సోనియా, రాహుల్ లపై పోటీ పెట్టం: అఖిలేష్ యాదవ్ | Samajwadi Party not to field candidates against Sonia Gandhi, Rahul Gandhi | Sakshi
Sakshi News home page

సోనియా, రాహుల్ లపై పోటీ పెట్టం: అఖిలేష్ యాదవ్

Published Tue, Apr 1 2014 2:35 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

సోనియా, రాహుల్ లపై పోటీ పెట్టం: అఖిలేష్ యాదవ్ - Sakshi

సోనియా, రాహుల్ లపై పోటీ పెట్టం: అఖిలేష్ యాదవ్

లక్నో: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ (రాయ్ బరేలి), రాహుల్ గాంధీ (అమేథి) పోటి చేయనున్న నియోజకవర్గాల్లో పోటి పెట్టబోమని సమాజ్ వాదీ పార్టీ మంగళవారం ప్రకటించింది. సోనియా, రాహుల్ లపై పోటి వద్దని సమాజ్ వాదీ పార్టీ నిర్ణయించిందని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తెలిపారు. గతంలో ములాయం సింగ్ యాదవ్ పై, కనూజ్ లో అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ పై కాంగ్రెస్ పోటి పెట్టని విషయం తెలిపిందే. 
 
రాయ్ బరేలిలో సోనియా గాంధీ బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. సోనియాగాంధీపై రాయ్ బరేలి నియోజకవర్గంలో సుప్రీం కోర్టు న్యాయవాది అజయ్ అగర్వాల్ ను బీజేపీ బరిలోకి దించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement