
వివరాలు సేకరిస్తున్న ఎస్సై
సాక్షి,పెద్దపల్లిఅర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన పోలింగ్‌లో నిట్టూరు గ్రామానికి చెందిన సంపత్ అనే గ్రాడ్యుయేట్ ఓటేస్తు సెల్ఫీ దిగి కాసేపు కలకలం సృష్టించాడు. సెల్ఫీ దిగిన సందర్భంలో ఫ్లాష్‌లైట్ రావడంతో గుర్తించిన ఎన్నికల అధికారి వెంటనే వెబ్‌కాస్టింగ్ వీడియోను పరిశీలించారు. సెల్ఫీ దిగినట్లు వెబ్‌కాస్టింగ్‌లో స్పష్టంగా తెలియడంతో సంపత్‌ను పోలీసులకు అప్పగించారు. సంపత్‌పై 128 ఆర్టీ ఆక్ట్ కింద బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment