ఆకట్టుకుంటున్న శక్తి పోలింగ్‌ స్టేషన్‌ | Poling Station Arranged Like Marriage Ceremony In Andole | Sakshi

ఆకట్టుకుంటున్న శక్తి పోలింగ్‌ స్టేషన్‌

Apr 11 2019 12:13 PM | Updated on Apr 11 2019 12:16 PM

Poling Station Arranged Like Marriage Ceremony In Andole - Sakshi

సాక్షి, జోగిపేట(అందోల్‌): అందోలులోని ఉన్నత పాఠశాలలో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బుధవారం శక్తి పోలింగ్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. నియోజకవర్గానికి ఒక్కటి శక్తి పోలింగ్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలన్న ఆదేశాలు ఉండటంతో అందోలులో ఏర్పాటు చేసినట్లు అందోలు తహసీల్దార్‌ బాల్‌రెడ్డి తెలిపారు. ఈ పోలింగ్‌ కేంద్రానికి వెళ్లే దారిని అందంగా తీర్చిదిద్దారు. ప్రత్యేక కర్టెన్‌లతో స్వాగత తోరణాన్ని ఏర్పాటు చేశారు. వివాహ వేడుకలాగా ఏర్పాటు చేసిన స్వాగతతోరణం బాగా ఆకట్టుకుంటుంది. గ్రామస్తులు ప్రత్యేకంగా ఈ కేంద్రాన్ని చూసి వెళ్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జోగిపేటలోని బాలుర ఉన్నత పాఠశాలలో శక్తి పోలింగ్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement