ముంబయి: దేశంలో ప్రస్తుతం ఉల్లి ధరలు కాకరేపుతున్నాయి. క్వింటాల్ ధర రూ.2415కు పైగా అమ్ముడుపోతోంది. ఉల్లి ధరను కంట్రోల్ చేయడానికి కేంద్రం చర్యలు చేపట్టింది. ఎగుమతులపై 40 శాతం సుంకం విధించింది. అయినప్పటికీ ఉల్లికి ఉన్న డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ మంత్రి దాదా భూసే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొనలేనివారు కొన్నాళ్లు ఉల్లికి దూరంగా ఉంటే ఏ సమస్య ఉండదని అన్నారు.
'రూ.10 లక్షల కారు కొనగలిగినవారికి రిటైల్ ధర రూ.10 నుంచి 20 పెరిగితే సమస్య ఏమీ ఉండదు. కొనలేనివారు ఓ నాలుగు నెలలు ఉల్లికి దూరంగా ఉంటే సరిపోతుందని అన్నారు. ఒక్కసారి ఉల్లి ధర క్వింటాల్‌కు రూ.200 మాత్రమే ఉంటుంది. మరికొన్నిసార్లు రూ.2000 వరకు పెరుగుతుంది. ఎగుమతి సుంకాన్ని పెంచి ధరలను అదుపులో ఉంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.' అని చెప్పారు.
కేంద్రం ఉల్లి ధరలపై ఎగుమతి పన్నును 40 శాతానికి పెంచడంతో రైతులు ఆందోళన చేపట్టారు. మహారాష్ట్రలో అతి పెద్దదైన హోల్‌సెల్ మార్కెట్‌తో సహా ఉల్లి వేలాన్ని నిలిపివేశారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమిస్తామని నాసిక్ జిల్లా ఆనియన్ ట్రేడర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది.
ఇదీ చదవండి: గడ్డం తీయాలని వరుడు తండ్రి.. తీయొద్దని వధువు!
Comments
Please login to add a commentAdd a comment