క్షతగాత్రుడిని ఆదుకున్న మండలి చైర్మన్‌ | Legislative Council chairman Swami Goud helped accident victim | Sakshi
Sakshi News home page

క్షతగాత్రుడిని ఆదుకున్న మండలి చైర్మన్‌

May 23 2017 2:56 AM | Updated on Sep 5 2017 11:44 AM

క్షతగాత్రుడిని ఆదుకున్న మండలి చైర్మన్‌

క్షతగాత్రుడిని ఆదుకున్న మండలి చైర్మన్‌

రోడ్డు దాటుతున్న ఓ దినసరి కూలీని వేగంగా దూసుకువచ్చిన ఓ కారు ఢీకొట్టి ముందుకు వెళ్లింది.

- రోడ్డుపై పడిపోయిన బాధితుడు
- ఆస్పత్రికి తరలించిన స్వామిగౌడ్‌


రాజేంద్రనగర్‌: రోడ్డు దాటుతున్న ఓ దినసరి కూలీని వేగంగా దూసుకువచ్చిన ఓ కారు ఢీకొట్టి ముందుకు వెళ్లింది. అదే దారిలో వెళ్తున్న శాసన మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ వెంటనే స్పందించి తన కాన్వాయ్‌ని ఆపారు. గాయపడ్డ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన మహదేవ్‌ (55) బతుకుదెరువు కోసం బండ్లగూడ ప్రాంతానికి వలస వచ్చాడు. దినసరి కూలీ గా పని చేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో హైదర్షాకోట్‌ బృందావన్‌ బార్‌ సమీపంలో రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టింది. స్థానికంగా వాహనదారులు అటూ ఇటూ వెళ్తున్నారు తప్ప గాయపడ్డ మహదేవ్‌ను ఆస్పత్రికి తరలించలేదు. 

అదే సమయంలో ఈ రోడ్డులో వెళ్తు న్న శాసన మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ ఘట న చూసి తన కాన్వాయ్‌ని ఆపారు. ఢీకొట్టి వెళ్తున్న వాహనాన్ని ఆపాలంటూ ఆయన సెక్యూరిటీకి తెలపడంతో వారు ఎస్కార్ట్‌ వాహనంలో వెళ్లి కారును వెంబడించి ఆపా రు. గాయపడ్డ మహదేవ్‌ను స్వయంగా స్వామిగౌడ్‌ ఆటోలో బండ్లగూడలోని షాదన్‌ ఆస్పత్రికి తరలించారు. మహదేవ్‌ కోలుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement