
సాక్షి, హైదరాబాద్: బీజేపీకి మతం ఎజెండా తప్ప మరో అంశం లేదని, అన్ని మతాలను గౌరవించే సంప్రదాయం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉన్నందునే ఆ పార్టీకి దడ పుడుతోందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం టీఆర్‌ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ జాతీయ ఎజెండాతో కేంద్రంలో తమ అధికార పీఠం కదులుతుందని బీజేపీ నేతలు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.
వివిధ రాష్ట్రాల్లో కుటుంబ పార్టీల మద్దతును బీజేపీ తీసుకుంటుండగా, మోదీ మాత్రం ఇతరులవి కుటుంబ పార్టీలంటూ విమర్శలు చేస్తున్నారన్నారు. మోదీ విభజన చట్టం హామీల అమలును పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment