ఎన్నికల ప్రచారంలో డింపుల్‌ యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు | Dimple Yadav Comments On State Bjp, And Central Bjp Regime | Sakshi
Sakshi News home page

ఎన్నికల ప్రచారంలో డింపుల్‌ యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు

Published Tue, Apr 23 2024 6:13 PM | Last Updated on Tue, Apr 23 2024 7:05 PM

Dimple Yadav Comments On State Bjp, And Central Bjp Regime - Sakshi

పాట్నా : అటు కేంద్రం బీజేపీని ఓడిస్తే.. ఇటు రాష్ట్రంలో కూడా ఆ పార్టీని ప్రతిపక్షంలో కూర్చొబెట్టొచ్చంటూ ఉత్తర్‌ప్రదేశ్‌ స‌మాజ్‌వాదీ పార్టీ, మెయిన్‌పురి ఎంపీ అభ్యర్ధి డింపుల్ యాద‌వ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

మెయిన్‌పురిలో డింపుల్ యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడుతూ..‘రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకే ఈ లోక్‌సభ ఎన్నికలు. సమాజంలోని ప్రతి వర్గం నిర్లక్ష్యానికి గురవుతోంది. బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం అబద్ధాలు, దోపిడి ప్రభుత్వమని రాష్ట్రం, దేశం మొత్తం తెలిసిపోయిందని అన్నారు. అందుకే ఈ సారి లోక్‌సభ ఎన్నికల్ని చాలా తెలివిగా ఎదుర్కోవాలని ఓటర్లకు పిలునిచ్చారు.  

రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్న ప్రభుత్వాన్ని ఓడించారు. అందుకు ఈ ఎన్నికలే మనకు ఆయుధం. ఈ (బీజేపీ) ప్రభుత్వాన్ని కేంద్రం నుండి తొలగిస్తే, అప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని తొలగించే పని కూడా జరగవచ్చు అని అన్నారు. కాగా, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ సతీమణీయే డింపుల్‌ యాదవ్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement