పేరు ఖరారు చేసిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: శాసనమండలికి డిప్యూటీ చైర్మన్‌గా స్వామిగౌడ్ పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. మంత్రివర్గంలోకి స్వామిగౌడ్‌కు మలిదశ మంత్రివర్గ విస్తరణలో అవకాశం వస్తుందనుకుంటున్న తరుణంలో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. టీఆర్‌ఎస్‌కు మండలిలో స్వామిగౌడ్‌తో పాటు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, పి.సుధాకర్ రెడ్డి, పి.నరేందర్ రెడ్డి టీఆర్‌ఎస్ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. పూల రవీందర్, జనార్దన్‌రెడ్డి తదితరులు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్సీ కె.దిలీప్‌కుమార్ కూడా సాంకేతికంగా టీఆర్‌ఎస్ సభ్యుడే. గవర్నర్ కోటాలోని రెండు ఎమ్మెల్సీలు త్వరలోనే టీఆర్‌ఎస్ కోటాలో చేరనున్నాయి. ఏప్రిల్ నాటికి స్థానిక సంస్థలు, పట్టభద్రుల నియోజకవర్గాలు 12 ఖాళీ అవుతున్నాయి.
వీటిని ఉపయోగించుకుని శాసన మండలిపైనా పట్టు బిగించాలని టీఆర్‌ఎస్ భావిస్తోంది. మండలిలో టీఆర్‌ఎస్ పక్ష నాయకుడిగా ఉన్న స్వామిగౌడ్‌ను డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నిక చేయించాలని కేసీఆర్ నిర్ణయించారు. ప్రస్తుతం చైర్మన్‌గా ఉన్న నేతి విద్యాసాగర్ ఎమ్మెల్సీ పదవీ కాలం 2015 మార్చికి పూర్తి కానుంది. దీని ప్రకారం వచ్చే సంవత్సరం మండలి చైర్మన్‌గా స్వామిగౌడ్‌కు అవకాశం కల్పించాలనే ముందుచూపుతో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. కాగా, చీఫ్‌విప్‌గా ఎవరిని నియమించాలనే దానిపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. ఏనుగు రవీందర్ రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, జలగం వెంకట్రావులో ఒకరిని చీఫ్‌విప్‌గా నియమించే అవకాశాలున్నాయని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
మండలి డిప్యూటీ చైర్మన్‌గా స్వామిగౌడ్!
Published Wed, Jun 11 2014 2:13 AM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM
Advertisement
Advertisement