
రాంచీ : జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో మూడో విడత పోలింగ్ గురువారం జరుగుతోంది. మొత్తం 17 స్థానాల్లో పోలింగ్ జరుగుతుండగా, అందులో రాజధాని నగరమైన రాంచీ కూడా ఉంది. రాంచీ, హతియా, కాంకె, బర్కత, రామ్‌గడ్ నియోజకవర్గాల్లో పోలింగ్ సమయాన్ని ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్ణయించారు. మిగతా నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్ణయించారు. ఈ విడత పోలింగ్‌లో ముగ్గురు మంత్రుల నియోజకవర్గాలున్నాయి. అంతేకాక, మాజీ ముఖ్యమంత్రి బాబులాల్ మరాండి, మాజీ ఉప ముఖ్యమంత్రి సుదేశ్ మాతోలు కూడా మూడో విడతలో పోటీ పడుతున్నారు.