సాక్షి, రంగారెడ్డి జిల్లా : గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో బుధవారం జిల్లా యంత్రాంగం పంద్రాగస్టు వేడుకలను నిర్వహించనుంది. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన జాతీయ జెండా ఎగురవేయనున్నారు. అనంతరం వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు అవార్డులు అందజేస్తారు.
మంత్రి మహేందర్‌రెడ్డి శుభాకాంక్షలు..
జిల్లా ప్రజలకు మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి సాంతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ముందడుగు వేయాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలను పేదల దరికి చేర్చాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment