AP Panchayat Elections 2021: Second Phase Of Polling To Held On Feb 13 - Sakshi
Sakshi News home page

రేపే రెండవ విడత పంచాయతీ ఎన్నికలు

Published Fri, Feb 12 2021 3:32 PM | Last Updated on Fri, Feb 12 2021 4:06 PM

AP Panchayat Elections : 2nd Phase Held By Tommorrow - Sakshi

సాక్షి, విజయవాడ : రెండవ విడత పంచాయతీ ఎన్నికలు రేపే (ఫిబ్రవరి13)జరగనున్నాయి. ఉదయం  6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు రెండవ విడత పోలింగ్‌ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 జిల్లాల్లోని 18 డివిజన్లలో 167 మండలాల్లోని 2786 పంచాయితీలకి ఎన్నికలు ఉండనున్నాయి. దీంతో ఏపీ వ్యాప్తంగా పోలీంగ్‌కి 44గంటల ​ముందే మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఏజెన్సీ గ్రామాల్లో మద్యాహ్నం 1.30 గంటల వరకే పోలింగ్ నిర్వహించి సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. ఫలితాల వెల్లడి అనంతరం ఉపసర్పంచ్ ఎంపిక ప్రక్రియ జరగనుంది. రెండవ విడతకి నోటిఫికేషన్‌ ఇచ్చిన మొత్తం పంచాయతీలు 3328 కాగా, వాటిలో 539 సర్పంచ్‌ స్థానలు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం 33,570 వార్డులు ఉండగా, వాటిలో 12,604 ఏకగ్రీవమయ్యాయి. అయితే 149 వార్డుల్లో నో నామినేషన్‌ ఉండటంతో 20,817 వార్డులకి రేపు ఎన్నికలు జరగనున్నాయి. (అమానుషం: కారుతో మూడుసార్లు తొక్కించి..)

44,876 మంది అభ్య​ర్థులు వార్డులకి పోటీపడనున్నారు. 167 డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ద్వారా ఎన్నికల సామాగ్రిని ఈరోజు రాత్రి వరకే సిబ్బంది పోలింగ్‌ కేంద్రాలకు తరలించనున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 29,304 పోలింగ్‌ కేంద్రాలుండగా వాటిలో 5480 సమస్యాత్మక  కేంద్రాలు ఉండగా,  4181పోలింగ్ కేంద్రాలను  అతి సమస్యాత్మకమైనవిగా అధికారులు గుర్తించారు. ఎన్నికల‌ నిర్వహణకి 18387పెద్ద బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేయగా, 8351 మధ్యరకం, 24034 చిన్న బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు 1292 స్టేజ్ - 1 రిటర్నింగ్ అధికారులు ఉండనుండగా, 3427స్టేజ్ -2 రిటర్నింగ్ అధికారులు,  1370 అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఉండనున్నారు.

ప్రిసైడింగ్ అధికారులు 33835 కాగా, ఇతర పోలింగ్ సిబ్బందితో కలిపి మొత్తం 47492 మంది ఉన్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్దే అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. 32141మంది కౌంటింగ్ సిబ్బంది ఉండగా, పర్యవేక్షణ కోసం జిల్లాకి ఒకరు చొప్పున 13 మంది పంచాయితీ రాజ్ ఉన్నతాధికారులు ఉ‍న్నారు. పంచాయితీ రాజ్ కమీషనర్, డిజిపి కార్యాలయాలలో ఎన్నికల ప్రక్రియ పరిశీలనకి కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎస్ఇసి కార్యాలయంలో వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల‌ కమీషనర్ పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించనున్నారు. (సినిమాలో చూస్తాడు.. బయట చేస్తాడు )

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement