని, అప్పుడే అన్ని పార్టీలు దిగివస్తాయన్నారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... ఎస్సీ, ఎస్టీలతోపాట ఆఖరుకు 9 శాతం ఉన్న ఓసీలు కూడా 10 శాతం రిజర్వేషన్లు పొందుతున్నారని, 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు మాత్రమే ఇవ్వడం ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్, బీఎస్పీ నేత రమేష్, బీసీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దానకర్ణచారి, బీసీ యువజన సంఘం అధ్యక్షుడు కనకాల శ్యామ్, బీసీ విద్యార్థి నేత విక్రమ్‌గౌడ్, కుల్కచర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
జానారెడ్డి ఓటమి ఖాయం
సాక్షి, త్రిపురారం : నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కుందూరు జానారెడ్డిని ఓటమి ఖాయమని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. సోమవారం హాలియాలోని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల నర్సింహయ్య నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ దొంగలు మళ్లీ చంద్రబాబును తీసుకొని తెలంగాణ రాష్ట్రంపై దండయాత్రకు వచ్చారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు వందకుపైగా కేసులు వేశారని విమర్శించారు. గోదావరి, కృష్ణా జలాలను మనకు రాకుండా అడ్డుకున్న ఆంధ్ర పాలకుతో దోస్తీకట్టి మరోమారు మనకు అన్యాయం చేయాలని చూస్తున్నారన్నారు. జిల్లాలో మొట్ట మొదటగా ఓడిపోయేది జానారెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర్రెడ్డేనన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పలు అభివృద్ధి సంక్షేమ పథకాల వల్ల జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి విపరీతమైన స్పందన ఉందన్నారు. గడిచిన నాలుగున్నరేళ్ల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు పొందిన ప్రజలు మళ్లి టీఆర్ఎస్ పార్టీని గెలి పించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల నర్సింహయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గడ్డంపల్లి రవీందర్‌రెడ్డి, మలిగిరెడ్డి లింగారెడ్డి, మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ఉన్నారు. విజయమే లక్ష్యంగా ముందుకెళ్లాలి గుర్రంపోడు : బూత్ కమిటీలు ప్రతి ఓటరును కలిసి టీఆర్ఎస్ సంక్షేమ పథకాలను వివరించి విజయమే లక్ష్యంగా ముందుకుసాగాలని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. మండలకేంద్రంలో జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పథకాలను గడపగడపకు ప్రచారం చేసేలా ప్రతి కార్యకర్త లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని అన్నారు. నాలుగు దశాబ్దాలుగా పదవులు అçనుభవించిన జానారెడ్డి ఈ ప్రాంత అభివృద్ధికి చేసిందేమీ లేదని అన్నారు. సమావేశంలో మాజీ ఆప్కాబ్ చైర్మెన్ యడవల్లి విజయేందర్‌రెడ్డి, ఆర్ఎస్ఎస్ జిల్లా కన్వీనర్ ఇస్లావత్ రాంచందర్ నాయక్, జెడ్పీటీసీ గాలి రవికుమార్, కంచర్ల విజేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
‘రేవంత్ ఇంట్లో ఐటీ దాడి.. కాంగ్రెస్ ఖుష్’
సాక్షి, నల్గొండ : ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ సీట్లలో టీఆర్ఎస్ పార్టీ విజయం సాదిస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అక్టోబర్ 4న జిల్లాలో జరిగే టీఆర్ఎస్ బహిరంగ సభ ప్రాంతాన్ని ఎంపీ బుర నర్సయ్య గౌడ్, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సభకు నాలుగు లక్షల మందికి తగ్గకుండా ప్రజల వస్తారని.. కేసీఆర్‌ను చూడాలని ప్రజలంతా ఎందో ఆత్రుతతో ఎదురుచుస్తున్నారని ఆయన తెలిపారు. ఈ సభ ద్వారా జిల్లా ప్రజలు తమ అభిష్టాన్ని తెలియజేస్తారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఆర్థిక నేరస్తుడు.. రేవంత్ రెడ్డి ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని టీఆర్ఎస్ ఎంపీ బుర్రా నర్సయ్య గౌడ్ అన్నారు. చట్టం తన పని తాను చేసుకుని పోతుందని,దీనిలో తమ ప్రమేయం ఏమీ లేదని పేర్కొన్నారు. రేవంత్ జైలుకు పోతా.. జైల్ నుంచే పోటీ చేస్తానని ప్రకటనలు చేస్తున్నారని అంటే శిక్ష పడుతుందని రేవంత్‌కు తెలుసని వ్యాఖ్యానించారు. రేవంత్‌పై దాడులతో కాంగ్రెస్ నాయకులే కొంతమంది లోలోపల సంతోషంగా ఉన్నారని... ఆ పార్టీలో ఓ సీఎం అభ్యర్థి పీడ పోయిందని తెలిపారు. రేవంత్ నేర చరిత్ర కలిగిన వ్యక్తి... రేవంత్ రెడ్డి లాంటి నేర చరిత్ర కలిగిన వ్యక్తులు దేశానికి చాలా ప్రమాదకరమని ఆ పార్టీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ విమర్శించారు. తమ పార్టీకి చెందిన ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద కూడా గతంలో ఈడీ దాడులు జరిగాయని గుర్తుచేశారు. ఈడీ సంస్థ కేంద్ర పరిదిలోనిదని... టీఆర్ఎస్ పార్టీకి దాడులతో ఎలాంటి సంబందం లేదని ఆయన తెల్చి చెప్పారు. -
టీఆర్ఎస్ 3, కాంగ్రెస్ ఒకటి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. మూడు స్థానాలకు నలుగురు అభ్యర్థులు పోటీ పడుతుండటంతో ఎన్నిక అనివార్యమైంది. టీఆర్ఎస్ నుంచి జోగినపల్లి సంతోష్‌కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, బండ ప్రకాశ్ సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బలరాం నాయక్ బరిలోకి దిగారు. ఎన్నిక అనివార్యం కావడంతో ఈ నెల 23న పోలింగ్ జరగనుంది. అదే రోజు కౌంటింగ్ ఉంటుంది. తెలంగాణ శాసనసభలో ప్రస్తుతమున్న ఎమ్మెల్యేల బలాల ప్రకారం మూడు స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకునే అవకాశముంది. అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ తమ పార్టీ తరపున అభ్యర్థిని పోటీకి నిలిపింది. ఓపెన్ బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరుగుతుంది కాబట్టి విప్ జారీ చేసి ఫిరాయింపు ఎమ్మెల్యేలను చిక్కుల్లో పడేయాలన్న వ్యూహంతో కాంగ్రెస్ పావులు కదుపుతోంది. మరోవైపు టీడీపీ ఎవరికి మద్దతు ఇస్తుందనేది ఇంకా ప్రకటించలేదు. ఏడుగురు ఎమ్మెల్యేల బలమున్న మజ్లిస్.. టీఆర్ఎస్కు మద్దతు ఇస్తామని తెలిపింది.