
మధ్యప్రదేశ్‌లో 230 స్థానాలకు నవంబర్ 17న(శుక్రవారం) ఒకే దశలో పోలింగ్ జరిగిన సంగతి తెలిసింది. సుమారు 71.16 శాతం ఓటింగ్ ప్రశాంతంగా జరిగింది. అయితే మధ్యప్రదేశ్‌లోని భింద్‌లోని కిషుపురాలో పోలింగ్ కేంద్రం నెంబర్ 71 బూత్‌లో కొందరు అధికారులు ఓటింగ్ నిబంధనలు ఉల్లంఘించడంతో ఎన్నికల సంఘం రీపోలింగ్‌కు ఆదేశించింది. ఈ నేపథ్యంలో నేడు నవంబర్ 20న(మంగళవారం) ఆ ప్రాంతంలో రీ పోలింగ్ నిర్వహిస్తున్నారు అధికారులు.
ఉదయం 7 గంటలకు ఈ ఓటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రశాంతంగ సాగుతోందని, కట్టుదిట్టమైన భద్రతా చర్యల నడుమ జరుగుతోందని కలెక్టర్ సంజీవ్ శ్రీ వాస్తవ్ అన్నారు. ఇదిలా ఉండగా, మునపటి పోలింగ్‌లో పాల్గొన్న ఆ నలుగురు అధికారులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. వీరిలో ముగ్గర్ని విధుల నుంచి సస్పెండ్ చేయగా, నాల్గవ వ్యక్తి పర్మినెంట్ వర్కర్ అని అతనిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా, అదే నవంబర్ 17వ తేదిన చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల రెండోదశ పోలింగ్ ముగిసింది. ఇక ఆ ఇరు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది.
(చదవండి: కాంగ్రెస్‌కు అవినీతే పరమావధి)
Comments
Please login to add a commentAdd a comment