onion price rise
-
ఉల్లి సేకరణ నిలిపేయాలంటూ డిమాండ్
నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ (నాఫెడ్) ఉల్లి సేకరణను నిలిపివేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్లో ఉల్లి కృత్రిమ కొరతను అరికట్టేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించి ఉల్లిని సేకరిస్తోంది. అయితే రైతులు దీన్ని నిలిపేయాలని కోరుతున్నారు. వీరి డిమాండ్ మరింత పెరిగితే ఉల్లి ధరల స్థిరీకరణ కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ఆటంకం కలిగే ప్రమాదముందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.దేశవ్యాప్తంగా ఉల్లిధరలు పెరుగుతున్న నేపథ్యంలో నాఫెడ్ బృందం ఇటీవల కొనుగోలు కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు చేపడుతోంది. ఆయా కేంద్రాల నిర్వహణ లోపాలపై చర్యలు చేపడుతోంది. దాంతోపాటు పెరుగుతున్న ఉల్లి ధరలకు కళ్లెం వేసేలా భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా వ్యూహాత్మక నిల్వలను పెంచుకుంటోంది. ప్రభుత్వం ఉల్లి సేకరణ పెంచితే ధరలు కట్టడి అవుతాయి. కానీ, అలా చేస్తే రైతుల పంటకు సరైన ధర లభించదనే ఉద్దేశంతో ఉల్లి సేకరణను నిలిపివేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. కొన్నిచోట్ల వ్యాపారస్థులు సిండికేట్‌గామారి ఇదే అదనుగా కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు.మహారాష్ట్ర ఉల్లి ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు భరత్ డిఘోలే ఇటీవల ఒక వీడియోలో మాట్లాడుతూ..‘రైతులు ప్రభుత్వ సంస్థలైన నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్‌లకు కిలో రూ.40 కంటే తక్కువ ధరకు ఉల్లిని విక్రయించకూడదు. భవిష్యత్తులో ఉల్లి ధరలను తగ్గించేందుకు బఫర్ స్టాక్‌ను ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది’ అని తెలిపారు.ఇదీ చదవండి: ‘ప్రమాదంలో దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమ’దేశీయంగా ప్రతి నెలా దాదాపు 13 లక్షల టన్నుల ఉల్లి వినియోగమవుతుంది. దేశంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఉల్లి ఎక్కువగా సాగవుతోంది. 65 శాతం పంట ఒక్క రబీలోనే వస్తుంది. అది ఏప్రిల్-మే మధ్య మార్కెట్లోకి వచ్చి అక్టోబరు-నవంబరు వరకు ఉంటుంది. అయితే నిల్వ ప్రక్రియలోనే ఉల్లిపాయలు ఉత్పత్తి బరువులో 30-40 శాతం కోల్పోతాయి. కుళ్లిపోవడంవల్ల కొన్ని వృథా అవుతాయి. అలా పరిమాణంతో పాటు నాణ్యతపరంగానూ నష్టం వాటిల్లుతుంది. దేశంలో ఉల్లిపాయలను నిల్వ చేసేందుకు నాణ్యమైన ఏర్పాట్లు లేకపోవడంవల్ల ఏటా రూ.11 వేల కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని అంచనా. -
ఉల్లి ధర పెరుగుదల.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
ముంబయి: దేశంలో ప్రస్తుతం ఉల్లి ధరలు కాకరేపుతున్నాయి. క్వింటాల్ ధర రూ.2415కు పైగా అమ్ముడుపోతోంది. ఉల్లి ధరను కంట్రోల్ చేయడానికి కేంద్రం చర్యలు చేపట్టింది. ఎగుమతులపై 40 శాతం సుంకం విధించింది. అయినప్పటికీ ఉల్లికి ఉన్న డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ మంత్రి దాదా భూసే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొనలేనివారు కొన్నాళ్లు ఉల్లికి దూరంగా ఉంటే ఏ సమస్య ఉండదని అన్నారు. 'రూ.10 లక్షల కారు కొనగలిగినవారికి రిటైల్ ధర రూ.10 నుంచి 20 పెరిగితే సమస్య ఏమీ ఉండదు. కొనలేనివారు ఓ నాలుగు నెలలు ఉల్లికి దూరంగా ఉంటే సరిపోతుందని అన్నారు. ఒక్కసారి ఉల్లి ధర క్వింటాల్‌కు రూ.200 మాత్రమే ఉంటుంది. మరికొన్నిసార్లు రూ.2000 వరకు పెరుగుతుంది. ఎగుమతి సుంకాన్ని పెంచి ధరలను అదుపులో ఉంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.' అని చెప్పారు. కేంద్రం ఉల్లి ధరలపై ఎగుమతి పన్నును 40 శాతానికి పెంచడంతో రైతులు ఆందోళన చేపట్టారు. మహారాష్ట్రలో అతి పెద్దదైన హోల్‌సెల్ మార్కెట్‌తో సహా ఉల్లి వేలాన్ని నిలిపివేశారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమిస్తామని నాసిక్ జిల్లా ఆనియన్ ట్రేడర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ఇదీ చదవండి: గడ్డం తీయాలని వరుడు తండ్రి.. తీయొద్దని వధువు! -
ఘాటు తగ్గని ఉల్లి
తాడేపల్లిగూడెం : ఉల్లిపాయల ఘాటు ఇప్పట్లో తగ్గనంటోంది. నాసిరకం ఉల్లిపాయలు కూడా కిలో రూ.25 పలుకుతున్నాయి. దీంతో జనం గగ్గోలు పెడుతున్నారు. ఆదివారం తాడేపల్లిగూడెం గుత్తమార్కెట్కు కర్నూలు నుంచి కురచ రకాలతో పాటు పాడైన ఉల్లిపాయలే ఎక్కుగా వచ్చాయి. నాణ్యత కలిగిన ఉల్లిపాయలు క్వింటాల్ 3,100 పలికితే బాగా పాడైన ఉల్లి క్వింటాల్ రూ.400 పలికాయి. కానీ అవి నిల్వకు ఆగవు. రిటైల్‌గా మార్కెట్లో కిలో రూ.25 నుంచి రూ.40 వరకు విక్రయించారు. 15 రోజుల్లో కర్నూలు ఉల్లి ఖాళీ కర్నూలులో ఉల్లిపాయలు 15 రోజుల్లో ఖాళీ కాబోతున్నాయి. వాతావరణం ఈసారి కర్నూలు ఉల్లిపాయల సీజన్‌పై భారీగా ప్రభావం చూపించింది. దీంతో ఏనాడూ లేనంతగా రెండు నెలల 15 రోజుల ముందుగానే సీజన్ ముగిసే వాతావరణం కనపడుతోంది. వాస్తవానికి ఈ ఉల్లిపాయలు సంక్రాంతి వరకు మార్కెట్‌కు రావాలి. అలాంటిది రైతు కోలుకోలేనంతగా ఉల్లిపాయలు రైతులను దెబ్బతీశాయి. కర్నూలు ఉల్లిపాయలకు వాతావరణం శాపం. ఎండ ఎక్కువగా కాయకుండా, వానలు కురవకుండా ఉంటేనే ఉల్లిపాయలు తాజాగా, నాజూకుగా బయటకు వస్తాయి. ఉల్లిపాయలకు మంచి ధర లభించే సమయంలో ప్రకృతి రైతులపై పగబూనినట్టు ఎండలు, వానలు కలగలుపుగా ఉల్లి రైతులపై విరుచుకుపడ్డాయి. దీంతో రాష్ట్రంలో ఉల్లి అవసరాల కోసం మహారాష్ట్ర లేదా కర్ణాటక మీదో ఆధార మీదో ఆధారపడాల్సి వచ్చే పరిస్థితి నెలకొంది. కాస్త తగ్గిన కూరగాయల ధరలు కూరగాయల ధరలు వారం రోజుల కిత్రంతో పోలిస్తే కాస్త కనికరించాయి. తాడేపల్లిగూడెం గుత్త మార్కెట్లో తెల్లవంకాయలు, నల్ల వంకాయలు కిలో రూ.50 చేసి అమ్మారు. బీరకాయలు రూ.40కి లభించాయి. బెండకాయలు రూ.50, దోసకాయలు రూ.12, దొండకాయలు రూ.30, చిక్కుళ్లు రూ.70, ఆకాకర రూ.60, చేదు కాకర కాయలు రూ.30కి విక్రయించారు. బీన్స్, క్యాప్సికం కిలో రూ.70కి అమ్మారు. కీరా రూ.40, కంద రూ.30, క్యారెట్ రూ.70, బీటురూట్ రూ.60కి దొరికాయి. చామ రూ.40, కొత్తగా మార్కెట్‌కు వచ్చిన ఉసిరి కాయలు కిలో రూ.60కి అమ్మారు. ములగకాడలు ఒకటి పది రూపాయలు, మామిడి కాయలు జత రూ.25కి అమ్మారు. కొత్తిమీర ధరల సెగ ఇంకా తగ్గలేదు. కిలో రూ.150 రూపాయలకు గుత్తగా అమ్మగా విడిగా కట్ట ఒకటి రూ.50కి అమ్మారు. -
ఘాటెక్కిన ఉల్లి
ఆలేరు: ఉల్లి కోస్తేనే కన్నీళ్లు వస్తాయి. కానీ నేడు కోయకుండానే ఉల్లి కన్నీళ్లు పెట్టిస్తుంది. ప్రతినిత్యం వంటకాల్లో వాడే ఉల్లి ధర రోజురోజుకు పెరుగుతుంది. దీంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. కేజీ ఉల్లి ధర రూ.45కు చేరడంతో సామాన్య ప్రజలు ఉల్లిని కొనలేని పరిస్థితి నెలకొంది. దీంతో వంటింట్లో ఉల్లిగడ్డను వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిత్యవసర వస్తువుల ధరలు నింగినంటిన తరుణంలో ఉల్లి కన్నీళ్లు తెప్పిస్తుంది. ప్రస్తుతం డిమాండ్‌కు అనుగుణంగా మార్కెట్లో ఉల్లి లేకపోవడతో ధర రోజురోజుకు పెరుగుతుంది. రాష్ట్రంలో ఉల్లి దిగుబడి గణనీయంగా తగ్గడంతో పాటు అధికంగా దిగుమతయ్యే కర్ణాటక, మహరాష్ట్రలో సాగు విస్తీర్ణం తగ్గడంతో «కొరత ఏర్పడింది. ధర పెరగడంతో హోటళ్ల నిర్వాహకులు ఉల్లి వాడకాన్ని తగ్గించారు. మున్ముందు ఇదే పరిస్థితి కొనసాగితే ధర మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉల్లి వాడకాన్ని తగ్గించాం ఉల్లి ధర అమాంతం పెరగడంతో ఉల్లి కొనాలంటే భయమేస్తుంది. దీంతో ఉల్లి వాడకాన్ని తగ్గించాం. ప్రభుత్వం చౌక ధర దుకాణాల్లో వీటిని విక్రయించే ఏర్పాటు చేయాలి. ఉల్లిపాయల ధరలను అదుపుచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. వసంత, ఆలేరు ధర తగ్గించాలి నిత్యవసర వస్తువుల పెరుగుదలతో సతమతమవుతున్నాం. ఇటీవల ఉల్లిగడ్డ ధర మునుపెన్నడు లేనంతగా పెరిగింది. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని ఉల్లి ధర తగ్గించాలి. ఉల్లి సాగు చేసేలా రైతులను ప్రోత్సాహించాలి. జయమ్మ, ఆలేరు -
ఉల్లి.. ధర పేలి
తాడేపల్లిగూడెం : వంటింట్లో మరోసారి ఉల్లి బాంబు పేలుతోంది. డిమాండ్‌కు తగినట్టుగా సరఫరా లేకపోవడంతో శుక్రవారం ఒక్కసారిగా ధరలు పెరిగాయి. తాడేపల్లిగూడెం హోల్‌సేల్ మార్కెట్లో ఆదివారం క్వింటాల్ రూ.2,300 పలికిన ఉల్లి ధర శుక్రవారం అమాంతం రూ.3,300కు ఎగబాకింది. గుత్త మార్కెట్లోనే కిలోకు రూ.10 పెరగటంతో వ్యాపారులు ఠారెత్తిపోయారు. ఒకేసారి కిలోకు రూ.10 పెరగటం గడచిన పదేళ్లలో ఎప్పుడూ లేదు. రిటైల్ మార్కెట్లో నాణ్యత గల ఉల్లిపాయల ధర కిలో రూ.40 దాటింది. ఒక్కసారిగా ధర పెరగడంతో చిల్లర బేరం తగ్గిం ది. శుక్రవారం తాడేపల్లిగూడెం మార్కెట్‌కు మహారాష్ట్ర నుంచి రెండు లారీలు, కర్నూలు నుంచి 15 లారీల ఉల్లిపాయలు మాత్రమే వచ్చాయి. సాధారణంగా ఈ సీజన్లో కర్నూలు నుంచి 200-300 లారీల ఉల్లిపాయలు వచ్చేవి. అనూహ్యంగా దిగుమతులు తగ్గిపోవడంతో ధరలు పెరిగాయి. రానున్న రోజుల్లో ధరలు మరింతగా పెరిగే సూచనలు ఉన్నా యని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దేశంలో ఉల్లి అవసరాలను తీర్చే మహా రాష్ట్ర మార్కెట్ నుంచి సరఫరా తగ్గిపోయింది. వాతావరణం అనుకూలించకపోవడంతో అక్కడి ఉల్లి పంటకు వైరస్ సోకింది. మరోవైపు రైతులు గోదాములలో నిల్వ చేసిన ఉల్లిని మార్కెట్లకు తీసుకురావడం లేదు. నాఫెడ్‌తో ఒప్పం దం చేసుకున్న కొన్ని కంపెనీలు ఉల్లిని విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. ఈ పరిణామాల నడుమ గతంలో ఎన్నడూ లేనివిధంగా జూలై నెలలో ఉల్లి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. నాసిరకం ఉల్లికి డిమాండ్ కర్నూలు నుంచి వచ్చే ఉల్లిపాయలకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. కర్నూలు ఉల్లి సాధారణంగా క్వింటాల్ రూ.1,700 నుంచి రూ.2 వేల వరకు మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం వీటిధర క్వింటాల్ రూ.2,700కు చేరుకుంది.