డింపుల్ యాదవ్
లక్నో: ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. అఖిలేశ్ భార్య, మాజీ ఎంపీ డింపుల్ యాదవ్ కరోనా బారిన పడ్డారు. వారి కుమార్తెకు కూడా కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని డింపుల్ యాదవ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. కోవిడ్-19 టీకాలు రెండు డోసులు వేయించుకున్నప్పటికీ ఆమె కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్‌లో ఉన్నారు.
‘నాకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. నేను పూర్తిగా కరోనా టీకాలు వేసుకున్నాను. కోవిడ్ సోకినప్పటికీ ఎటువంటి లక్షణాలు కనిపించడం లేదు. నా, ఇతరుల భద్రత కోసం ఐసోలేషన్‌లో ఉన్నాను. ఇటీవల నన్ను కలిసిన వారందరూ త్వరగా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నా’ అని డింపుల్ ట్వీట్ చేశారు. (చదవండి: ఒమిక్రాన్ అప్‌డేట్స్.. రాష్ట్రాలవారీగా కేసుల వివరాలు..)
డింపుల్ యాదవ్, ఆమె కుమార్తె యొక్క నమూనాలను మంగళవారం తీసుకుని పరీక్షించారు. బుధవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణయింది. భార్య, కుమార్తెకు కరోనా సోకడంతో అఖిలేష్ యాదవ్ ఎన్నికల ప్రచారానికి దూరం కానున్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆయన ఇప్పటికే విస్తృతంగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. ( చదవండి: డెల్టా కంటే 3 రెట్లు వేగం.. ఒమిక్రాన్‌తో బహుపరాక్..)
Comments
Please login to add a commentAdd a comment