‘కసబ్’కు కొత్త నిర్వచనం
‘కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ , బచ్చే’ అని చెప్పిన డింపుల్
జౌన్ పూర్: ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల ప్రచారంలో సంక్షిప్త పదాలతో ప్రత్యర్థి పార్టీ లపై విరుచుకుపడుతుండటం కొనసాగుతోం ది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సంధించిన ‘కసబ్’ వాగ్బాణాన్ని యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ భార్య, ఎంపీ డింపుల్ యాదవ్ తిప్పికొట్టారు. ‘క అంటే కాంగ్రెస్ అని బీజేపీ చెబుతోంది. కానీ ‘క’ అంటే కంప్యూటర్ అని మీ అఖిలేశ్ భయ్యా చెప్పారు.
‘స’ అంటే స్మార్ట్‌ఫోన్ . ప్రభుత్వ విధానాలకు సంబంధించిన సమాచారాన్ని మీరు స్మార్ట్ ఫోన్ ద్వారా తెలుసు కోవచ్చు. ఇక ‘బ్’ అంటే బచ్చే (చిన్నా రులు)’ అంటూ డింపుల్ వివరించారు. ఎస్పీ తిరిగి అధికారంలోకి వస్తే విద్యార్థులకు ల్యాప్ ట్యాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు ఇస్తామని సమాజ్‌వాదీ పార్టీ హామీ ఇచ్చింది. గర్భిణులకు ఇంటివద్దనే ఆహార ధాన్యాలు అందిస్తామని డింపుల్ యాదవ్æ హామీ ఇచ్చారు.