
యూపీ ప్రచారంలోకి ప్రియాంక, డింపుల్!
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ చీలికవర్గం నేత, యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార వ్యూహానికి కొత్త హంగులు అద్దుతున్నారు. ఆయన ఎస్పీ వర్గం, కాంగ్రెస్‌ల మధ్య పొత్తు కోసం కసరత్తు జరుగుతోందని సమాచారం. త్వరలో అఖిలేశ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు పొత్తుపై ప్రకటన చేస్తారని అఖిలేశ్ సన్నిహితులు చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి అఖిలేశ్ భార్య, కనౌజ్ ఎంపీ డింపుల్ యాదవ్, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తారని అంటున్నారు. పొత్తు సాకారమైతే ప్రియాంక, డింపుల్‌లు ఎన్నికల్లో ప్రచారం చేసేలా వ్యూహం రూపుదిద్దుకుంటోందని పేర్కొంటున్నారు.
లోక్‌దళ్ గుర్తుపై ములాయం ఆసక్తి
సాక్షి, న్యూఢిల్లీ: ములాయం పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్‌పై ఆశలు వదులుకున్నట్లు తెలుస్తోంది. మాజీ ప్రధాని చరణ్ సింగ్ 1980లో స్థాపించిన లోక్‌దళ్ పార్టీ గుర్తు ‘పొలం దున్నుతున్న రైతు’పై ఆసక్తి చూపుతున్నారు.