'కేసీఆర్ సూచనలకు ప్రధాని అధిక ప్రాధాన్యత'
హైదరాబాద్: నామినేటెడ్ పోస్టుల భర్తీలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేసినట్లు భువనగరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ వెల్లడించారు. ఈ మేరకు కేసీఆర్కు లేఖ రాసినట్లు గౌడ్ శనివారం హైదరాబాద్లో తెలిపారు. ఉమ్మడి ప్రవేశ పరీక్షల వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం ఉండదని అన్నారు.
ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలు జాతీయ స్థాయిలో జరిగే కామన్ మెడికల్ ఎగ్జామ్లో చేరాలని సూచించారు. కేంద్రంతో తమ ప్రభుత్వానికి ఎలాంటి ఘర్షణ లేదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ చేసిన సూచనలకు ప్రధాని మోదీ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని బూర నర్సయ్య గౌడ్ గుర్తు చేశారు.