
విజయవాడలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడల ప్రాంగణం వద్ద శాసన మండలి చైర్మన్ ఫొటో లేకుండా ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లు
ప్రొటోకాల్‌ను విస్మరించిన కూటమి ప్రభుత్వం
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడల ప్రాంగణంలో చైర్మన్ మోషేన్‌రాజు ఫొటో, పేరు పెట్టకుండా వివక్ష
సాక్షి, అమరావతి: శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజుకు తీవ్ర అవమానం జరిగింది. శాసన సభ, శాసన మండలి సభ్యులకు నిర్వ హిస్తున్న క్రీడల పోటీల సాక్షిగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మోషేన్ రాజుపై కూటమి ప్రభుత్వం వివక్ష చూపించింది. శాసన మండలి చైర్మన్‌గా ఆయనకు ప్రొటోకాల్‌లో అగ్ర ప్రాధా న్యం కల్పించాల్సి ఉండగా, ఆ విషయాన్ని ప్రభు త్వం విస్మరించింది.
క్రీడా పోటీల ప్రాంగణంలో ఎక్కడా మండలి చైర్మన్ ఫొటో, పేరు కూడా లేకుండా అగౌరవ పరిచింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నిర్వహిస్తున్న ఈ పోటీల్లో మండలి చైర్మన్ పేరు కూడా లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఘటనతో ఎస్సీ నేతలపై అధికార టీడీపీ కూటమి నిరంకుశ, అప్రజాస్వామిక వైఖరి మరోసారి బయటపడిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్ర అత్యున్నత సభను నడిపించే వ్యక్తికి ఇచ్చే గౌరవం ఇదేనా అని నిలదీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment