అఖిలేష్ దంపతులకు తప్పిన హెలికాప్టర్ ప్రమాదం | Akhilesh Yadav, wife have narrow escape as bird hits chopper | Sakshi
Sakshi News home page

అఖిలేష్ దంపతులకు తప్పిన హెలికాప్టర్ ప్రమాదం

Published Mon, Apr 28 2014 10:48 AM | Last Updated on Sat, Sep 2 2017 6:39 AM

అఖిలేష్ దంపతులకు తప్పిన హెలికాప్టర్ ప్రమాదం

అఖిలేష్ దంపతులకు తప్పిన హెలికాప్టర్ ప్రమాదం

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ఆయన భార్య డింపుల్ యాదవ్ హెలికాప్టర్ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. వాళ్లు వెళ్తున్న హెలికాప్టర్ను ఓ పక్షి ఢీకొంది. కనౌజ్ ఎంపీ అయిన తన భార్య డింపుల్ యాదవ్, ప్రజాపనుల శాఖ మంత్రి శివపాల్ సింగ్ యాదవ్ తదితరులతో కలిసి అఖిలేష్ హెలికాప్టర్లో వెళ్తున్నారు. తన సమీప బంధువు రతన్ సింగ్ యాదవ్ అంత్యక్రియలకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

భూమికి 3వేల అడుగుల ఎత్తులో హెలికాప్టర్ ప్రయాణిస్తుండగా, లక్నోకు మరో 12 కిలోమీటర్ల దూరం ఉందనగా ఒక గద్ద వచ్చి హెలికాప్టర్ ముందు అద్దాన్ని ఢీకొంది. అయితే పైలట్లు ఎలాగోలా చాపర్ను సురక్షితంగా విమానావ్రయంలో ల్యాండ్ చేయగలిగారు. ముందుగానే విషయం తెలియడంతో పలు అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలతో అధికారులు విమానాశ్రయానికి వచ్చారు. గతవారంలో యూపీ మాజీ సీఎం మాయావతి ప్రపయాణిస్తున్న ప్రైవేటు విమానం వెనక చక్రం ల్యాండింగ్ సమయంలో ఇరుక్కుపోయి పెద్ద ప్రమాదం కొద్దిలో తప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement